నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆస్థికోసం.. ఇంటికి నిప్పుపెట్టుకుని పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంభం..!

|
Google Oneindia TeluguNews

ఆస్తిలో వాటాను పంచి ఇవ్వలేదని మనస్థాపం చెందిన ఓ రైతు తన కుటుంభంతో సహా ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడు. తన ముగ్గురు పిల్లలతో పాటు భార్య ఇంట్లో ఉండగానే తన స్వంత ఇంటికే నిప్పుకుని కుటుంభం మొత్తం ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఇంట్లో నుండి పెద్ద ఎత్తున మంటలు రావడంతోపాటు ఇంట్లోని ఆరుపులు కూడ వినిపించాయి..దీంతో అప్రత్తమైన గ్రామస్థులు మంటలను ఆర్పి కుటుంభ సభ్యులను కాపాడడంతో ప్రాణప్రాయం తప్పింది.

భూమి రాదనే అనుమానంతో ఇంటికి నిప్పు పెట్టుకుని ఆత్మహత్య

భూమి రాదనే అనుమానంతో ఇంటికి నిప్పు పెట్టుకుని ఆత్మహత్య

నిజామాబాద్ జిల్లా పిట్లం మండలం అన్నారంకలాన్‌‌కు చెందిన ఈరబోయిన రాములు కుటుంభానికి మొత్తం 11 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అయితే ఉన్న భూమిని రాములు తండ్రి సాయిలు, తల్లి రుక్కవ్వతోపాటు ఆయన తమ్ముడు క్రిష్ణల పేరిట పట్టా చేయగా రాములు పేరుమీద ఒక్క ఎకరం మాత్రమే పట్టా చేయించారు. దీంతో భూములను సమానంగా పంచమని రాములు తండ్రిపై ఒత్తిడి తెచ్చారు.అయితే రాములు అవేదనను ఆర్ధం చేసుకోని తండ్రి సాయులు, తమ్ముడు క్రిష్ణలు ఇద్దరు కలసి రాములుపై దాడి కూడ చేశారు.

రాములు కుటుంభ సభ్యులను కాపాడిన గ్రామస్థులు

రాములు కుటుంభ సభ్యులను కాపాడిన గ్రామస్థులు

మరోవైపు రాములుకు అప్పులు కూడ ఉన్న నేపథ్యంలో భూమి పంపకంపై తండ్రి నిర్ణయం తీసుకుంటాడో లేదో అనే అనుమానంతో తన పిల్లలు, భార్యతో కలిసి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడు.ఈనేపథ్యంలోనే ఇంటికి నిప్పు పెట్టాడు. అయితే ఇంటిలో నుండి పెద్ద ఎత్తున మంటలు రావడం, మరోవైపు ఆరుపులు కూడ వినిపించడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. ఇంటిని నీళ్లతో ఆర్పివేసే ప్రయత్నం చేసి, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అనంతరం ఇంట్లోకి వెళ్లి రాములు కుటుంభ సభ్యులను కాపాడారు. దీంతో స్పల్ప గాయాలతో వారు బయటపడ్డారు.

సమస్యను పరిష్కరించిన పోలీసులు

సమస్యను పరిష్కరించిన పోలీసులు

కాగా రాములు తమ్ముడి పేరుమీద తల్లిదండ్రులు గిఫ్టు‌డీడ్ చేశారని, అయితే ఇదే విషయంపై రెవెన్యుఅధికారులకు కూడ పిర్యాధు చేశారని రాములు చెప్పాడు. కాని అధికారులు స్పందించలేదని చెప్పారు. ఇక ప్రమాదం జరిగిన తర్వాత పోలీసులు రాములు కుటుంభ సభ్యులను గ్రామస్థుల సమక్షంలో విచారణ చేపట్టారు. భూమిని సమానంగా పంచుకోవాలని వారికి సూచించారు. దీంతో రాములు తండ్రి ఓప్పుకోవడంతో సమస్య సద్దుమణిగింది.

English summary
A farmer commit suicide, including his family , refused to give up his share of the property. His entire family tried to commit suicide by setting herself on fire.The villagers rescued the hole family
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X