నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏకగ్రీవాలపై పంచాయతీకి పార్లమెంట్ కి లింక్ పెట్టి నెల్లూరులో నిమ్మగడ్డ హాట్ కామెంట్స్ ..ఆసక్తికర చర్చ

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో, ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ జిల్లాల వారీగా పర్యటిస్తున్నారు. ఈరోజు నెల్లూరు జిల్లా పర్యటన నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ హాట్ కామెంట్స్ చేశారు . ఏకగ్రీవాలపై పంచాయతీకి పార్లమెంట్ కి లింక్ పెట్టి నెల్లూరులో నిమ్మగడ్డ హాట్ కామెంట్స్ చేశారు .పంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాతంకంగా తీసుకున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏపీ ప్రభుత్వంతో యుద్ధం చేస్తూనే ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రయత్నిస్తున్నారు . అయితే ఏకగ్రీవాల విషయంలో నిమ్మగడ్డ పొంతన లేని వ్యాఖ్యలు చెయ్యటం ఆసక్తికర చర్చకు కారణంగా మారింది.

పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరగటం జగన్ రెడ్డికి ఇష్టం లేదు..అందుకే బెదిరింపులు: చంద్రబాబు ఫైర్ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరగటం జగన్ రెడ్డికి ఇష్టం లేదు..అందుకే బెదిరింపులు: చంద్రబాబు ఫైర్

 నెల్లూరులో నిమ్మగడ్డ సమీక్ష.. ఎప్పుడూ పరిధి దాటలేదన్న ఎస్ఈసి

నెల్లూరులో నిమ్మగడ్డ సమీక్ష.. ఎప్పుడూ పరిధి దాటలేదన్న ఎస్ఈసి

ఈ రోజు నెల్లూరులో ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎన్నికల అధికారులకు తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. నెల్లూరు లోని జడ్పీ హాల్ లో పంచాయతీ ఎన్నికల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా తన పరిధిని దాటి ఎప్పుడూ ప్రవర్తించలేదని పేర్కొన్న రమేష్ కుమార్ సాధారణ ఏకగ్రీవాలను తాను తప్పు పట్టడం లేదన్నారు. బలవంతపు ఏకగ్రీవాలు జరిగితే వాటి పై నిఘా ఉంటుందని వాటిపై దృష్టి సారించాలని పేర్కొన్నారు.

 ఎన్నికలను పటిష్టంగా జరపాలని అధికారుఅలకు నిమ్మగడ్డ సూచన

ఎన్నికలను పటిష్టంగా జరపాలని అధికారుఅలకు నిమ్మగడ్డ సూచన


ఎన్నికలను పటిష్టంగా జరపాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఇదే సమయంలో ఏపీ లోనే కాదు దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో కరోనా అదుపులోకి రావడం సంతోషంగా ఉందని పేర్కొన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఎన్నికల నిర్వహణలో కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అధికారులు ఎన్నికలను నిబద్ధతతో నిర్వహిస్తామని చెప్పడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్.

ఏకగ్రీవాలు శృతిమించితే అధికారుల వైఫల్యం కిందకు వస్తుందన్న నిమ్మగడ్డ

ఏకగ్రీవాలు శృతిమించితే అధికారుల వైఫల్యం కిందకు వస్తుందన్న నిమ్మగడ్డ

ఏకగ్రీవాలు శృతిమించితే అధికారుల వైఫల్యం కిందకు వస్తుందని పేర్కొన్న ఆయన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలలో ఏకగ్రీవాలు ఉంటాయా అంటూ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. నిమ్మగడ్డ ఏకగ్రీవాల కంటే ఎన్నికలు జరగటమే కోరుకుంటున్నారన్న భావన వ్యక్తం అవుతుంది . అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలలో పోటీ చేసి ఎవరో ఒకరు విజయం సాధించిన తరువాత ఆ ఎన్నికల వల్ల విఘాతాలు వస్తాయా అని ప్రశ్నించారు. ఎన్నికలు పూర్తయ్యాక అందరూ కలిసే ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు.

 ఏకగ్రీవాలపై నిమ్మగడ్డ వ్యాఖ్యలపై ఆసక్తికర చర్చ

ఏకగ్రీవాలపై నిమ్మగడ్డ వ్యాఖ్యలపై ఆసక్తికర చర్చ


బలవంతంగా ఏకగ్రీవాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని పదేపదే చెప్తున్న నిమ్మగడ్డ ఇప్పుడు పంచాయతీ ఎన్నికలకు , అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికలను ముడి పెట్టి మాట్లాడటం, ఏకగ్రీవాలు శృతి మించితే అధికారుల వైఫల్యం అని పేర్కొనటం ఆసక్తికరంగా మారింది. ఏకగ్రీవాల విషయంలో మొదటి నుండి బలవంతపు ఏకగ్రీవాలు జరుగుతున్నాయని , వాటిపై నిఘా పెట్టాలని , గతంలో జరిగిన వాటిని కూడా విచారిస్తామని చెప్పిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ తాజాగా నెల్లూరు జిల్లాలో చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి .

English summary
In the wake of the panchayat elections in the state of Andhra Pradesh, state Election Commissioner Nimmagadda Ramesh Kumar is touring the districts on the conduct of elections. Nimmagadda Ramesh Kumar made hot comments in the backdrop of his visit to Nellore district today. Nimmagadda linking the panchayat to the parliament elections on the unanimous.He said that if the unanimous is reconciled, the failure of the authorities will come under scrutiny. These comments have now become a topic of discussion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X