నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మూగబోయిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గళం..! చాప్టర్ ముగిసినట్టేనా...?

|
Google Oneindia TeluguNews

నెల్లూరు/హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ అదికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీ మీద, జగన్ అక్రమాస్తుల కేసుల మీద ఒంటి కాలితో లేచిన నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ప్రస్తుతం మారిన రాజకీయ సమీకరణాల్లో ఒంటరైపోయాడు సోమిరెడ్డి. జిల్లాలో కూడా పార్టీ పరిస్థితి అంతగా బాగా లేక పోవడంతో నిశ్శబ్దంగా ఉండడం తప్ప చేసేదేమీ కనిపించడం లేదు. దీంతో టీడిపి ఫైర్ బ్రాండ్ గా ముద్రపడ్డ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కథ ముగినట్టేనన్నచర్చ జరుగుతోంది.

2014 ఎన్నిక‌ల్లో సోమిరెడ్డి ఓట‌మి పాలైన‌ప్పటికీ.. చంద్రబాబు ఎమ్మెల్సీ సీటును ఇచ్చి గౌర‌వించారు. అంతేకాదు, త‌ర్వాత 2017 జ‌రిగిన మంత్రి వ‌ర్గ విస్తర‌ణ‌లో చంద్రబాబు సోమిరెడ్డికి కేబినెట్ సీటు ఇచ్చి మ‌రింత గౌర‌వించారు. ఎలాంటి వివాదాల‌కు తావు లేకుండా రాజ‌కీయంగా ఎలాంటి విమ‌ర్శలు ఎదుర్కొన‌కుండానే ఈ శాఖ‌ను నిర్వహించారు సోమిరెడ్డి. ఇక‌, ఇప్పుడు తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఐదోసారి పోటీ చేసి కూడా ఓడిపోవ‌డంతో ఇప్పుడు సోమిరెడ్డి భవిష్యత్తు ఏంట‌నే విష‌యంపై టీడీపీలోనే కాకుండా నెల్లూరు జిల్లా రాజ‌కీయాల్లో కూడా చ‌ర్చ ప్రారంభ‌మైంది.

గవర్నర్ గా నరసింహన్ కొత్త రికార్డ్..! దైవ దర్శానాల్లో మాత్రం కాదండోయ్..!! గవర్నర్ గా నరసింహన్ కొత్త రికార్డ్..! దైవ దర్శానాల్లో మాత్రం కాదండోయ్..!!

నెల్లూరులో సోమిరెడ్డి పరిస్థితి విచిత్రం..! ఐనా సముచిత స్ధానం కల్పించిన బాబు..!!

నెల్లూరులో సోమిరెడ్డి పరిస్థితి విచిత్రం..! ఐనా సముచిత స్ధానం కల్పించిన బాబు..!!

రాజకీయాలు విచిత్రంగా ఉంటాయి. కొందరు అమాంతం పైకి ఎగిరిపోతారు. అంతలోనే, అంతే అమాంతంగా కిందికి పడిపోతారు. పార్టీల అధిష్ఠానాలు ఆయా నేతలను నెత్తి మీద పెట్టుకున్నా.. జనం మాత్రం ఓట్లేసి గెలిపించేందుకు సిద్ధంగా ఉండరు. ఎన్నిసార్లు అధిష్ఠానం నుంచి టికెట్లు తెచ్చుకున్నా.. మళ్లీ మళ్లీ ఓడిస్తూనే ఉంటారు. ఇప్పుడు ఆ జాబితాలోకే వస్తున్నారు ఓ మాజీ మంత్రి. పాపం ఆయనను సుమారు రెండు దశాబ్దాలుగా ప్రజలు అస్సలే కరుణించడం లేదు. వరుసబెట్టి ఓడిస్తున్నారు. అయితే.. ఇదే సమయంలో పార్టీ మాత్రం ఆయనను నెత్తినపెట్టుకుని చూస్తోంది. ఎందుకంటే.. ఆయన నోరు తెరిస్తే.. ప్రత్యర్థులు చుక్కలు చూడాల్సిందే. అంత వాగ్ధాటితో ప్రత్యర్థులను చిత్తు చేశారు. కానీ.. ఏం లాభం.. ప్రజల మనస్సులను మాత్రం ఆయన గెలుచుకోలేకపోతున్నారు. ఇంతకీ.. ఆ మాజీ మంత్రి ఎవరని అనుకుంటున్నారా..?

గెలుపుకన్నా ఓటములే ఎక్కువ..! ఐనా చెక్కుచెదరని పోటీ తత్వం..!!

గెలుపుకన్నా ఓటములే ఎక్కువ..! ఐనా చెక్కుచెదరని పోటీ తత్వం..!!

