• search
  • Live TV
నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

నెల్లూరుకు పాకిన మెట్రో స్టైల్.. స్పా ముసుగులో వ్యభిచారం..!

|

నెల్లూరు : మెట్రో నగరాల పోకడ పట్టణాలకు చేరుతున్న వైనం విస్మయం కలిగిస్తోంది. మెట్రో కల్చర్ నగరాలను దాటి పట్టణాలకు చేరుతున్న వేళ ఆందోళన వ్యక్తమవుతోంది. ఆ క్రమంలో నెల్లూరులో వెలుగుచూసిన ఘటన చర్చానీయాంశంగా మారింది. స్పా ముసుగులో కొందరు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వైనం బయటపడింది. దాంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి నిర్వాహకుల గుట్టురట్టు చేశారు.

మెట్రో నగరాల్లో కన్పించే స్పా కల్చర్ నెల్లూరులో దర్శనమివ్వడం.. ఆ పేరు చెప్పి అక్కడ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటం స్థానికులు నివ్వెరపోయేలా చేసింది. మసాజ్ ముసుగులో గలీజు దందా చేస్తున్న ముఠా పోలీసులకు చిక్కడం హాట్ టాపికయింది.

 నెల్లూరులో వ్యభిచారం.. స్పా ముసుగులో దందా

నెల్లూరులో వ్యభిచారం.. స్పా ముసుగులో దందా

మెట్రో కల్చర్ నగరాలు దాటుతోంది. క్రమక్రమంగా పట్టణాలకు చేరుతోంది. అదే క్రమంలో నెల్లూరులో స్పా ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న ముఠా గుట్టురట్టైంది. స్థానిక మాగుంట లేఔట్‌లో స్పా పేరిట రెచ్చిపోతున్న కొందరు చివరకు పోలీసుల వలకు చిక్కారు. సోమవారం నాడు స్పా సెంటర్‌పై దాడిచేయడంతో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి.

వెంకటగిరి ప్రాంతానికి చెందిన ధనుంజయ రెడ్డి అనే వ్యక్తి కొన్నేళ్ల కిందట నెల్లూరుకు వచ్చారు. మాగుంట లేఔట్‌లో నివాసం ఉంటూ వ్యాపారాలు చేసుకుంటున్నాడు. ఆ క్రమంలో స్పా పెడితే బాగుంటుందనే ఆలోచన వచ్చి శ్రీకారం చుట్టారు. అదే ప్రాంతంలో మెయిన్ రోడ్డుపై గల స్టూడియో 11 సెలూన్ అండ్ స్పా సెంటర్‌ను లీజుకు తీసుకున్నారు. దాదాపు నెలకు 70 వేల రూపాయల లీజ్ ఎమౌంట్ పే చేస్తూ దాన్ని నడిపిస్తున్నారు.

ఈ పచ్చ రాయికి మహిమలెక్కువ.. శివలింగం పేరుతో 2 కోట్ల బేరం.. చివరకు..!

 బోర్డేమో స్పా సెంటర్.. లోనికెళితే ఆ మజా..!

బోర్డేమో స్పా సెంటర్.. లోనికెళితే ఆ మజా..!

సదరు స్పా సెంటర్ ధనుంజయ రెడ్డి చేతిలోకి వచ్చాక దాని రూపురేఖలు మారిపోయాయి. స్పా సెంటర్‌ను అత్యాధునిక హంగులతో రెనోవేట్ చేయించారు. ఇక అక్కడి నుంచి తన బిజినెస్ తెలివితేటలను కార్యరూపంలోకి తీసుకొచ్చారు. పలు ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి.. స్పా కు వచ్చే కస్టమర్లకు మసాజ్ సర్వీస్ ఆఫర్ చేసేవారు. ఆ క్రమంలో ఆ అమ్మాయిలతోనే వ్యభిచారం చేయిస్తూ వచ్చారు.

