• search
  • Live TV
నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

నెల్లూరు జిల్లాలో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా బహిరంగ సభ: పవన్ కల్యాణ్ డుమ్మా: బెనిఫిట్ ఎవరికి

|

నెల్లూరు: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ.. ప్రచారం పతాక స్థాయికి చేరుకుంటోంది. ఒక్క అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మినహా.. మిగిలిన అన్ని ప్రధాన పక్షాల అధినేతలు జోరుగా ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు. బుధవారం తిరుపతిలో బహిరంగ సభను నిర్వహించాలని తొలుత వైఎస్ జగన్ భావించినప్పటికీ- కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దాన్ని రద్దు చేసుకున్నారు. వైసీపీకి చెందిన సీనియర్ నేతలు, మంత్రులు పార్టీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి కోసం విస్తృతంగా ప్రచారం చేస్తోన్నారు.

ఒక తిరుపతి..నలుగురు పవన్ కల్యాణ్‌లు: ఎలాగంటారా: ఫ్యాన్స్ అయోమయంఒక తిరుపతి..నలుగురు పవన్ కల్యాణ్‌లు: ఎలాగంటారా: ఫ్యాన్స్ అయోమయం

ఇక జేపీ నడ్డా..

ఇక జేపీ నడ్డా..

మరోవంక తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్ సహా కీలక నేతలు తిరుపతి లోక్‌సభ పరిధిలో పర్యటిస్తోన్నారు. ఈ లోక్‌సభ పరిధిలోకి వచ్చే తిరుపతి, శ్రీకాళహస్తి, వెంకటగిరి, సూళ్లూరుపేట్, సత్యవేడు, సర్వేపల్లి, గూడూరుల్లో రోడ్ షోలను నిర్వహిస్తోన్నారు. తాజాగా- భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొనబోతోన్నారు.

తిరమల శ్రీవారి దర్శనానంతరం..

తిరమల శ్రీవారి దర్శనానంతరం..


ఈ సాయంత్రం నెల్లూరు జిల్లాలోని నాయుడుపేటలో బహిరంగ సభను ఉద్దేశించి జేపీ నడ్డా ప్రసంగిస్తారు. ఈ మధ్యాహ్నం ఒంటిగంటకు ఆయన రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా తిరుమలకు బయలుదేరి వెళ్తారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో శ్రీవారిని దర్శించుకుంటారు. అక్కడే పార్టీ ముఖ్య నేతలతో సమావేశమౌతారు. అనంతరం ర్యాలీగా నాయుడుపేటకు చేరుకుంటారు. అక్కడి ఏఎల్‌ఎంసీ హైస్కూల్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జేపీ నడ్డా పాల్గొంటారు.

 జనసేన తరఫున నాదెండ్ల..

జనసేన తరఫున నాదెండ్ల..

ఈ సభలో ఆయనతో పాటు రాష్ట్ర ఇన్‌ఛార్జ్, కేంద్ర విదేశాంగ శాఖ సహాయమంత్రి వీ మురళీధరన్, కో ఇన్‌ఛార్జ్ సునీల్ దేవ్‌ధర్, రాష్ట్రశాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు, బీజేపీ అభ్యర్థిని రత్నప్రభ పలువురు నాయకులు పాల్గొంటారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు బైక్ ర్యాలీని నిర్వహించనున్నారు. బీజేపీ మిత్రపక్షం జనసేన తరఫున ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన ముఖ్య నాయకులు హాజరవుతారు. బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు జనసేన మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.

పవన్ డుమ్మా..

పవన్ డుమ్మా..


జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ సభకు హాజరు కావట్లేదు. తన వ్యక్తిగత భద్రతా సిబ్బందికి కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో ఆయన ముందు జాగ్రత్త చర్యలను తీసుకున్నారు. హోమ్ క్వారంటైన్‌లో ఉంటున్నారు. ఫలితంగా- ఆయన జేపీ నడ్డా హాజరయ్యే ఈ బహిరంగ సభకు డుమ్మా కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. హోమ్ క్వారంటైన్ నుంచి పంపించిన ఓ వీడియో సందేశాన్ని బహిరంగ సభలో ప్లే చేసే అవకాశం ఉంది. జేపీ నడ్డా బహిరంగ సభకు ఒక్కరోజు ముందు పవన్ కల్యాణ్ క్వారంటైన్‌లోకి వెళ్లడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. టీడీపీకి లబ్ది కలిగించడానికే పవన్ కల్యాణ్ క్వారంటైన్‌లోకి వెళ్లారనే ప్రచారం సాగుతోంది.

English summary
BJP National President JP Nadda will be addressing a public meeting at Naidupeta in Nellore district in the part of Tirupati Lok Sabha By election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X