• search
  • Live TV
నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

మే 15న నా లవర్ పెళ్లి.... దయచేసి ఆపండీ.. వైరల్ అవుతున్న ఫేస్‌బుక్‌ పోస్ట్ !

|

మే 15న నా లవర్ పెళ్లి ,దయచేసి ఆపండి ఫ్రెండ్స్...లేదంటే నాకు చావే శరణ్యం...దయచేసి అర్థం చేసుకుని ఈ విషయాన్ని పెండ్లికొడుకుకు చేరేవరకు షేర్ చేయండి ఫ్రెండ్స్.. ప్లీజ్ ఆమే లేకుండా నేను బ్రతకలేను..అమేకు కూడ పెళ్లి ఇష్టం లేదు. మరి బలవంతంగా పెళ్లి ఎందుకు చేస్తున్నారో అర్థం కావడంలేదు. ఈ విషయాన్ని పెళ్లికొడుకు కూడ చెప్పాను.. ఒక్కసారి మీరు కూడ చెప్పండి ఫ్రెండ్స్... అంటూ ఓ ఫేస్‌బుక్ పోస్టింగ్, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఎవరా వ్యక్తి ఎక్కడి నుండి వచ్చింది పోస్ట్...

లవ్ మ్యాటర్ పోస్ట్...సోషల్ మీడీయాలో హల్‌చల్..

లవ్ మ్యాటర్ పోస్ట్...సోషల్ మీడీయాలో హల్‌చల్..

అసలే లవ్ మ్యాటర్ ఆపై సోషల్ మీడీయాలో పోస్టింగ్.... దీనంగా అభ్యర్థిస్తూ ఫేస్‌బుక్‌లో ఆవేదన.. దీంతో ఆ వీడియో యువతను ఆట్టుకుంటుంది. ఆ వీడీయోకు లైక్‌లు, షేరింగ్‌ల వరద కొనసాగుతోంది. ఈ లైక్స్ మరియు వీడియో షేరింగ్స్‌తో పెళ్లి అగుతుందా..ప్రియుడి విరహ వేదనకు ముగింపు దొరుకుతుందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ముఖ్యంగా పోస్టింగ్ పై వేలాదీగా సలహాలు, సూచనలు వస్తున్నాయి. మరి వాటిని ప్రియుడు పాటిస్తాడా లేక ఇంట్లో కూర్చుని విరహ వేదనను అనుభవిస్తాడా అనేది మరో ఐదురోజుల్లో తేలనుంది.

నెల్లూరు జిల్లా గూడురులో

నెల్లూరు జిల్లా గూడురులో

అసలు విషయంలోకి వెళితే నెల్లూరు జిల్లా గూడురు ప్రాంతానికి చెందిన [ఫేస్‌బుక్ ప్రోఫైల్‌ను బట్టి ] తరుణ్ డీ అనే పేరుతో ఫేస్‌బుక్ ఫోఫైల్ ఉన్న వ్యక్తి ఈ పోస్ట్ ను చేశాడు. తరుణ్‌తో పాటు లక్ష్మీ అనే అమ్మాయి {అమ్మాయి పేరు మార్చాము} గత అయిదు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నాము. అయితే లక్ష్మీకి వాళ్ల ఇంట్లో పెళ్లి సంబంధం చూశారు. కాగా పెళ్లి కూడ ఫిక్స్ అయింది. ఈనెల అనగా మే 15న వనజక్రిష్ణ పంక్షన్ హాల్లో మ్యారేజ్ కానుందని రాశాడు. ఆమే పెళ్లి వేరోకరితో జరగనుంది అంటూ పేర్కోన్నాడు. అయితే విషయం పెళ్లి కొడుకుకు చేరేవరకు షేర్ చేసి సపోర్ట్ చేయండి. ప్లీజ్ అపండి అంటూ అభ్యర్థించాడు.

నేను పెళ్లికొడుకికి విషయం చెప్పాను...

నేను పెళ్లికొడుకికి విషయం చెప్పాను...

