• search
  • Live TV
నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

రత్నప్రభ ఎస్సీ కాదా: క్రిస్టియనా: అయిదు పెండింగ్ కేసులు: జేడీయూ నేత ఎంట్రీ

|

నెల్లూరు: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తోన్న రిటైర్డ్ ఐఎఎస్ అధికారిణి, కర్ణాటక ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రత్నప్రభ.. వివాదాలకు కేంద్రబిందువు అవుతున్నారు. ఆమె షెడ్యూల్డ్ కులాలకు చెందిన మహిళ కాదని, క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో ఊపందుకుంటోంది. అదే సమయంలో- ఆమెపై రెండు తెలుగు రాష్ట్రాల్లోని పోలీస్ స్టేషన్లలో క్రిమినల్ కేసులు నమోదయ్యాయంటూ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదులు అందడం కలకలం రేపుతోంది.

నీలం సాహ్నీ బ్రాండ్ సంచలనం: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ముహూర్తం అప్పుడే ఫిక్స్నీలం సాహ్నీ బ్రాండ్ సంచలనం: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ముహూర్తం అప్పుడే ఫిక్స్

తిరుపతి లోక్‌సభ స్థానం ఎస్సీ రిజర్వుడ్. ఆ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులే అక్కడ పోటీ చేయాల్సి ఉంటుంది. నిజానికి- రత్నప్రభ కూడా ఆ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థినే. ఆమె భర్త, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి విద్యాసాగర్ క్రిస్టియన్ అని, ఆయన కుటుంబం క్రైస్తవ మతాన్ని అనుసరిస్తోందనే వాదనల వినిపిస్తోంది. దీని ప్రకారం చూస్తే.. రత్నప్రభ అత్తింటి వారు క్రైస్తవ మతాన్ని అనుసరిస్తోన్నందున.. ఆమెను కూడా క్రిస్టియన్‌గానే పరిగణించాల్సి ఉంటుందంటూ జనతాదళ్ (యునైటెడ్)కు చెందిన ఏవీ రమణ అనే నాయకుడు చెబుతున్నారు.

 Tirupati Bypoll: BJP candidate Rathna Prabhas Caste Row Comes To The Fore

రత్నప్రభను క్రైస్తవురాలిగా పరిగణించాలని, అలా చేస్తే.. ఆమె బీసీ (సీ) కేటగిరీ కిందికి చేరుతారనేది ఆయన వాదన. దీనిపై ఆయన కిందటి నెల 10వ తేదీన తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఓ లేఖ రాశారు. ఎస్సీగా నకిలీ కులధృవీకరణ పత్రంతో కొనసాగుతున్నారని తెలిపారు. దీనిపై ఓ సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆమెపై అయిదు పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయని ఏవీ రమణ పేర్కొన్నారు. తిరుపతి ఉప ఎన్నిక నామినేషన్ల సందర్భంగా రత్నప్రభ తప్పుడు సమాచారంతో కూడిన అఫిడవిట్‌ను ఇచ్చారని, వివరించారు. ఆమె నామినేషన్ పత్రాలను తిరస్కరించాలని డిమాండ్ చేశారు.

 Tirupati Bypoll: BJP candidate Rathna Prabhas Caste Row Comes To The Fore

ఈ మేరకు ఆయన తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తోన్న నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబును కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. నామినేషన్ పత్రాల్లో తనపై ఏ కేసు లేదని రత్నప్రభ పేర్కొనడం అబద్ధమని అన్నారు. బంజారాహిల్స్, సైఫాబాద్, హనుమంతుపాడు పోలీస్‌స్టేషన్లలో ఆమెపై అయిదు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఏవీ రమణ ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆధారాలను రిటర్నింగ్ అధికారికి అందజేసినట్లు చెప్పారు. రత్నప్రభ నామినేషన్‌ను వెంటనే తిరస్కరించాలని రమణ డిమాండ్ చేశారు.

 Tirupati Bypoll: BJP candidate Rathna Prabhas Caste Row Comes To The Fore
English summary
Retired IAS and BJP candidate for Tirupati Lok Sabha constituency in the by-election, Rathna Prabha, is again in fresh news with regard to her caste. Her rivals are digging into her religious connections and trying to establish that she is a Christian.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X