మంత్రి నారాయణ సంస్థల పై ఐటి దాడులు..!? ఎన్నికల వేళ టిడిపిలో కలవరం..!!
ఒకవైపు ముఖ్యమంత్రి..టిడిపి నేతలు నాలుగు రోజుల్లో ఏపి లోని టిడిపి నేతల పై ఐటి దాడులు జరుగుతాయని చెబుత న్నారు. సరిగ్గా ఇదే సమయంలో టిడిపిలో ఆర్దికంగా బలమైన నేత..నారాయణ విద్యా సంస్థల అధినేత అయిన మంత్రి నారాయణ సంస్థల పై ఆదాయపు పన్ను అధికారులు దాడులు ప్రారంభించారు. ఎన్నికల వేళ ఈ వ్యవహారం టిడిపి లో కలకలం రేపుతోంది..

నారాయణ సంస్థల్లో ఐటి అధికారులు..!
నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీలో ఐటీ దాడులు జరుగుతున్నాయి. మెడికల్ కాలేజీ కార్యాలయం, మంత్రి నారాయ ణ నివాసంలో సైతం ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. దాదాపు నాలుగు బృందాలు కాలేజీ లోపలికి ప్రవేశించి కార్యాలయంలో, మంత్రి నారాయణ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల సమయంలో అదీ ప్రచార సమయంలో ఈ దాడులు జరగడంతో టిడిపిలో కలవరం మొదలైంది.సరిగ్గా ఇదే సమయంలో విజయన గరం జిల్లా చీపురుపల్లి సభలో చంద్రబాబు మాట్లాడుతూ నేడో, రేపో దాడులు జరిగే అవకాశముందని అనుమానం వ్యక్తం చేసిన కొద్ది నిమిషాల్లోనే ఈ దాడులు జరగడం కొసమెరుపు. ఐటి దాడుల మంత్రి నారాయణ లేదా ఆయన కుటుంబ సభ్యులు ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు.
పాకిస్థాన్ మరో కుట్ర : భారత కరెన్సీ పాకిస్థాన్ లో ప్రింటింగ్ హైదరాబాద్ లో చలామని !
టిడిపిలో కలవరం..
ఉదయం టిడిపి అధికార ప్రతినిధి మీడియా సమావేశంలో నాలుగు రోజుల్లో టిడిపి అభ్యర్దులే లక్ష్యంగా ఐటి దాడులు జరుగుతాయని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి సైతం అదే వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడు సడన్ గా నెల్లూరు అర్బన్ అభ్యర్ది గా టిడిపి నుండి పోటీ చేస్తున్న నారాయణ సంస్థల పై ఐటి దాడులు టిడిపిలో ఒక్కసారిగా కలవరపాటును సృష్టించాయి. దీనిని కేంద్రం వేధింపు చర్యల్లో భాగంగా టిడిపి నేతలు చెబుతున్నారు. గతంలోనూ విజయవాడలోని నారాయణ సంస్థల పై ఐటి దాడులు జరిగాయనే ప్రచారం జరిగింది. ఆ సమయంలో మంత్రి నారాయణ వెంటనే స్పందించి ఐటి దాడులు జరగలేదని ఖండించారు. ఇప్పుడు అటువంటి ఖండన ప్రకటనలు రాకపోవటంతో నిజంగా దాడులు జరిగాయా లేదా అన్నది అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!