• search
  • Live TV
నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఓట్లు వేయ‌ర‌నుకుంటే చంపిస్తారేమో..గ్రామాలు త‌గ‌ల‌బెడ‌తారామో : డేటా ప్ర‌జ‌ల సొత్తు :జ‌గ‌న్ సంచ‌ల‌నం..

|

ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పై వైసిపి అధినేత జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. ప్ర‌జ‌ల సొత్తు అయిన సున్నిత స‌మాచారాన్ని త‌న ప్రయివేటు సంస్థ‌ల‌కు అప్ప‌గించార‌ని ఆరోపించారు. వైసిపి సానుభూతి ప‌రుల ఓట్లు తొలిగిస్తూ.. దొంగ త‌నం చేసి ఆయ‌నే దొంగ దొంగ అని అంటున్నార‌ని విరుచుకుప‌డ్డారు. ఇక‌, ముఖ్య‌మంత్రి తీరు పై జ‌గ‌న్ మండి ప‌డ్డారు. ప్ర‌జాస్వామ్యాన్ని రక్షించుకోవాల‌ని పిలుపునిచ్చారు.

చంపేస్తారేమో..త‌గ‌లెడ‌తారేమో..

చంపేస్తారేమో..త‌గ‌లెడ‌తారేమో..

ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు..ఆయ‌న త‌న‌యుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెల‌వాల‌నే ల‌క్ష్యంతో కుట్ర‌లు చేస్తు న్నార‌ని వైసిపి అధినేత జ‌గ‌న్ తీవ్ర ఆరోప‌ణ‌లు చేసారు. ప్ర‌జ‌ల‌కు సంబంధించిన స‌మాచారాన్ని పార్టీ యాప్ ల కోసం దొంగ త‌నం చేసి..సొంత సంస్థ‌ల‌కు అప్ప‌గించార‌ని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఇష్టానుసారం ఓట్లు తొలిగిస్తున్నార‌ని.. త‌న చిన్నాన్న వివేకానంద‌రెడ్డి పేరు తొలిగించేందుకు ప్ర‌య‌త్నించార‌ని..లోకేష్ పేరు మాత్రం తొలిగించ‌ర‌ని జ‌గ‌న్ ఆరోపించారు. తాము ఇప్ప‌టికే ఓట్ల గ‌ల్లంతు వ్య‌వ‌హారం పై కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి నివేదిక ఇచ్చామ‌ని.. ఏపిలో మాత్రం ముఖ్య‌మంత్రి నిస్సిగ్గుగా వ్య‌వ‌హ‌రిస్త‌న్నార‌ని ఫైర్ అయ్యారు. త‌మ‌కు ఓటు వేయ‌ర‌ని తెలిస్తే చంపేస్తారేమో.. గ్రామాల‌ను త‌గ‌ల‌బెడ‌తారేమో అని జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు.

డేటా వార్ పై న్యాయ చర్యలు .. ఏపీ క్యాబినెట్ భేటీలో నిర్ణయం

నీ సొత్తు కాదు..ప్ర‌జ‌ల సొత్తు..

నీ సొత్తు కాదు..ప్ర‌జ‌ల సొత్తు..

రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు సంబంధించిన డేటా చంద్ర‌బాబు సొంత సొత్తులా ప్ర‌యివేటు కంపెనీల‌ను అందించార‌ని విరుచుకు ప‌డ్డారు. ఎన్నిక‌ల సంఘం వ‌ద్ద మాత్రమే ఉండే క‌ల‌ర్ ఫొటోల డేటా చంద్ర‌బాబుకు చెందిన ప్ర‌యివేటు కంపెనీకి ఎలా వెళ్లింద‌ని ప్ర‌శ్నించారు. అదే విధంగా ప్ర‌భుత్వానికి సంబంధించిన ఆధార్ డేటా ఆ కంపెనీల‌కు ఎలా వ‌స్తుంద‌ని జ‌గ‌న్ నిల‌దీసారు. ప్ర‌జ‌ల‌కు సంబంధించిన డేటా ప్ర‌యివేటు సంస్థ‌ల‌కు ఎన్నిక‌ల కోసం..పార్టీ యాప్ కోసం ఇవ్వ‌టం పెద్ద నేర‌మ‌ని వివ‌రించారు. ప్ర‌జ‌ల‌కు సంబంధించిన సున్నిత‌మైన డేలా ఎవ‌రి వ‌ద్ద ఉండ‌కూడ‌ద‌ని సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గ ద‌ర్శ‌కాల‌ను జ‌గ‌న్ గుర్తు చేసారు. ఒక దొంగ ఏపిని పాలిస్తున్నాడ‌ని.. ఒక రాక్ష‌సుడు - నేర‌గాడు ఏపిని పాలిస్తున్నా డ‌ని జ‌గ‌న్ తీవ్ర వ్యాఖ్య‌లు చేసారు. ఏపి పోలీసుల‌కు వాచ్‌మెన్ల కంటే దారుణంగా వాడుకుంటున్నార‌ని.. తెలంగాణ పోలీసులు కేసు పెడితే బెదిరింపుల‌కు దిగుతున్నార‌ని పేర్కొన్నారు.

సీయంకు శిక్ష ప‌డాల్సిందే..

సీయంకు శిక్ష ప‌డాల్సిందే..

గ‌తంలో ఓటుకు నోటు కేసు స‌మ‌యంలోనూ చంద్ర‌బాబు ఇటువంటి వ్యాఖ్య‌లే చేసార‌ని జ‌గ‌న్ గుర్తు చేసారు. చంద్ర బాబు..లోకేష్ కు అత్యంత సన్నిహితంగా ఉండే వారే ఆ కంపెనీలు నిర్వ‌హిస్తున్నార‌ని చెప్పుకొచ్చారు. కంపెనీల నిర్వ హ‌కుల‌ను ర‌క్షించ‌టానికి వారి నుండి వాట్స‌ప్ మెసేజ్ లు సీయం కు వెళ్తున్నాయ‌ని ఆరోపించారు. త‌ప్పు చేస్తున్న సీయం ను ఎల్లో మీడియా భుజాల మీద ఎక్కించుకొని మోస్తుంద‌ని దుయ్య‌బ‌ట్టారు. ప్ర‌జ‌ల‌కు సంబంధించిన బ్యాంకు ఖాతాల వివ‌రాలు ఉంటాయ‌ని..ఆ వివ‌రాల‌న్నీ సేవా మిత్రా యాప్‌లోకి వెళ్లాయ‌ని వివ‌రించారు. ప్ర‌జ‌ల వ్య‌క్తిగ‌త వివ‌రా ల‌ను సేవామిత్ర యాప్ కు అనుసంధానం చేసి పార్టీ నేత‌ల‌కు పంపుతున్నార‌ని ఆరోపించారు. ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తు న్న సీయం కు శిక్ష ప‌డాల్సిందేన‌న్నారు జ‌గ‌న్.

English summary
YCP Chief Jagan sensational comments on Chandra Babu naidu and Lokesh. Jagan says If any body do not vote for TDP.. themy kill by party leaders. Jagan also cornered CM and lokesh on Data thefting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X