నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వీడు మామూలోడు కాదు.. పూటకో వేషం.. రోజుకో మోసం..!

|
Google Oneindia TeluguNews

నెల్లూరు : పూటకో వేషం వేస్తున్నాడు. రోజుకో మోసం చేస్తున్నాడు. నకిలీ అధికారిగా చలామణీ అవుతూ అమాయకుల్ని నట్టేట ముంచుతున్నాడు. అందినకాడికి దోచుకుంటూ పారిపోతున్నాడు. చివరకు పాపం పండి పోలీసులకు దొరకడంతో సదరు మోసగాడి బండారం బయటపడింది. నెల్లూరు జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చానీయాంశమైంది.

అమాయకులే అతడి టార్గెట్. ఒక్కటని కాదు వివిధ రకాల వేషాలతో జనాలను బురిడీ కొట్టించడంలో సిద్ధహస్తుడు. ఒకసారి పోలీస్ అంటాడు.. అంతలోనే రెవెన్యూ అధికారినంటాడు. అలా సందర్భాన్ని బట్టి వేషాలు మారుస్తూ అమాయకుల జేబులకు చిల్లులు పెడుతున్నాడు. చివరకు పోలీసులకు అడ్డంగా దొరకడంతో మోసగాడి లీలలు బయటపడ్డాయి.

చిన్ననాటి నుంచే వ్యసనాలు.. నేరాల బాట

చిన్ననాటి నుంచే వ్యసనాలు.. నేరాల బాట

వైఎస్‌ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ల పెద్దమసీదు వీధికి చెందిన షేక్ మహ్మద్ షఫీ చిన్ననాటి నుంచే వ్యసనాలకు బానిసయ్యాడు. ఆ క్రమంలో విలాసవంతమైన జీవితానికి అలవాటుపడ్డాడు. అలా డబ్బుల కోసం నేరాల బాట పట్టాడు. అప్పట్లో ఒకరిని హత్య చేసి కేసులో ఇరుక్కున్నాడు. దాంతో పోలీసుల నిఘా పెరగడంతో పదేళ్ల కిందట నెల్లూరుకు వచ్చి స్థిరపడ్డాడు. సాలుచింతల సమీపంలో ఇల్లు అద్దెకు తీసుకుని ఓ మహిళతో సహజీవనం సాగిస్తున్నాడు.

లగ్జరీ లైఫ్‌కు అలవాటుపడ్డ షఫీ పూటకో వేషమేస్తూ రోజుకో మోసం చేస్తూ బతికేస్తున్నాడు. ఒకసారి పోలీస్ అవతారమెత్తితే మరోసారి రెవెన్యూ ఆఫీసర్‌నంటాడు. ఇంకోసారి బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్, కలెక్టరేట్ ఉద్యోగి.. అలా సందర్భాన్ని బట్టి రంగులు మార్చేస్తాడు. అమాయకులే టార్గెట్‌గా మోసాలకు తెర తీస్తాడు.

కాకితో కాసుల బేరం: కాల్ చేస్తే వాలిపోతాడు.. ఆ తంతు ముగిస్తాడు..!కాకితో కాసుల బేరం: కాల్ చేస్తే వాలిపోతాడు.. ఆ తంతు ముగిస్తాడు..!

 పోలీస్‌నంటూ మేస్త్రీని బెదిరించి.. !

పోలీస్‌నంటూ మేస్త్రీని బెదిరించి.. !


వివిధ రకాల వేషాలు వేస్తూ పలువుర్ని మోసగిస్తున్న షఫీ గుట్టురట్టైంది. ఈ నెల 11వ తేదీన పోలీస్ అవతారమెత్తి ఓ మేస్త్రీని మోసం చేయడంతో విషయం వెలుగు చూసింది. చిన్నబజారు పోలీస్ స్టేషన్ పరిధిలోని రాధాకృష్ణ స్వీట్ హౌజ్ సమీపంలో మేస్త్రీ రమణయ్యను అడ్డగించి భయపెట్టాడు. బస్‌స్టాండ్‌లో దొంగతనం చేశావంటూ అతడిపై కేకలేశాడు. అతడు చెప్పేది వినిపించుకోకుండా 13 వేల రూపాయలు లాక్కున్నాడు.

పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఎస్సైని కలవాలంటూ చెప్పి అక్కడినుంచి మాయమయ్యాడు. ఊహించని పరిణామంతో కంగుతిన్న మేస్త్రీ రమణయ్య నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సీఐని కలిశాడు. జరిగిన విషయం వివరించడంతో కేసు నమోదు చేశారు.

 పలు నేరాల్లో నిందితుడు..

పలు నేరాల్లో నిందితుడు..

షఫీ కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు అతడిని అరెస్ట్ చేసే పనిలో పడ్డారు. శనివారం నాడు కూరగాయల మార్కెట్‌లో ఉన్నాడనే సమాచారం మేరకు అక్కడకు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్‌కు తీసుకెళ్లి దర్యాప్తు చేయగా పలు నేరాలు చేసినట్లు అంగీకరించాడు. అతడి నుంచి 60 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.

నెల్లూరులోని సంతపేట, దర్గామిట్ట, నవాబుపేట తదితర ప్రాంతాల్లో నేరాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. అయితే చాలాకేసుల్లో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. ఇదివరకు 2017లో పోలీస్ వేషంలో చోరీకి పాల్పడ్డ షఫీని నవాబుపేట పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. 2018లో కూడా సంతపేట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. అదలావుంటే బెయిల్‌పై బయటకొచ్చిన షఫీ తిరిగి నేరాలకు పాల్పడ్డాడు.

English summary
Nellore Police arrested a person who was cheating in the government officials getup. He cheated the public in the name of government officers like police, revenue, collectorate employee.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X