నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎంపీ ఎన్నికల వేడి.. బీజేపీ స్ట్రాటజీ షురూ.. ఇవాళ నిజామాబాద్ కు అమిత్ షా

|
Google Oneindia TeluguNews

నిజామాబాద్‌ : లోక్ సభ సమరం మొదలైంది. ఎన్నికలకు మరో రెండు నెలలు సమయమున్నా.. ఆయా పార్టీలు ఇప్పటినుంచే హీట్ పుట్టిస్తున్నాయి. అందులోభాగంగా పార్లమెంటరీ ఎన్నికలకు సమాయత్తమవుతోంది బీజేపీ. 5 లోక్ సభ సెగ్మెంట్లకు సంబంధించిన క్లస్టర్ స్థాయి సమావేశం నిజామాబాద్ లో ప్లాన్ చేశారు కమలం పెద్దలు. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ముఖ్యఅతిథిగా రానున్నారు.

 8 నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు.. 11 రోజుల పాటు వేడుకలు 8 నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు.. 11 రోజుల పాటు వేడుకలు

ఎన్నికల వేడి.. బీజేపీ సమాయత్తం

ఎన్నికల వేడి.. బీజేపీ సమాయత్తం

నిజామాబాద్, ఆదిలాబాద్, జహీరాబాద్, మెదక్, కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాలకు సంబంధించిన క్లస్టర్ లెవెల్ మీటింగ్ ఇది. ఈ ఐదు పార్లమెంటరీ నియోజకవర్గాల నుంచి శక్తి కేంద్రాలు, బూత్‌ ఇన్‌చార్జులు, ఆయా జిల్లాల పదాధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. నిజామాబాద్ నగర శివారులోని భూమారెడ్డి కన్వెన్షన్‌ సెంటర్‌ లో సమావేశానికి సంబంధించి ఏర్పాట్లు చేశారు స్థానిక నేతలు.

కమలనాథులకు దిశానిర్దేశం

హైదరాబాద్‌ నుంచి హెలిక్యాప్టర్‌లో బయల్దేరి మధ్యాహ్నం ఒంటిగంట 30 నిమిషాలకు నిజామాబాద్‌ చేరుకోనున్నారు అమిత్‌ షా . దుబ్బ ప్రాంతంలోని గిరిరాజ్‌ కళాశాల మైదానంలో హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా సమావేశ ప్రాంగణానికి చేరుకుంటారు. 5 పార్లమెంటరీ నియోజకవర్గాలకు సంబంధించిన సమావేశం కావడంతో రాష్ట్ర నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దాదాపు 4వేల మంది నాయకులు, కార్యకర్తలు వచ్చేలా బీజేపీ పెద్దలు ప్లాన్ చేశారు.

మంత్రివర్గ విస్తరణతో అసంతృప్తుల సెగ?.. తారక మంత్రం ఫలించేనా?మంత్రివర్గ విస్తరణతో అసంతృప్తుల సెగ?.. తారక మంత్రం ఫలించేనా?

భారీ బందోబస్తు

భారీ బందోబస్తు

అమిత్ షా పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గిరిరాజ్ కాలేజీలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ దగ్గర పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కళాశాల మైదానాన్ని ఇప్పటికే సీఆర్పీఎఫ్ తమ ఆధీనంలోకి తీసుకుంది. అక్కడి నుంచి సమావేశ ప్రాంగణం వరకు రోడ్డుమార్గం గుండా ప్రయాణిస్తుండటంతో పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. ఏఆర్ పోలీసులు కూడా బందోబస్తులో పాలుపంచుకుంటున్నారు.

English summary
The Lok Sabha Election War begins. The elections are yet another two months, Heat is creating. The BJP is getting ready for parliamentary elections. Cluster-level meeting for 5 Lok Sabha segments have been planned in Nizamabad. BJP's national president Amit Shah will be the chief guest of the meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X