నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నాకు ఏదీ అవసరం లేదు..అనుచరుడిగా ఉంటా చాలు: సీఎం సమక్షంలో ఆ మంత్రి భావోద్వేగం..!

|
Google Oneindia TeluguNews

ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ భావోద్వేగానికి గురయ్యారు. ముఖ్యమంత్రి అయిన తరువాత జగన్ తొలి సారి నెల్లూరు వచ్చారు. రైతు భరోసా ప్రారంభం కోసం నెల్లూరు వచ్చిన ఆయన..ఏర్పాటు చేసిన సభలో ముందుగా జిల్లా నేతలు మాట్లాడారు. మంత్రి అనిల్ మాట్లాడుతూ ఒక్క సారిగా ఉద్వేగానికి గురయ్యారు. మాట్లాడారు. స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్ల తరువాత నెల్లూరు జిల్లాలో బీసీలకు మంత్రి పదవి ఇచ్చింది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మాత్రమేనని.. తనను ఎమ్మెల్యేగా, జిల్లాలో బీసీ మంత్రిగా చేశారని.. ఇంతకంటే తనకేమి అవసరం లేదని, నా జన్మ ధన్యమైందని మంత్రి అనిల్‌ కుమార్‌ పేర్కొన్నారు. జీవింతాంతం జగనన్న అనుచరుడిగా ఉంటానని స్పష్టం చేశారు.

సీఎం జగన్ కు ప్రశంసలు

నెల్లూరు జిల్లాలో వైయస్‌ఆర్‌ రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు మంత్రి అనిల్. రాష్ట్రంలో రైతులకు సంబంధించిన ప్రతిష్టాత్మక కార్యక్రమం ఈ రోజు ప్రారంభమైందన్నారు.. నాడు పాదయాత్రలో రైతులకు నాలుగేళ్ల పాటు ఏటా రూ,12,500 ఇస్తామన్న మన నేత ..ఇవాళ దానికి మరో వెయ్యి పెంచి తండ్రికి తగ్గ తనయుడని మరోసారి నిరూపించుకున్నారుని ప్రశంసించారు.

మనసున్న రాజు ఉంటే భగవంతుడు సైతం కరుగుతాడని నానుడిని గుర్తు చేస్తూ..ఈ రోజు రాష్ట్రంలోని జలాశయాలన్నీ కూడా నీటితో కళకళలాడుతున్నాయని వివరించారు. దివంగత వైఎస్సార్‌ పాలన తరువాత మరోసారి పులిచింతల, సోమశీల వంటి ప్రాజెక్టులు నిండాయని చెప్పుకొచ్చారు. 75 టీఎంసీల నీటిని నిల్వ చేసింది ఈ ఏడాదే అని చెప్పారు. నిన్న చంద్రబాబు ఇక్కడికి వచ్చి తన వల్లే జలాశయాలు నిండాయని చెప్పారు. చాలా ఏళ్ల తరువాత చంద్రబాబు నిజం చెప్పారు. ఆయన దరిద్రం వల్లే ఇన్నాళ్లు నిండలేదు. ఆయన సీఎంగా దిగిపోగానే జలాశయాలు నిండాయిని వివరించారు.

Minister Anil Kumar Yadav emotinal speech in presence of CM Jagan in nellore meeting

ఇంకేమీ అక్కర్లేదు..అనుచరుడిగా ఉంటా

అదే సమయంలో మంత్రి అనిల్ మాట్లాడుతూనే ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. ఇవాళ వైఎస్‌ జగన్‌ జిల్లాలో అడుగుపెట్టగానే వర్షం కురిసి ముఖ్యమంత్రికి సాదర స్వాగతం పలికిందని చెబుతూనే..తాను ఏ జన్మలో పుణ్యం చేసుకున్నానో...తన తల్లిదండ్రులు చేసిన పుణ్యమోకానీ ..స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఈ జిల్లాలో ఏ బీసీకి మంత్రి పదవి ఇవ్వలేదని ఉద్వేగానికి గురయ్యారు. 50 ఏళ్ల తరువాత మన సీఎం వైఎస్‌ జగన్‌ తనకు మంత్రి పదవి ఇచ్చారుని.. ఇంతకన్న తన జన్మకు ఇంకేం కావాలని ప్రశ్నించారు. తన తండ్రి పైనున్నారని... తన తల్లి ఇక్కడే ఉందని చెప్పుకొచ్చారు. తన కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు జగనన్నకు సైనికుడిగానే ఉంటానని... తనను ఎమ్మెల్యే చేశారు..

మంత్రిని చేశారు...ఇంతకంటే ఇంకేం కావాలి... ఆయన అనుచరుడిగానే ఉంటాను అంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించబోతున్నారు.. ఇంకా 25 ఏళ్లు జగనన్నే ముఖ్యమంత్రిగా ఉండాలి.. ఎవరు ఎన్ని గింజుకున్నా వేరేవారికి అవకాశం లేదుని చెబుతూ..తన జన్మంతా జగన్నన్నకే సేవకుడిఆ ఉంటాను అంటూ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ ఎమోషనల్ గా మాట్లాడటంతో అక్కడ సీఎం సహా పార్టీ నేతలంతా ఆసక్తిగా గమనించారు.

English summary
Minister Anil Kumar Yadav emotinal speech in presence of CM jagan in nellore meeting. He says as a BC leader he got minister status after in fifty years in district politics. he do not want any else. He want to continue as follower of CM Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X