నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నెల్లూరులో ఉద్యోగి దాడిపై సర్కార్ సీరియస్ - భాస్కర్ సస్పెన్షన్, అరెస్ట్, దిశ కేసు- విపక్షాల ఫైర్...

|
Google Oneindia TeluguNews

నెల్లూరు ఏపీటీడీసీ హోటల్లో మహిళా ఉద్యోగిపై దాడి వ్యవహారాన్ని ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దాడి వ్యవహారం వీడియోలు బయటికి రాగానే దాడి ఘటనలో నిందితుడైన డిప్యూటీ మేనేజర్ భాస్కర్ ను సస్పెండ్ చేయడమే కాకుండా దిశ చట్టం కింద కేసు కూడా నమోదు చేసింది. నెల్లూరు పోలీసులు భాస్కర్ ను వెంటనే అరెస్టు చేశారు. మహిళలపై దాడులను ఎట్టిపరిస్ధితుల్లోనూ ఉపేక్షించబోమని డీజీపీ గౌతం సవాంగ్ స్పష్టం చేశారు.

 Nelloreలో AP Tourism DGM భాస్కర్ ఘాతుకం: ఆఫీస్‌లోనే మహిళా ఉద్యోగిపై జులుం Nelloreలో AP Tourism DGM భాస్కర్ ఘాతుకం: ఆఫీస్‌లోనే మహిళా ఉద్యోగిపై జులుం

 ఉద్యోగినిపై దాడి-విమర్శల వెల్లువ...

ఉద్యోగినిపై దాడి-విమర్శల వెల్లువ...

నెల్లూరు ఏపీ పర్యాటకశాఖ హోటల్లో మాస్కు పెట్టుకోమన్నందుకు డిప్యూటీ మేనేజర్ భాస్కర్ మహిళా ఉద్యోగినిపై దాడికి పాల్పడిన ఘటనపై విమర్శలు వెల్తువెత్తాయి. విపక్ష నేతలు, మహిళా సంఘాలతో పాటు అన్ని వర్గాల నుంచీ ఆగ్రహం వ్యక్తమైంది. దాడి జరిగిన రెండు రోజుల తర్వాత సీసీ ఫుటేజ్ బయటికి రావడంతో ఈ వ్యవహారం వెలుగు చూడటంతో పోలీసు శాఖ ఏం చేస్తుందన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. పట్టపగలే ప్రభుత్వ కార్యాలయంలో మహిళా ఉద్యోగులకు రక్షణ లేకపోతే ఇక సమాజంలో సాధారణ జనం పరిస్ధితి ఏంటన్న ప్రశ్నలు తలెత్తాయి.

నిందితుడిపై కఠిన చర్యలు.

నిందితుడిపై కఠిన చర్యలు.

నెల్లూరులోని పర్యాటక శాఖ హోటల్లో మహిళా ఉద్యోగిపై దాడి ఘటన వెలుగు చూడగానే విమర్శలు ప్రారంభం కావడంతో ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వెళ్లడంతో నిందితుడు, ఏపీటీడీసీ డిప్యూటీ మేనేజర్ భాస్కర్ ను వెంటనే సస్పెండ్ చేశారు. నెల్లూరు పోలీసులు కూడా వెంటనే స్పందించి దిశ చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితుడు భాస్కర్ ను వెంటనే అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు.

విపక్షాల ఫైర్- దిశ చట్టం ఏమైందంటూ..

విపక్షాల ఫైర్- దిశ చట్టం ఏమైందంటూ..

నెల్లూరులోని ఏపీ టూరిజం కార్యాలయంలో మహిళా ఉద్యోగిపై దాడి ఘటనను మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఖండించారు.
మాస్కు ధరించమని సూచించిన దివ్యాంగురాలైన మహిళా ఉద్యోగిపై అధికారిననే అహంకారంతో క్రూరంగా దాడి చేయడం
అమానుషమని సోమిరెడ్డి తెలిపారు. ఇది క్షమిరాని నేరమన్నారు. ఇలాంటి వ్యక్తిని సస్పెండ్ చేయడానికి పర్యాటక శాఖకు 4 రోజులు
పట్టిందా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వైఎస్ జగన్ గారూ.. మీరు తెచ్చిన దిశ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందేనని సోమిరెడ్డి
పేర్కొన్నారు.

Recommended Video

Telangana-AP border: No vehicle Entry Into Guntur District Between 7pm & 7am
దాడిపై ఉద్యోగ సంఘాల ఫైర్...

దాడిపై ఉద్యోగ సంఘాల ఫైర్...

నెల్లూరు ఏపీటీడీసీ హోటల్ ఘటనను ఉద్యోగ సంఘాలు కూడా తీవ్రంగా ఖండించాయి. మహిళా ఉద్యోగినిపై దాడికి పాల్పడిన డిప్యూటీ మేనేజర్ భాస్కర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. దివ్యాగురాలైన మహిళా ఉద్యోగినిపై కనికరం లేకుడా దాడి చేయడాన్ని ఏపీ ఎన్జీవో సంఘం తీవ్రంగా ఖండిస్తోందని ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ఉద్యోగసంఘాలు, మహిళా ఉద్యోగుల నుంచి కూడా ఈ ఘటనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. భాస్కర్ వ్యవహారశైలిపై ఇప్పటికే పలు ఫిర్యాదులు వచ్చినా చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

English summary
andhra pradesh government has taken serious note of the nellore incident, where aptdc deputy manager bhaskar beaten up a women employee for asking to wear a mask. police have arrested him and lodge case under disha act.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X