ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం కోసం ప్రత్యేక ప్రాజెక్టు: స్పెషలాఫీసర్ గా.. !
అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంలో విద్యా బోధనను ప్రవేశపెట్టడంపై అటు తెలుగు భాషాభిమానుల నుంచి ఇటు ప్రతిపక్ష పార్టీల నాయకుల నుంచి ఎన్ని విమర్శలు ఎదురవుతున్నా.. ప్రభుత్వం ముందుకే వెళ్తోంది. ఆ దిశగా మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియాన్ని ప్రవేశపెట్టడానికి వీలుగా ప్రత్యేకంగా ఓ ప్రాజెక్టును రూపొందదించింది. ప్రాథమిక, ఉన్నత విద్యాశాఖకు చెందిన అధికారులను ఇందులో భాగస్వామ్యులను చేసింది. ఈ ప్రాజెక్టు ప్రత్యేకాధికారిగా యంగ్ ఐఎఎస్ అధికారిణి కే వెట్రిసెల్విని నియమించింది. ప్రస్తుతం ఆమె నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా పని చేస్తున్నారు.

15 వేలకుపైగా ప్రభుత్వ పాఠశాలల్లో..
రాష్ట్రవ్యాప్తంగా మారుమూల గ్రామాలతో పాటు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లీషు మీడియంలో విద్యా బోధనను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. ఒకటో తరగతి నుంచి ఆరవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలోనే బోధన కొనసాగుతుంది. దీనికి సంబంధించి, పాఠ్య పుస్తకాల ముద్రణ మొదలుకుని వసతుల కల్పన, పాఠశాలలకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయులకు మధ్యంతర శిక్షణ ఇవ్వడం వంటి కార్యక్రమాలన్నింటినీ ప్రభుత్వం చేపట్టబోతోంది. మరో రెండు వారాల్లో ఆయా కార్యకలాపాలన్నీ ఆరంభం కాబోతున్నాయి.
అయ్యప్పను దర్శించిన మహిళలు వీరే..తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు

పర్యవేక్షణ కోసం ప్రత్యేక ప్రాజెక్టు..
ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల పనితీరు, ఇతరత్రా కార్యకలాపాలన్నింటినీ ప్రాథమిక విద్యా మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తోంది. కొత్తగా- ఇంగ్లీషు మీడియాన్ని ప్రవేశ పెట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో.. అదనపు భారం పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఫలితంగా- పర్యవేక్షణ ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చని, దాని ప్రభావం క్షేత్రస్థాయిలో విద్యార్థులపై ఉంటుందని యోచిస్తోంది. దీన్ని నివారివంచడానికి ప్రత్యేక ప్రాజెక్టును ఏర్పాటు చేసింది. ఇంగ్లీషు మాధ్యమంలో విద్యాబోధన వరకు ఎలా సాగుతోందన్న విషయాలను పర్యవేక్షించడం వరకు మాత్రమే దీని బాధ్యత.

ప్రత్యేకాధికారిణిగా..
ఈ ప్రాజెక్టు ప్రత్యేకాధికారిణిగా కే వెట్రిసెల్విని నియమించింది ప్రభుత్వం. ప్రస్తుతం ఆమె నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా పని చేస్తున్నారు. తమిళనాడుకు చెందిన వెట్రి సెల్వి 2014 బ్యాచ్ ఏపీ క్యాడర్ అధికారిణి. తన బ్యాచ్ లో ఆమె ర్యాంకర్. 142 ర్యాంక్ తో ఆమె సివిల్స్ ను సాధించారు. శిక్షణ పూర్తి చేసుకున్న తరువాత రాష్ట్రంలోనే అతి పెద్ద రెవెన్యూ డివిజన్ గా పేరున్న మదనపల్లికి సబ్ కలెక్టర్ గా పని చేశారు. విధి నిర్వహణలో ముక్కుసూటిగా వెళ్లే మనస్తత్వం ఉండటం, క్షేత్రస్థాయిలో పరిపాలన యంత్రాంగంపై వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం కీలక బాధ్యతలను అప్పగించింది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!