ఆయన మరెవరో కాదు.. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. టీడీపీలో ఎన్టీఆర్ హయాం నుంచి చంద్రబాబు వరకు ఆయనకు తిరుగులేదు. పార్టీకి అత్యంత నమ్మకస్తుడిగా కొనసాగుతున్నారు. నిజానికి.. ఎన్టీఆర్ తో నేరుగా వెళ్లి మాట్లాడగలిగిన నేతగా ఆయన గుర్తింపు పొందారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లిలో రాజకీయ ఆరంగేట్రం చేసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. కేవలం 1994 - 1999 ఎన్నికల్లో మాత్రమే ఆయన గెలుపొందారు. ఇక ఆ తర్వాత వచ్చిన ఐదు ఎన్నికల్లోనూ ఆయన ఓడిపోతూనే ఉన్నారు. అయినా.. పార్టీ మాత్రం ఆయనకు సముచిత స్థానం కల్పిస్తూనే ఉంది. ఒకటికాదు - రెండుకాదు వరుసగా ఐదుసార్లు ఓటమి పాలుకావడం గమనార్హం. అయితే.. ఇక్కడ మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆయన కుమారుడు రాజగోపాల్ రెడ్డి కూడా రాజకీయాల్లో రాణించకపోవడంతో భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది.

నారాయణకు మంత్రి పదవి..! జీర్ణించుకోలేక పోయిన సోమిరెడ్డి..!!

నారాయణకు మంత్రి పదవి..! జీర్ణించుకోలేక పోయిన సోమిరెడ్డి..!!

2004 - 2009 ఎన్నికల్లో తన చిరకాల రాజకీయ ప్రత్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి చేతిలో ఆయన ఓడిపోయారు. రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో సోమిరెడ్డి ఓడిపోయినా.. చంద్రబాబు ఆదరించారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టి.. ఏకంగా మంత్రిని చేశారు. ఇక ఇదే అదనుగా సర్వేపల్లి నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేశారు. ఇదే సమయంలో తన రాజకీయ వారసుడిగా కుమారుడు రాజగోపాల్ రెడ్డిని ప్రజల్లోకి తీసుకొచ్చారు. కానీ.. ఆయన కూడా ప్రజలను ఆకట్టుకోలేకపోయారు. మరోవైపు.. ఇదే జిల్లా నుంచి నారాయణను పార్టీలోకి తీసుకున్న చంద్రబాబు.. ఏకంగా ఆయనను కూడా మంత్రిని చేశారు. ఇదే సోమిరెడ్డికి పెద్ద మైనస్ గా మారింది. సోమిరెడ్డికి అడ్డుకట్ట వేసేందుకే నారాయణను రంగంలోకి దించారనే చర్చ అప్పట్లో బలంగా వినిపించింది.

అగ్ని పరిక్ష ఎదుర్కోంటున్న సోమిరెడ్డి..! రాజకీయాల్లో కొనసాగుతారా.. లేదా..?

అగ్ని పరిక్ష ఎదుర్కోంటున్న సోమిరెడ్డి..! రాజకీయాల్లో కొనసాగుతారా.. లేదా..?

ఐదేళ్ల పాటు జిల్లా రాజకీయాల్లో ఆధిపత్యం కోసం నారాయణ వర్సెస్ సోమిరెడ్డి మధ్య ఓ రేంజులో వార్ నడిచింది. అయితే.. 2019 ఎన్నికల్లో ఎలాగైనా తాను గెలుస్తానన్న ధీమాతో ఉన్న సోమిరెడ్డి ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. ఈసారి వైసీపీ ఎమ్మెల్యేను ఓడిస్తానని. తనదే విజయమని అనుకున్నారు. కానీ.. వైసీపీ అధినేత జగన్ దూకుడుతో టీడీపీ తుడుచుచుపెట్టుకుపోయింది. ఈ ఎన్నికల్లోనూ సోమిరెడ్డిని ప్రజలు కరుణించలేదు. వరుసగా రెండోసారి కాకాణి గోవర్థన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. మరో ఐదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈ ప్రతికూల పరిణామాల నుంచి సోమిరెడ్డి బయటపడుతారా.. ? లేక రాజకీయాలకు గుడ్ బై చెబుతారా..? అన్నది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే..

English summary
Somareddy Chandramohan Reddy is the leader of the Telugu Desam Party, who has been shouting at the Opposition Party and Jagan aggressors. Somireddi is alone in the changing political equations. Even in the district, the party situation is so bad that there is nothing to do except keep quiet. This is the story of Somiredd Chandramohan Reddy who is branded as a TDP Fire brand.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X