నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నింగిలోకి దూసుకెళ్లిన PSLV-C43.. మూడు దశలు విజయవంతం

|
Google Oneindia TeluguNews

నెల్లూరు : శ్రీహరికోట షార్ సెంటర్ నుంచి ప్రయోగించిన PSLV-C43 విజయవంతమైంది. గురువారం ఉదయం 9 గంటల 58 నిమిషాలకు ఈ రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. దాదాపు 28 గంటల కౌంట్ డౌన్ తర్వాత అంతరిక్షంలోకి పంపించారు ఇస్రో సైంటిస్టులు. మూడు దశలను విజయవంతంగా పూర్తిచేసుకుందని షార్ అధికారులు వెల్లడించారు. మన దేశానికి చెందిన హైపవర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ ఉపగ్రహంతో పాటు ఇతర దేశాలకు సంబంధించిన 30 ఉపగ్రహాలను కక్ష్యలోకి మోసుకెళ్లుతోంది PSLV-C43 రాకెట్.

Recommended Video

శ్రీహరి కోట నుంచి మరో రాకెట్ : అంతరిక్షంలోకి PSLV-C43 | Oneindia Telugu

వీటిలో అత్యధికంగా అమెరికాకు చెందిన 23 ఉపగ్రహాలు ఉన్నాయి. స్పెయిన్‌, ఫిన్‌లాండ్‌, నెదర్లాండ్స్‌, కెనడా, ఆస్ట్రేలియా, కొలంబియా, మలేషియా దేశాలకు చెందిన ఒక్కో ఉపగ్రహన్ని ఈ రాకెట్ ద్వారా స్పేస్ లోకి పంపించారు. ఇవన్నీ కలిపి దాదాపు 262 కిలోల బరువు ఉంటాయి. వీటిలో 29 నానో, ఒక మైక్రో ఉపగ్రహాలున్నాయి.

 The PSLV-C43 launched from Shriharikota

మనదేశానికి చెందిన హైపవర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ ఉపగ్రహం 380 కిలోల బరువు ఉంటుంది. దీని ద్వారా 630 కిలోమీటర్ల పైభాగం నుంచి కలర్ చిత్రాలు క్లారిటీగా వీక్షించవచ్చు. భూ ఉపరితలాన్ని పరిశీలించడం, వ్యవసాయం, నీటి లభ్యత తదితర అంశాలకు సంబంధించిన పరిశోధనలకు ఈ ఉపగ్రహం ఉపయోగపడనుంది.

English summary
The PSLV-C43 launched from Shriharikota Shar Center was successful. The PSLV-C43 rocket is carrying 30 satellites orbiting other countries in addition to our country's hyper-spectral imaging satellite.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X