నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫిట్ లెస్ బస్.. కల్వర్టును ఢీ కొని పల్టీ కొట్టిన శ్రీచైతన్య స్కూల్ బస్సు: విద్యార్థులకు గాయాలు!

|
Google Oneindia TeluguNews

నెల్లూరు: శ్రీచైతన్య స్కూల్ బస్సు ప్రమాదానికి గురైన సంఘటన శుక్రవారం నెల్లూరు జిల్లా డక్కిలి మండలంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ విద్యార్థుందరూ క్షేమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించడంతో వారి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

<strong>రాజధాని తరలింపుపై సంచలన సంకేతం?: అమరావతి శ్రీవారి ఆలయ నిర్మాణానికి రూ.100 కోట్ల బడ్జెట్ కట్?</strong>రాజధాని తరలింపుపై సంచలన సంకేతం?: అమరావతి శ్రీవారి ఆలయ నిర్మాణానికి రూ.100 కోట్ల బడ్జెట్ కట్?

డక్కిలి మండలంలోని కమ్మపల్లి రోడ్డు సమీపంలో ఈ ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. విద్యార్థులను తీసుకుని డక్కిలి వైపు వెళ్తున్న బస్సు కమ్మపల్లి క్రాస్ సమీపానికి రాగానే అదుపు తప్పింది. రోడ్డు మలుపు ఉండటంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. ఫలితంగా బస్సు వేగంగా కల్వర్టును ఢీ కొట్టింది. ఢీ కొట్టిన వేగానికి బస్సు రోడ్డు మీది నుంచి బోల్తా కొట్టింది.

 Sri Chaitanyas School bus was met accident in Nellore District,

బస్సు ప్రమాదానికి గురైన సమయంలో 20 మంది వరకు విద్యార్థులు ఉన్నట్లు చెబుతున్నారు. బస్సు బోల్తా కొట్టిన ఉదంతాన్ని ప్రత్యక్షంగా చూసిన స్థానికులు పెద్ద సంఖ్యలో చేరుకుని, విద్యార్థులు బయటికి తీశారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు.

 Sri Chaitanyas School bus was met accident in Nellore District,

సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. బస్సు బోల్తా కొట్టిందనే విషయం తెలుసుకున్న విద్యార్థులు తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆసుపత్రికి చేరుకుని, తమ పిల్లల కోసం ఆరా తీశారు. ప్రాణాపాయ పరిస్థితులు ఎవరికీ లేవని డాక్టర్లు వెల్లడించడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.

 Sri Chaitanyas School bus was met accident in Nellore District,

స్కూల్ బస్ కు ఫిట్ నెస్ సర్టిఫికేట్ లేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. స్కూల్ బస్సులను నిర్వహించడానికి అవసరమైన సర్టిఫికెట్ కూడా లేదని పోలీసులు నిర్ధారించినట్లు తెలుస్తోంది.

English summary
School Bus belongs to Sri Chaitanya met accident on Friday morning at Kamma palli village in Dakkili Mandal Nellore district. In this incident students injured. After getting the information Police and parents have rushed to the spot and took them to the Hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X