నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇస్రో మరో వినూత్న ప్రయోగం: కౌంట్‌డౌన్ షురూ: ఎర్త్ అబ్జర్వేషన్: కమర్షియల్‌‌గా

|
Google Oneindia TeluguNews

నెల్లూరు: భారత అంతరిక్ష పరిశోధక సంస్థ.. ఇస్రో మరో వినూత్న ప్రయోగానికి తెర తీసింది. దీనికి ముహూర్తం కూడా ఖాయం చేసింది. కౌంట్‌డౌన్ ఆరంభించింది. పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్‌ (పీఎస్ఎల్వీ)ను అంతరిక్షంలోకి పంపించబోతోంది. నెల్లూరుజిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి శనివారం మధ్యాహ్నం 3:02 నిమిషాలకు పీఎస్ఎల్వీ నింగిలోకి దూసుకెళ్లబోతోంది. మరో 24 గంటల్లో ఎర్త్ అబ్వర్వేషన్ శాటిలైట్‌ ఈఓఎస్-01ను మోసుకుని పీఎల్ఎల్వీ-సీ49 అంతరిక్షానికి బయలుదేరనుంది.

Recommended Video

ISRO : PSLC-C49 ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. కౌంట్‌డౌన్ ప్రారంభం! || Oneindia Telugu

హౌ డేర్: అర్నబ్ అరెస్ట్‌‌‌పై సుప్రీం చీఫ్ జస్టిస్ ఫైర్: కోర్టు ధిక్కరణ: హరీష్ సాల్వే ఎంట్రీహౌ డేర్: అర్నబ్ అరెస్ట్‌‌‌పై సుప్రీం చీఫ్ జస్టిస్ ఫైర్: కోర్టు ధిక్కరణ: హరీష్ సాల్వే ఎంట్రీ

శుక్రవారం మధ్యాహ్నం 1.02 నిమిషాలకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభించినట్లు ఇస్రో ఓ ప్రకటనలో వెల్లడించింది. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ లాంచింగ్ ప్యాడ్ నుంచి ఈ రాకెట్‌ను ప్రయోగించనున్నట్లు తెలిపింది. పీఎస్ఎల్వీల ప్రయోగాల పరంపరలో ఇది 51వ మిషన్. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ వల్ల ప్రకృతి వైపరీత్యాలను ముందుగానే పసిగట్టడానికి వీలు ఉందని ఇస్రో పేర్కొంది. వ్యవసాయం, అడవులు, ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ కార్యక్రమాలకు ఈ మిషన్ దోహదపడుతుందని స్పష్టం చేసింది.

 Countdown begins for launch of earth observation satellite, says ISRO

డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్‌తో కుదర్చుకున్న వ్యాపారాత్మక ఒప్పందాలకు అనుగుణంగా ఈ మిషన్‌ను చేపట్టామని, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఐఎల్) సహకారంతో దీన్ని చేపట్టినట్లు ఇస్రో తెలియజేసింది. కమర్షియల్ అగ్రిమెంట్స్‌లో భాగంగా లిథువేనియాకు సంబంధించిన ఉపగ్రహం, లక్జెంబర్గ్, అమెరికాలకు చెందిన నాలుగు చొప్పున కస్టమర్ శాటిలైట్లను పీఎస్ఎల్వీ-సీ49 ద్వారా అంతరిక్షంలోకి ప్రయోగించనున్నట్లు పేర్కొంది. లక్జెంబర్గ్, అమెరికాలకు సంబంధించిన ఉపగ్రహాల ద్వారా మ్యారిటైమ్ అప్లికేషన్స్, మల్టీ-మిషన్ రిమోట్ సెన్సింగ్ వ్యవస్థలు మెరుగుపడతాయని ఇస్రో తెలిపింది.

English summary
The countdown for the November 7 launch of earth observation satellite EOS-01 along with nine international customer satellites on board launch vehicle PSLV-C49 has begun, ISRO said on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X