వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వచ్చే ఏప్రిల్‌లోనే ఐపీఎల్ 2021.. అవకాశం ఇస్తే రాహుల్ రాణిస్తాడు: సౌరవ్ గంగూలీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కరోనా వైరస్ నేపథ్యంలో జరుగుతుందో లేదో అనుకున్న ఐపీఎల్‌ 2020 సీజన్‌ సక్సెస్‌పుల్‌గా స్టార్ట్ అయి ముగింపు దశకు చేరుకొంది. ఈ క్యాష్ రిచ్ లీగ్ కోసం ఎన్నో ఆటంకాలను అధిగమించిన బీసీసీఐ చివరకు విజయవంతంగా టోర్నీని నిర్వహించింది. దీంతో ఫుల్‌ జోష్‌లో ఉన్న బోర్డు అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ వచ్చే ఐపీఎల్‌ 2021 సీజన్ భారత్‌లోనే నిర్వహిస్తామనే ఆశాభావం వ్యక్తం చేశాడు. శనివారం ఇండియా టుడేతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

'వచ్చే ఏప్రిల్‌-మేల్లో ఐపీఎల్‌-2021ను స్వదేశంలోనే నిర్వహిస్తాం. 14వ సీజన్‌ కూడా యూఈఏనే వేదిక అంటూ వస్తున్న ఊహాగానాల్లో నిజం లేదు. ఇంగ్లండ్‌తో సిరీస్‌ను సొంతగడ్డపైనే జరుపుతాం. రంజీ ట్రోఫీలకు కూడా సన్నద్ధమవుతున్నాం. ఇందు కోసం బయో బబుల్‌ను ఏర్పాటు చేయనున్నాం'అని గంగూలీ చెప్పాడు.

ఐపీఎల్‌ విజయంతో ఐఎస్ఎల్‌ లాంటి లీగ్‌ల నిర్వహణకు మార్గం సుగమమైందన్నాడు. ఐపీఎల్‌ను బయో బబుల్‌లో జరపడానికి ఇంగ్లండ్‌ ఆతిథ్యం ఇచ్చిన సిరీస్‌లను పరిశీలించామని సౌరవ్‌ గంగూలీ చెప్పుకొచ్చాడు. అయితే తదుపరి సీజన్ కోసం వేలం నిర్వహించే విషయంపై మాత్రం స్పందించలేదు.

Next year IPL will run as scheduled in April and May in India:BCCI President Ganguly

సెలెక్టర్లు అవకాశం ఇస్తే టెస్ట్‌ల్లోనూ కేఎల్ రాహుల్ సత్తా చూపెడతాడని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ అన్నాడు. లాంగ్ ఫార్మాట్‌లో రాహుల్ చాలా దూరం వెళతాడని బీసీసీఐ బాస్ ఆశాభావం వ్యక్తం చేశాడు. 'కేఎల్ రాహుల్ టెస్ట్‌ల్లో చాలా సాధిస్తాడు. జట్టులో ఎక్కువ కాలం కొనసాగుతాడు.

ఓ క్రికెటర్‌గా అతనిపై నాకు నమ్మకం ఉంది. అన్ని ఫార్మాట్లలో ఆడే సత్తా ఉన్న క్రికెటర్ అతను. కానీ రాహుల్ విషయంలో సెలక్టర్లదే తుది నిర్ణయం. రాహుల్ భారత్‌కు మరిన్ని విజయాలందించాలని కోరుకుంటున్నా'అని గంగూలీ పేర్కొన్నాడు. విదేశాల్లో సిరీస్‌లు గెలవాలంటే బ్యాటింగ్‌లో సక్సెస్ అవ్వాలని దాదా అన్నాడు. బౌలర్లను ఎలా వాడుకుంటాడనేదానిపైనే భారత విజయావకాశాలు ఉంటాయని చెప్పుకొచ్చాడు.

English summary
BCCI President and former Indian captain Sourav Ganguly already has his eyes on next year's IPL, which he is confident of hosting in India itself.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X