• search
  • Live TV
నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

పురుగులు పట్టిన చికెన్.. దర్జాగా అమ్ముతూ.. అధికారులకు అడ్డంగా చిక్కి..!

|

నెల్లూరు : పనికిరాని, పాడేయాల్సిన చికెన్‌ను దర్జాగా అమ్ముతున్నారు. ఫ్రిజ్‌లలో నిల్వ ఉంచుతూ జనాలకు కట్టబెడుతున్నారు. కుళ్లిన మాంసం అంటగడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అధికారుల దాడులతో వెలుగుచూసిన ఈ వ్యాపారం విస్మయం కలిగిస్తోంది. ఒకే ఒక్క చికెన్ సెంటర్‌లో దాదాపు 200 కిలోల మేర నిల్వ ఉంచిన కోడి మాంసం పట్టుబడటం చర్చానీయాంశమైంది. నెల్లూరు జిల్లాలో జరిగిన ఘటన రాష్ట్రమంతటా చర్చానీయాంశంగా మారింది. పలుచోట్ల దాడులు నిర్వహించిన అధికారులు సదరు వ్యాపారులకు జరిమానాలు విధించారు.

కుళ్లిన మాంసం అమ్ముతూ..!

కుళ్లిన మాంసం అమ్ముతూ..!

నెల్లూరులో కుళ్లిన మాంసం అమ్ముతున్న ఘటనలు వరుసగా వెలుగుచూస్తున్నాయి. ఇటీవల వారం పదిరోజుల కిందట మటన్ మార్కెట్ ఏరియాలో అధికారులు దాడిచేయడంతో కళ్లు బైర్లు కమ్మే నిజాలు బయటపడ్డాయి. రోజులకొద్దీ నిల్వ ఉంచిన మేక మాంసం అమ్ముతూ వ్యాపారులు అడ్డంగా బుక్కయ్యారు. అదే క్రమంలో శనివారం (17.08.2019) నాడు చికెన్ సెంటర్లపై అధికారులు దాడి చేయడంతో భయంకరమైన విషయాలు వెలుగుచూశాయి.

హరనాథపురంలోని ఓ చికెన్ సెంటర్‌లో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆ క్రమంలో దాదాపు 200 కేజీల మేర నిల్వ ఉంచిన కోడి మాంసం పట్టుబడింది. అమ్మకానికి రెడీ అన్నట్లుగా ఫ్రిజ్‌లలో పెట్టి ఉంచాడు సదరు దుకాణం యజమాని. అయితే అధికారులు సునిశితంగా పరిశీలించడంతో మాంసం కుళ్లిపోయి కనిపించింది. అంతేకాదు పురుగులు పారుతున్నట్లుగా నిర్దారించారు.

అక్కడ దుకాణమే లేదు.. కానీ జీఎస్టీ నెంబర్.. 13 కోట్ల పన్ను ఎగవేత..!

వామ్మో ఆ చికెన్ అమ్మి ఉంటే..!

వామ్మో ఆ చికెన్ అమ్మి ఉంటే..!

కుళ్లిన మాంసం చూసి అధికారులు నివ్వెరపోయారు. ఇలాంటి మాంసం అమ్ముతుండటంపై దుకాణం యజమానిపై సీరియస్ అయ్యారు. ఒకవేళ శనివారం నాడు గనక అధికారులు దాడి చేసి ఉండకపోతే ఆ 200 కిలోల మాంసం అమ్మేసేవారు. అలా కేజీ చొప్పున రెండు వందల కుటుంబాలు తీసుకెళితే.. ఇంటికి ఐదుగురు చొప్పున ఆ చికెన్ తిని ఉంటే దాదాపు వెయ్యి మంది అస్వస్థతకు గురయ్యేవారనే ఆరోపణలు వినిపించాయి.

పలు రెస్టారెంట్లపై కూడా దాడి.. వేల రూపాయల్లో జరిమానా..!

పలు రెస్టారెంట్లపై కూడా దాడి.. వేల రూపాయల్లో జరిమానా..!

చెడిపోయిన మాంసం నిల్వ ఉంచిన చికెన్ సెంటర్‌తో పాటు పలు రెస్టారెంట్లపై దాడులు చేశారు అధికారులు. సదరు చికెన్ సెంటర్‌లో 200 కిలోల కుళ్లిన మాంసం లభ్యం కావడంతో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పీవీవీఎస్ మూర్తి 50 వేల రూపాయల జరిమానా విధించారు. అంతేకాదు నిల్వ ఉంచిన రెండు ఫ్రీజర్లను కూడా స్వాధీనపరుచుకున్నారు. జీఎన్‌టీ రోడ్డు సమీపంలోని ఓ రెస్టారెంట్‌లో వండిన మాంసం నిల్వ ఉంచినట్లు గుర్తించారు. ఆ మేరకు సదరు రెస్టారెంట్ యజమానికి 20వేల రూపాయల జరిమానా విధించారు.

అలాగే నిప్పో సెంటర్‌లోని మరో రెస్టారెంట్‌కు 20 వేల ఫైన్ వేశారు. ఇక అయ్యప్ప టెంపుల్ సమీపంలో కూడా ఓ బార్ అండ్ రెస్టారెంట్‌పై దాడి చేశారు. ఫ్రిజ్‌లో బూజు పట్టిన మాంసాన్ని గుర్తించి 50 వేల రూపాయల జరిమానా విధించారు.

ఇండియా దాడి చేయొచ్చు.. ఎదుర్కోవడానికి సిద్ధం.. పాకిస్థాన్ హాట్ కామెంట్స్

2 కోట్లతో భవనం నిరూపయోగం..!

2 కోట్లతో భవనం నిరూపయోగం..!

మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న వధశాలలో మేకలు, పొటేళ్లు కోయాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు కమిషనర్. ఇకపై నిరంతర దాడులు కొనసాగిస్తామని తెలిపారు. రూల్స్ బ్రేక్ చేసే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాస్తవానికి మాంసం విక్రయాలపై సవాలక్ష ఆంక్షలున్నా.. వ్యాపారులు ఎవరూ కూడా వాటిని పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ప్రజారోగ్యశాఖ అధికారి, పశు వైద్యాధికారి జంతువులను పరీక్షించి ఆరోగ్యంగా ఉన్నట్లు ధ్రువీకరిస్తూ ముద్ర వేయాల్సి ఉంటుంది. కానీ, ఈ నిబంధన అమలు కావడం లేదనే టాక్ వినిపిస్తోంది. అదలావుంటే మాంస విక్రయాల కోసం నగరంలో దాదాపు 2 కోట్ల రూపాయలతో నిర్మించిన భవనం నిరుపయోగంగా మారడం గమనార్హం.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Chicken is being sold as a waste. Storing them in the fridge is being tied to people. The business, which has been lit up with attacks by officials, is awe-inspiring. The controversy over the capture of nearly 200kg of chicken meat in a single chicken center. The event in Nellore district has become a hot topic of debate throughout the state. Officers who carried out multiple raids have fined the traders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more