నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కృష్ణపట్నం పోర్టుపై అదానీ గ్రూప్ దే బాధ్యత : ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా నిర్మాణ రంగంలో దూసుకుపోతున్న అదానీ గ్రూప్ ఏపీలోని కృష్ణపట్నం పోర్టు కాంట్రాక్ట్ ని సైతం దక్కించుకుంది. ఇక దీనికి ఏపి క్యాబినెట్ కూడా అప్రూవల్ ఇచ్చింది. కృష్ణపట్నం పోర్ట్ కంపెనీ లిమిటెడ్ (కెపిసిఎల్) లో 75 శాతం వాటాను కొనుగోలు చేయడానికి కొంతకాలంగా అదానీ గ్రూప్ ప్రయత్నం చేసింది. కృష్ణపట్నం పోర్టు లో 75 శాతం అదానీ పోర్ట్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ సంస్థకు ఇస్తున్నట్లుగా ప్రకటించింది. సీసీఐ ఆమోదం తెలిపిన నెల పదిహేను రోజుల తర్వాత ఏపీ ప్రభుత్వం కూడా అదాని గ్రూప్ కు కృష్ణపట్నం పోర్ట్ కాంట్రాక్ట్ ఓకే చేసింది.

అదానీ గ్రూప్ కు కృష్ణపట్నం పోర్టు .. ఏపీ క్యాబినెట్ ఆమోదం

అదానీ గ్రూప్ కు కృష్ణపట్నం పోర్టు .. ఏపీ క్యాబినెట్ ఆమోదం

అదాని పోర్ట్స్ మరియు స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ (ఎపిఎస్ఇజెడ్) కోసం డెక్స్ క్లియర్ చేస్తూ, కృష్ణపట్నం పోర్ట్ ఒప్పందానికి ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. అదాని గ్రూప్ వాటా విలువ ₹ 13,572 కోట్లు.

కేపీసీఎల్ నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం వద్ద కృష్ణపట్నం పోర్ట్ కంపెనీలో వాటాదారుల మార్పును నిన్న జరిగిన భేటీలో ఏపీ కేబినెట్ ఆమోదించింది అని ఏపీ పారిశ్రామిక శాఖామంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు .

కాకినాడ పోర్ట్ కంటే ఎగుమతులు, దిగుమతుల్లో కీలకంగా కృష్ణపట్నం పోర్టు

కాకినాడ పోర్ట్ కంటే ఎగుమతులు, దిగుమతుల్లో కీలకంగా కృష్ణపట్నం పోర్టు

అదానీ గ్రూప్ కృష్ణపట్నం పోర్ట్ ఒప్పందం యొక్క ఈక్విటీ భాగం (పోర్ట్ ఆపరేటింగ్ కంపెనీ సుమారు 6,212 కోట్ల రుణాలు మినహాయించి) 7,360 కోట్ల విలువ. కృష్ణపట్నం భారతదేశంలో రెండవ అతిపెద్ద ప్రైవేట్ ఓడరేవు మరియు ఆంధ్ర ప్రదేశ్ లో అతిపెద్దది. 2008లో ఏర్పాటైన కృష్ణపట్నం ఓడరేవు, కాకినాడ పోర్ట్ కంటే మూడింతలు పెద్దది .కాకినాడ పోర్టు కంటే ఎగుమతులు దిగుమతుల విషయంలో కృష్ణపట్నం ఓడరేవు కీలక భూమిక పోషిస్తుంది.

అదాని గ్రూప్ కు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనుమతి

అదాని గ్రూప్ కు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనుమతి


గతేడాది కాకినాడ పోర్టు 18 మిలియన్ టన్నుల ఎగుమతులు దిగుమతులు సాగిస్తే కృష్ణపట్నం పోర్టు గత ఏడాది 54.4 మిలియన్ టన్నులు ఎగుమతులు దిగుమతులు సాగించింది.

కృష్ణపట్నం ఓడరేవు కి సంబంధించి ఈ ఒప్పందానికి అదానీ గ్రూప్ కు సిసిఐ అనుమతి లభించింది. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అదాని గ్రూప్ కు అనుమతి ఇచ్చింది. దీంతో అదాని గ్రూప్ కు కృష్ణపట్నం పోర్టు దక్కినట్లు తెలుస్తోంది. కృష్ణపట్నం పోర్టు కొనుగోలు చేసినప్పటికీ ప్రస్తుతం ఉన్న మేనేజ్మెంట్ పోర్ట్ నిర్వహిస్తుందని పోర్టు వర్గాలు చెబుతున్నాయి.

నిర్వహణా బాధ్యత సివిఆర్ గ్రూప్‌ కే

నిర్వహణా బాధ్యత సివిఆర్ గ్రూప్‌ కే

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యాజమాన్యంలోని కృష్ణపట్నం ఓడరేవును హైదరాబాద్‌కు చెందిన సివిఆర్ గ్రూప్‌కు మార్చి 2009 నుండి 30 సంవత్సరాల ఒప్పందంపై అభివృద్ధి మరియు కార్యకలాపాలనిర్వహణ కోసం ఇచ్చారు. కృష్ణ పట్నం పోర్టు బాధ్యతలు ఇకపై అదానీ గ్రూప్ కే సంబంధం అని పేర్కొన్నారు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి . ప్రభుత్వం తరపున ఎన్.ఓ.సి. ఇచ్చామని ఏపీ భారీ పరిశ్రమల శాఖా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు.

English summary
Adani Group, which is booming in the construction sector across the country, has also secured a contract for Krishnapatnam Port in AP. It was also approved by the AP cabinet. The Adani Group has been trying for some time to buy a 75 per cent stake in Krishnapatnam Port Company Limited (KPCL). A month and a half later, the Commission of India awarded the Krishnapatnam port contract to its group.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X