స్పా సెంటర్ కాస్తా వ్యభిచార కూపంగా మారింది. దాంతో కస్టమర్ల సంఖ్య కూడా పెరిగింది. నిత్యం విటులతో కిటకిటలాడుతూ దినాదినాభివృద్ధి చెందింది సదరు స్పా సెంటర్ కమ్ బ్రోతల్ హౌస్. అయితే యజమాని ధనుంజయ రెడ్డి మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించేవారు. స్పా సెంటర్‌కు సంబంధించిన లావాదేవీలు మొత్తం ఫోన్ ద్వారానే జరిగేలా చూసుకున్నారు. అలా అక్కడి విషయాలు బయటకు రాకుండా మెయిన్‌టెయిన్ చేశారు.

పోలీసులు అటాక్.. నిర్వాహకుడికి చెక్

పోలీసులు అటాక్.. నిర్వాహకుడికి చెక్

స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారం మేరకు జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి రంగంలోకి దిగారు. ఆయన ఆదేశాలతో నెల్లూరు డీఎస్పీ శ్రీనివాసులు స్పా సెంటర్‌పై ఓ కన్నేశారు. నిఘా పెట్టడంతో గుట్టురట్టైంది. అదే క్రమంలో సోమవారం నాడు వ్యభిచారం జరుగుతోందన్న పక్కా సమాచారంతో డీఎస్పీ శ్రీనివాసులు, ఇతర పోలీస్ సిబ్బంది స్పా సెంటర్‌పై దాడి చేశారు. వ్యభిచారం జరుగుతుందని నిర్ధారించుకుని నిర్వాహకుడితో పాటు ఇద్దరు విటులను, మరో ఇద్దరు సెక్స్‌వర్కర్లను అదుపులోకి తీసుకున్నారు.

అదలావుంటే నిర్వాహకుడు ధనుంజయ రెడ్డి ఫోన్ పరిశీలించిన పోలీసాధికారులు నివ్వెరపోయారు. ఆ ఫోన్ నిండా అశ్లీల చిత్రాలు.. విటుల నంబర్లు కనిపించేసరికి కంగుతిన్నారు. ఇద్దరు విటులతో పాటు నిర్వాహకుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు ఫైల్ చేశారు. అలాగే ఇద్దరు సెక్స్ వర్కర్లను స్థానిక రెస్క్యూ హోమ్‌కు తరలించారు.

కశ్మీర్ బిల్లును వ్యతిరేకించే నేతలు దేశద్రోహులే.. లోక్‌సభలో టీఆర్ఎస్ సంచలన వ్యాఖ్యలు

 అక్కడ వ్యభిచారం జరుగుతోందా.. నోరెళ్లబెట్టిన స్థానికులు..!

అక్కడ వ్యభిచారం జరుగుతోందా.. నోరెళ్లబెట్టిన స్థానికులు..!

మెట్రో నగరాల్లో కనిపించే స్పా సెంటర్ నెల్లూరులో దర్శనమివ్వడం.. మసాజ్ పేరిట వ్యభిచారం నిర్వహించడం.. స్థానికులను విస్మయానికి గురిచేస్తోంది. ఇక్కడో ట్విస్టు ఏంటంటే రెసిడెన్షియల్ కాంప్లెక్సులో ఇలాంటి దందాలు చేస్తే దొరికిపోతామనే భయంతో నిర్వాహకుడు కమర్షియల్ బిల్డింగ్‌ను ఎంచుకోవడం గమనార్హం. చుట్టుపక్కల వారికి కూడా అక్కడ మసాజ్ సెంటర్ ఉందనే విషయం తెలుసు కానీ అందులో వ్యభిచారం నిర్వహిస్తున్నారనేది మాత్రం తెలియదు. దాంతో ఇన్ని రోజులు నిర్వాహకుడికి కాసుల పంట పండింది.

సదరు స్పా సెంటర్ పై పోలీసులు దాడి చేసి నుంచి విటులను, సెక్స్ వర్కర్లను బయటకు తీసుకురావడంతో స్థానికులు అవాక్కయ్యారు. ఇక్కడ వ్యభిచారం జరుగుతోందా అంటూ నోరెళ్లబెట్టారు. ఇదొక్కటే కాదు నగరంలో ఇలాంటి సెంటర్లు మరిన్ని ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Metro Culture Came to Towns also as where seen in Major Cities. Metro culture reaches towns beyond the cities. To that end, the event at Nellore became a subject of debate. In the guise of a spa, the owner conducting prostitution. The police has been caught by a gang of people who were involved in prostitution.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more