నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నెల్లూరు ఘటన: ఏపీ డీజీపీని నివేదిక కోరిన జాతీయ మహిళ కమిషన్, బాలీవుడ్ తారల ఆగ్రహం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నెల్లూరులో టూరిజం కార్యాలయ మహిళా ఉద్యోగిపై డిప్యూటీ మేనేజర్ దాడి ఘటనపై జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) తీవ్రంగా స్పందించింది. బాధ్యులపై చేపట్టిన చర్యలకు సంబంధించి నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు జాతీయ మహిళా కమిషన్ లేఖ రాసింది.

Recommended Video

Nellore Tourism Office Incident : దివ్యాంగురాలైన మహిళపై ఇనుప రాడ్డుతో దాడి, బాలీవుడ్ తారల ఆగ్రహం..!!
ఘటనపై నివేదిక ఇవ్వండి: డీజీపీకి లేఖ

ఘటనపై నివేదిక ఇవ్వండి: డీజీపీకి లేఖ

దివ్యాంగురాలైన ఉద్యోగిపై దాడి తమను దిగ్భ్రాంతికి గురిచేసిందని జాతీయ మహిళా కమిషన్ ఆ లేఖలో పేర్కొంది. ఘటనపై వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశించింది. ఇప్పటికే నిందితుడు, టూరిజం డిప్యూటీ మేనేజర్ భాస్కర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

కఠినంగా శిక్షిస్తామంటూ వాసిరెడ్డి పద్మ..

కఠినంగా శిక్షిస్తామంటూ వాసిరెడ్డి పద్మ..

కాగా, నెల్లూరు ఘటనలో బాధితురాలిని రాష్ట్ర మహిళా కమిషనర్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. దాడి చేసిన ఏపీ టూరిజం డిప్యూటీ మేనేజర్‌ భాస్కర్‌ను కఠినంగా శిక్షిస్తామన్నారు. 21 రోజుల్లో భాస్కర్‌పై విచారణ జరిపి నిర్భయ కేసు పెడతామని తెలిపారు. మాస్కు ధరించమన్న మహిళా ఉద్యోగినిపై భాస్కర్ ఇనుప రాడ్డుతో కిందపడేసి కొట్టిన విషయం తెలిసిందే. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నలువైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మంగళవారం నిందితుడు భాస్కర్ ను అరెస్ట్ చేశారు.

అమానుషమంటూ బాలీవుడ్ ఆగ్రహం..

నెల్లూరు ఘటనపై బాలీవుడ్ నటులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాస్కు ధరించమన్నందుకు దివ్యాంగురాలైన మహిళపై ఇనుప రాడ్డుతో దాడి చేయడం అమానుషమని నిర్మాత అతుల్ కస్బేకర్ అన్నారు.

ఆ అహంకారిని కఠినంగా శిక్షించాలంటూ నేహా ధూపియా..


ఏం జరుగుతోంది.. ఇలాంటి మనుషులకు తగిన గుణపాఠం చెప్పాలి. అతడికి అంత అహంకారం, కోపం ఎక్కడ్నుంచి వచ్చింది. అతడ్ని కఠినంగా శిక్షించాలని బాలీవుడ్ నటి నేహా ధూపియా అన్నారు. నిందితుడు భాస్కర్ అంకుల్‌ను జైల్లో పెట్టి కఠినంగా శిక్షించాలని మరో నటి రిచా పేర్కొన్నారు. అంతదారుణంగా దాడి చేస్తుంటే అక్కడున్నవారు చూస్తుండిపోయారని మండిపడ్డారు.

English summary
national commission for women reacts on nellore tourism office incident: bollywood fires at bhaskar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X