"షార్" లో కరోనా కలకలం - 12 మందికి పాజిటివ్ : ఏపీలో ఏడు రెట్లు పెరిగిన కేసులు..!!
దేశ వ్యాప్తంగా కల్లోలానికి కారణమవుతున్న కరోనా కేసులు ఏపీలోనూ వేగంగా పెరుగుతున్నాయి. గత అయిదు రోజులుగా రాష్ట్రంలో కేసుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 839 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం 20,80,602 పాజిటివ్ కేసులు చేరాయి. 24 గంటల్లో కరోనాతో ఇద్దరు మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో 14,503 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 3659 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 20,62,440 మంది రికవరీ అయ్యారు.

ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు
సోమవారం రాష్ట్రంలో 122 కరోనా కేసులు మాత్రమే నమోదవగా.. ఐదురోజుల్లోనే రోజుల్లోనే దాదాపు ఏడు రెట్లు కరోనా కేసులు పెరిగాయి. మూడు వేలకు పైగా యాక్టివ్ కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఇది ఇలా కొనసాగుతున్న వేళ.. నెల్లూరు జిల్లా శ్రీహరి కోటలోని షార్ ను కరోనా తాకింది. "షార్" లో ఒకే రోజు ఇద్దరు వైద్యులతో సహా 12 మంది ఉద్యోగులకు పాజిటివ్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఒమిక్రాన్ అనుమానంతో వీరి నమూనాలను ల్యాబ్ కు పంపారు. నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనేందుకు పలువురు ఉద్యోగులు తమ సొంత గ్రామాలకు వెళ్లి తిరిగి విధుల్లో చేరారు.

షార్ లో12 మందికి కరోనా పాజిటివ్
అయితే,
వేరే
ప్రాంతాలకు
వెళ్లి
వచ్చిన
వారికి
షార్
అధికారులు
కరోనా
పరీక్షలు
తప్పని
సరి
చేసారు.
ఆ
పరీక్షల్లో
వీరికి
పాటిజివ్
గా
నిర్దారణ
అయింది.
వీరికి
ఒమిక్రాన్
పరీక్షలు
సైతం
చేస్తున్నట్లుగా
సమాచారం.
దీంతో..ఒకే
సారి
12
మందికి
పాజిటివ్
గా
నిర్దారణ
కావటంతో
అధికారులు
అప్రమత్తం
అయ్యారు.
ప్రత్యేకంగా
విధులకు
హాజరయ్యే
సిబ్బందికి
ప్రత్యేక
గైడ్
లైన్స్
ను
జారీ
చేసారు.
ఇక,
షార్
లో
విధులు
నిర్వహించే
ఉద్యోగులు
నివాసం
ఉండే
ప్రాంతాల్లో
కరోనా
పరీక్షలను
వేగవంం
చేసారు.
ఉద్యోగులు
ముందస్తు
అనుమతి
తీసుకున్న
తరువాతనే
బయటి
ప్రాంతాలకు
వెళ్లాలని
ఉన్నతాధికారులు
స్పష్టం
చేసారు.

షార్ తాజా నిబంధనలు జారీ
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ పరీక్షలు చేయించుకోవటం తప్పని సరి చేసారు. ఆ తరువాత మాత్రమే విధులకు రావాలంటూ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం అటు చెన్నై..ఇటు చిత్తూరు లోనూ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో విధులకు హాజరయ్యే సమయంలోనే వినియోగించే బయో మెట్రిక్ స్థానంలో అటెండెన్స్ రిజిస్టర్ వాడాలని ఆదేశించారు. ప్రస్తుతం కరోనా ప్రభావంతో ఈ నెల చివరి వారంలో జరగాల్సిన రీ శాట్ ప్రయోగం వాయిదా పడే అవకాశం ఉందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే, షార్ సంస్థలో ఇతర ఉద్యోగుల ఆరోగ్యం విషయంలో అన్ని ఏర్పాట్లు చేయటంతో పాటుగా నిబంధనలు కఠినతరం చేసారు.