నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అపెక్స్ కౌన్సిల్ భేటీలోఅదే తేలింది .. కేసీఆర్ వల్లే జగన్ కు బలం పెరిగింది .. బండి సంజయ్ ఫైర్

|
Google Oneindia TeluguNews

తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ఇరు రాష్ట్రాల సీఎంలు నదీజలాల విషయంలో, వాటాలలో కుమ్మక్కయ్యారని అపెక్స్ కౌన్సిల్ భేటీ లో తేలిందని బీజేపీ ఎంపీ బండి సంజయ్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి 555 టీఎంసీలు రావాల్సిన కృష్ణా జలాల వాటాను 299 టీఎంసీలకు సీఎం కేసీఆర్ ఒప్పుకోవటంతో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని తాము మొదటి నుండి చెబుతూ వస్తున్నామని, నేడు అపెక్స్ కౌన్సిల్ భేటీలో అదే రుజువైందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

 ఏడేళ్ళుగా అన్యాయం జరుగుతుంటే ఏం చేశారు .. రైతుల విషయంలో కేసీఆర్ వన్నీ నాటకాలు : బండి సంజయ్ ఏడేళ్ళుగా అన్యాయం జరుగుతుంటే ఏం చేశారు .. రైతుల విషయంలో కేసీఆర్ వన్నీ నాటకాలు : బండి సంజయ్

 కేసీఆర్ చేసిన సంతకం వల్లే జగన్ కు బలం పెరిగింది

కేసీఆర్ చేసిన సంతకం వల్లే జగన్ కు బలం పెరిగింది

నేడు జరిగిన అపెక్స్ కౌన్సిల్ భేటీలో నాలుగు అంశాలను ప్రధాన అజెండాగా తీసుకుని రెండు తెలుగు రాష్ట్రాలు కేంద్రంతో చర్చలు జరిపాయి. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరి వాదన వారు వినిపించారు. అయితే కృష్ణా జలాల వాటా విషయంలో 299 టీఎంసీలకు కెసిఆర్ పెట్టిన సంతకాన్ని ఉటంకిస్తూ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలంగాణ వాటా 299 టీఎంసీలు మాత్రమే అని గట్టిగా చెప్పారు. సీఎం కేసీఆర్ పెట్టిన సంతకం వల్లే ఏపీ ప్రభుత్వానికి జగన్ కు బలం వచ్చిందని, అందుకే అంత గట్టిగా మాట్లాడారంటూ బండి సంజయ్ విమర్శించారు.

తెలంగాణా ప్రయోజనాలను సీఎం కేసీఆర్ పణంగా పెట్టారు

తెలంగాణా ప్రయోజనాలను సీఎం కేసీఆర్ పణంగా పెట్టారు

కేసీఆర్ ఏపీతో ఒప్పందం కుదుర్చుకున్నారని, 299 టీఎంసీలని తెలంగాణ, 512 టీఎంసీ ల నీటిని ఆంధ్ర ప్రదేశ్ వినియోగించుకునేందుకు సీఎం కేసీఆర్ అంగీకరించారని దానివల్లే ఇప్పుడు తెలంగాణాకు నష్టం జరుగుతుందని అన్నారు బండి సంజయ్ . కృష్ణానది పరీవాహక ప్రాంతం 68.5 శాతం తెలంగాణలో ఉంది. తదనుగుణంగా తెలంగాణకు 555 టీఎంసీల (మొత్తం 811 టీఎంసీల నీటి లభ్యతలో 68.5%) ను తగిన వాటాగా పొందాలి. కానీ 299 టీఎంసీలకు మాత్రమే కేసీఆర్ అంగీకరించడం ద్వారా రాష్ట్ర ప్రయోజనాలను పణంగాపెట్టారని మండిపడ్డారు .

 కేసీఆర్ ముఖం ఎక్కడ పెట్టుకుంటావ్ చెప్పు ..

కేసీఆర్ ముఖం ఎక్కడ పెట్టుకుంటావ్ చెప్పు ..

ఇప్పుడు కేసీఆర్ ముఖం ఎక్కడ పెట్టుకుంటారు అని ప్రశ్నించారు బండి సంజయ్. ట్రిబ్యునల్ పేరుతో నాటకమాడి నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు నీటి వాటాను అడగకుండా సీఎం కేసీఆర్ తెలంగాణాకు తీరని అన్యాయం చేస్తున్నాడని బండి సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్ తన సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. అతి పెద్ద తెలంగాణ ద్రోహి సీఎం కేసీఆర్ అంటూ నిప్పులు చెరిగారు.

Recommended Video

PIL in Supreme Court Against Plans to Conduct Local Body Polls in Various States
 చరిత్ర కేసీఆర్ ను క్షమించదు : బండి సంజయ్

చరిత్ర కేసీఆర్ ను క్షమించదు : బండి సంజయ్

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లోపాయికారీ ఒప్పందాలు చేసుకుని, బయట డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు బండి సంజయ్. కాంట్రాక్టర్లకు నిధులు మళ్లించడం కోసమే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక్కటిగా మారారని, ఈ పరిణామాలు తెలుగు రాష్ట్రాలకు దురదృష్టకరమని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.


పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ నుండి నీటిని రాయలసీమ ఎత్తిపోతల ద్వారా రాయలసీమకు అందించే పథకాన్ని అడ్డుకునే అవకాశం అపెక్స్ కౌన్సిల్ భేటీ ద్వారా ఉన్నా సీఎం కేసీఆర్ అప్పుడు దానిని పోస్ట్ పోనే చేసి ఏపీకి సహకరించారని మండిపడ్డారు బండి సంజయ్ . చరిత్ర కేసీఆర్ ను క్షమించదని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

English summary
BJP Telangana state president Bandi Sanjay was angry on Telangana CM KCR. BJP MP Bandi Sanjay said the apex council had found that the CMs of the two states had conspired in the river water issue and shares. "We have been saying from the beginning that injustice will be done to Telangana with the acceptance of CM KCR's share of Krishna waters to 299 TMCs, which is supposed to give 555 TMCs to Telangana state. The same was proved in the apex council meeting today," he said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X