నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలో తొలి కరోనా పాజిటివ్ కేసు ... ఐసోలేషన్ వార్డులో నెల్లూరు యువకుడు

|
Google Oneindia TeluguNews

చైనాను వణికించిన కరోనా వైరస్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను వణికిస్తుంది. ఇటీవల తెలంగాణలో ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదు కాగా , తాజాగా ఇప్పుడు ఎపీలోనూ కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఏపీ వాసులు భయపడుతున్నారు. ఏపీ సర్కార్ కరోనా వ్యాప్తి చెందకుండా అప్రమత్తం అయ్యింది.

 కరోనా కాలర్ ట్యూన్ : చిరాకులో సెల్ యూజర్స్..తప్పించుకునే '1' టెక్నిక్ కరోనా కాలర్ ట్యూన్ : చిరాకులో సెల్ యూజర్స్..తప్పించుకునే '1' టెక్నిక్

ఏపీలో నెల్లూరు యువకుడికి కరోనా పాజిటివ్ కేసు

ఏపీలో నెల్లూరు యువకుడికి కరోనా పాజిటివ్ కేసు


తెలుగు రాష్ట్రాల్లోనూ ఎక్కడ పడితే అక్కడ కరోనా వ్యాపిస్తుంది అని రూమర్స్ బాగా ప్రచారం అవుతున్నాయి. ఇక తెలంగాణా రాష్ట్రంలో కరోనా కేసు నమోదు కావటంతో తెలంగాణా ప్రజలు భయపడుతున్నారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా కరోనా భయం పట్టుకుంది. ఆంధ్రప్రదేశ్ లో తొలి కరోనా కేసు నమోదైంది. కరోనా వైరస్ లక్షణాలతో నిన్న నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో చేరిన వ్యక్తికి వైద్య పరీక్షలు నిర్వహించగా అతడి రిపోర్ట్స్ పాజిటివ్‌గా వచ్చినట్లు తెలుస్తోంది. ఇది ఏపీలో నమోదైన తొలి కరోనా కేసుగా వెల్లడించారు వైద్యాధికారులు.

 ఇటలీ నుండి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్

ఇటలీ నుండి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్

నెల్లూరులోని చిన్న బజారుకు చెందిన ఓ వ్యక్తి రెండు రోజుల క్రితమే ఇటలీ నుంచి వచ్చారు. అతడు జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతుండటంతో మంగళవారం ఆస్పత్రిలో చేర్పించారు. ఇక అతనికి వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో కరోనా భాదితుల కోసం ప్రత్యేకించి ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. పాజిటివ్ కేసు నమోదు కావడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

ఇటలీ నుంచి ఏపీకి ఇప్పటికి 75 మంది

ఇటలీ నుంచి ఏపీకి ఇప్పటికి 75 మంది

ఇక ఏపీలోనూ కరోనా పాజిటివ్ గా నెల్లూరు యువకుడు ఆస్పత్రిలో చేరడంతో ఏపీ సర్కారు అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇటలీ నుంచి వచ్చిన ఏపీ వాసులకు ప్రభుత్వం ఇళ్ళ నుండి బయటకు రావద్దని , తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది . ఇటలీ నుంచి పలు దఫాల్లో 75 మంది ఏపీకి వచ్చారు. అయితే, ఆ దేశంలో కరోనా విజృంభించిన నేపథ్యంలో అక్కడి నుంచి వచ్చిన వాళ్లంతా ఇంట్లోనే ఉండాలి.

అప్రమత్తం అయిన ఏపీ సర్కార్

అప్రమత్తం అయిన ఏపీ సర్కార్

14 రోజుల పాటు ఇంట్లో ఏకాంతంగా, ఐసోలేటెడ్ గదిలో ఉండాలి. ఈ రోజుల్లో ఇంట్లో వాళ్లను గానీ, చుట్టాలను గానీ కలవవద్దు. గది దాటి బయటికి రాకూడదు అని సూచించింది. ఇప్పుడు ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదు అయిన నేపధ్యంలో ఏపీ సర్కార్ వైద్య శాఖను అప్రమత్తం చేసింది. వైద్య సహాయం అందించటమే కాదు తక్షణ జాగ్రతత చర్యలు తీసుకోవాలని కోరింది.

English summary
A man from Nellore came from Italy two days ago. He was admitted to the hospital on Tuesday after suffering from cold, cough and fever. Corona was positive when he underwent medical tests. This has resulted in a specially arranged isolation ward for corona victims. Locals are panicking as a positive case is registered.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X