ఇక తమ లవ్ విషయాన్ని తరుణ్ తల్లిదండ్రుల వద్ద కూడ చర్చించాడు. ఈనేపథ్యంలోనే తాను ప్రేమించిన అమ్మాయి తల్లిదండ్రులతో కూడ చర్చించేందుకు లక్ష్మి ఇంటికి కూడ వెళ్లానని చెప్పాడు. అయితే లక్ష్మి తల్లిదండ్రులు తమ పెళ్లికి ఒప్పుకోలేదని అన్నాడు. మరో ట్విస్ట్ ఏమిటంటే ఇద్దరి లవ్ మ్యాటర్ ను లక్ష్మిని చేసుకోబోయో అబ్బాయికి కూడ వివరించానని చెప్పాడు. అయినా అమ్మాయి పెళ్లిని అపడం లేదని అన్నాడు. ఇక పెళ్లి జరిగితే తనకు చావే శరణ్యం అని చెప్పడంతోపాటు ,ఈ పెళ్లి జరిగేవరకే బ్రతుకుతానని స్పష్టం చేశాడు. దీంతో పాటు అమ్మాయికి కూడ పెళ్లి ఇష్టం లేదని అయిన బలవంతంగా పెళ్లి చేస్తున్నారని తెలుపుతూనే ఇద్దరు కలిసి తిరిగిన ఫోటోలను పోస్ట్ చేశాడు.

ఫేస్‌బుక్ లో పలు సూచనలు...

ఫేస్‌బుక్ లో పలు సూచనలు...

అయితే ఈ వీడీయోను చూసిన ఫేస్‌బుక్ ఖాతాదారుల నుండి మిశ్రమ స్పందన వస్తుంది. యువత కొంతమంది తరుణ్ కు సపోర్ట్ చేస్తుంటే మరికొంత మంది మాత్రం ఓదార్పునిస్తున్నారు. తనకు తల్లిదండ్రులు ఉన్నారని వారిని చూసుకోవడం నీ బాధ్యత అంటూ వివరించారు. నిన్ను అంతాగా ప్రేమిస్తే అమ్మాయి ఎందుకు తల్లిదండ్రులను ఎదిరించి రావడంలేదని ప్రశ్నించారు. అలా అయితే నువ్వు చనిపోవడం వృధా అంటూ సలహా ఇచ్చారు. నువ్వు చనిపోతే తల్లిదండ్రులు బాధపడతారాని చెప్పారు. మరోకరైతే నువ్వు చనిపోతానంటే చేసేదేమీ లేదు. సమాజాంలో చాల సమస్యలు ఉన్నాయి వాటిమీద ద‌‌ృష్టిపెట్టు ,ఒకవేళ చావుకు సిద్దమైతే నీ శరీర భాగాలు ఇతరులకు ఉపయోగపడేలా చనిపో అంటూ కూడ పోస్టింగ్ లు పెట్టారు.

తరుణ్ పూర్తి వివరాలు లేని ఫేస్ బుక్ ఐడీ..

తరుణ్ పూర్తి వివరాలు లేని ఫేస్ బుక్ ఐడీ..

అయితే తరణ్ కు సంబంధించి ఫేస్‌బుక్‌లో పేరు ఫోటోలు తప్ప పూర్తి ఫ్రోఫైల్ వివరాలు లేవు. అయితే గూడురులోని నారయణ ఈటెక్నో స్కూళ్లో చదువుకుంటున్నట్టు ఐడి ప్రోఫైల్ లో పేర్కోన్నారు.. అయితే తాను ప్రస్థుతం ఏం చదువుతున్నాడు..లేదా ఏం చేస్తున్నాడు ఎక్కడ చదువుతన్నాడు. అనే అంశాలు మాత్రం లేవు...దీనికి తోడు తరుణ్ పుట్టిన తేదీ వివరాలు కూడ లేవు. ఏదీ ఏమైన వీడీయో పోస్ట్ చేసిన రెండు రోజుల్లోనే నాలుగువేల వరకు షేర్ అయ్యాయి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
My Lover's wedding on May 15th, please stop friends ... or else i will die ... please understand my problem. i have already discussed with bridegroom,but he was not convinced. a Facebook Posting, viral in social media,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more