• search
  • Live TV
నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

వైసీపీ, బీజేపీ అభ్యర్థులిద్దరూ ఒకేరోజు..ఒకేసారి: వైఎస్ జగన్ బాధ్యతలు..మంత్రుల భుజం మీద

|

నెల్లూరు: తిరుపతి లోక్‌సభకు నిర్వహించనున్న ఉప ఎన్నిక పర్వంలో మరో అంకం పూర్తి కానుంది. ఈ ఉప ఎన్నిక బరిలో నిల్చున్న అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు డాక్టర్ గురుమూర్తి, రిటైర్డ్ ఐఎఎస్ అధికారిణి రత్నప్రభ.. ఈ మధ్యాహ్నం తమ నామినేషన్‌నుదాఖలు చేయనున్నారు. రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తోన్న నెల్లూరు జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబుకు వారు తమ నామినేషన్ పత్రాలను అందజేయనున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని, కేంద్ర మాజీమంత్రి పనబాక లక్ష్మి ఇదివరకే నామినేషన్ వేశారు. ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశారు.

టీటీడీ కాటేజీలా..ప్రైవేటు హోటళ్లా: తిరుపతి ఉప ఎన్నిక వేళ..బీజేపీకి సవాల్: రూ.120 కోట్లుటీటీడీ కాటేజీలా..ప్రైవేటు హోటళ్లా: తిరుపతి ఉప ఎన్నిక వేళ..బీజేపీకి సవాల్: రూ.120 కోట్లు

తిరుపతిపై పట్టు కోసం..

తిరుపతిపై పట్టు కోసం..

నామినేషన్ పత్రాలను దాఖలు చేయడానికి తుది గడువు మంగళవారం నాటితో ముగియనుంది. దీనితో ఒకరోజు ముందే డాక్టర్ గురుమూర్తి, రత్నప్రభ ఈ మధ్యాహ్నానికి నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. అనంతరం గూడూరు, సూళ్లూరుపేట, సర్వేపల్లిల్లో వారు పర్యటించే అవకాశం ఉంది. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికను ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్ఠాత్మంగా తీసుకున్నాయి. ఫలితంగా త్రిముఖ పోరు ఏర్పడింది. ప్రస్తుతం ఈ స్థానంలో వైసీపీ ఖాతాలో ఉంది. ఆ పార్టీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ హఠాన్మరణంతో ఖాళీ అయిన తిరుపతి లోక్‌సభ స్థానాన్ని చేజిక్కించుకోవడానికి టీడీపీ, బీజేపీ, నిలుపుకోవడానికి వైసీపీ పోటీపడుతున్నాయి.

వైఎస్ జగన్ రాకపోవచ్చు..

వైఎస్ జగన్ రాకపోవచ్చు..

క్రమంగా ప్రచార వేడి పతాక స్థాయికి చేరుకుంటోంది. ఆయా పార్టీల నాయకులు పోటాపోటీగా ప్రచార కార్యక్రమాలు, సమీక్షా సమావేశాలతో తలమునకలవుతున్నారు. మూడు పార్టీల నాయకులు ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు. తిరుపతికి చెందిన డాక్టర్ గురుమూర్తిని గెలిపించడానికి చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన వైసీపీ సీనియర్ నేతలు, మంత్రులు బరిలో దిగారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నిక ప్రచార కార్యక్రమానికి దూరంగా ఉంటున్నందున.. ఉప ముఖ్యమంత్రి కే నారాయణ స్వామి, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి, కాకాణి గోవర్ధన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వాటి బాధ్యతలను తీసుకున్నారు.

చంద్రబాబు.. నారా లోకేష్

చంద్రబాబు.. నారా లోకేష్

టీడీపీ తరఫున పోటీ చేస్తోన్న పనబాక లక్ష్మి తరపున ఆ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, మాజీమంత్రి నారా లోకేష్.. ఈ ఎన్నికలో ప్రచారం చేయనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఇంకా ఖరారు కావాల్సి ఉంది. వచ్చేనెల 17వ తేదీన పోలింగ్ నిర్వహించాల్సి ఉన్నందున.. వారం రోజుల ముందు వారు ప్రచారానికి వస్తారని తెలుస్తోంది. మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సారథ్యంలో టీడీపీ ప్రచార కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

ప్రచార బరిలో పవన్ కల్యాణ్..

ప్రచార బరిలో పవన్ కల్యాణ్..


బీజేపీ అభ్యర్థిని రత్నప్రభ తరఫున ఆ పార్టీ సీనియర్ నేతలతో పాటు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచార బరిలో దిగనున్నారు. ఇందులో భాగంగా జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆదివారమే తిరుపతికి చేరుకున్నారు. రత్నప్రభకు మద్దతు తెలిపారు. ఆమెను బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థినిగా ప్రకటించారు. రత్నప్రభ తరఫున ప్రచారానికి పవన్ కల్యాణ్ వస్తారని, వారం రోజుల్లో ఆయన తిరుపతిలో పర్యటిస్తారని నాదెండ్ల మనోహర్ తెలిపారు. త్రిముఖ పోటీ ఏర్పడినందున- ప్రచారం హోరెత్తడం ఖాయంగా కనిపిస్తోంది. తిరుపతి లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల కోలాహలం నెలకొంటోంది.

English summary
Ruling YSR Congress Party and BJP candidates Dr Gurumurthy and retired IAS Officer Ratna Prabha to files their nominations today for Tirupati Lok Sabha By-elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X