నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సమగ్ర కుటుంబ సర్వే ఓకే కానీ ఎన్నార్సీ ఓకేకాదా .. ఓవైసీ, కేసీఆర్ లకు బీజేపీ ఎంపీ అరవింద్ ప్రశ్న

|
Google Oneindia TeluguNews

దేశ వ్యాప్తంగా సిఏఏ మంటలు ఇంకా చల్లారలేదు . దేశ వ్యాప్తంగా సిఏఏ , ఎనార్సీ వ్యతిరేక ఉద్యమాలు కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ పౌరసత్వ సవరణ చట్టంపై వ్యతిరేకతతో బీజేపీ, ప్రతిపక్ష నేతల మధ్య మాట యుద్ధం కొనసాగుతోంది. విమర్శలు, ప్రతి విమర్శలతో దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇక తెలంగాణా రాష్ట్రంలో కూడా ఎన్నార్సీ వ్యతిరేకంగా సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే . ఎన్ఆర్సీ రాజ్యంగ విరుద్ధం అని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చేసిన విమర్శలకు.. నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కౌంటర్ ఇచ్చారు.

బండి సంజయ్‌పై దాడి: కవిత ఓడిందనే కేసీఆర్ కక్ష్య సాధింపు: అరవింద్ తీవ్ర విమర్శలుబండి సంజయ్‌పై దాడి: కవిత ఓడిందనే కేసీఆర్ కక్ష్య సాధింపు: అరవింద్ తీవ్ర విమర్శలు

నిజామాబాద్ లో ఎంఐఎం బహిరంగ సభపై మండిపడ్డ ఎంపీ అరవింద్

నిజామాబాద్ లో ఎంఐఎం బహిరంగ సభపై మండిపడ్డ ఎంపీ అరవింద్

నిజామాబాద్ లో ఎంఐఎం బహిరంగ సభ నిర్వహించడం పట్ల ఎంపీ అరవింద్ స్పందించారు.తెలంగాణా రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన సమయంలో అసదుద్దీన్ ఒవైసీ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని, కానీ ఇప్పుడు మాత్రం ఎక్కడలేని ఆందోళన వ్యక్తం చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరు ఎంత ఆక్షేపించినా ఎన్నార్సీ అమలు జరిగి తీరుతుందని చెప్పారు. ఎన్నార్సీ రాజ్యాంగ విరుద్ధమేమీ కాదని స్పష్టం చేశారు.

 కేసీఆర్ కేవలం ముస్లింలకు మాత్రమే సీఎం

కేసీఆర్ కేవలం ముస్లింలకు మాత్రమే సీఎం


ఓవైసీ తన స్వార్థ రాజకీయం కోసం ముస్లింలను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. సీఏఏ వల్ల భారతీయ ముస్లింలకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు అరవింద్ .ఓవైసీ ఓట్ల కోసమే నిజామాబాద్ లో సభ నిర్వహించారని అరవింద్ ఆరోపించారు. మత ప్రాతిపదికనే ఒవైసీ సభకు అనుమతి కూడా ఇచ్చారని విమర్శించారు. తెలంగాణా సీఎం కేసీఆర్ కేవలం ముస్లింలకు మాత్రమే సీఎంలా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు.

అసదుద్దీన్ ఓవైసీ ఎన్నార్సీ వద్దు అనేది ఇందుకే

అసదుద్దీన్ ఓవైసీ ఎన్నార్సీ వద్దు అనేది ఇందుకే


తన పూర్వికుల గురించి వాస్తవాలు బయటపడతాయనే భయంతోనే అసదుద్దీన్ ఓవైసీ ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తున్నారని అరవింద్ అన్నారు. సీఏఏపై ఓవైసీ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్న ఎంపీ అరవింద్ తెలంగాణా సీఎం కేసీఆర్ ఎంఐఎం తో చేస్తున్న స్నేహంపైన మండిపడ్డారు. ఇక తెలంగాణా రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎంఐఎం నడిపిస్తోందన్నారు. ఇక మైనార్టీలు ఎవరూ ఓవైసీలో మాయలో పడొద్దని కోరారు. రానున్న మునిసిపల్ అభివృద్ధిని చూసి ఓటు వేయాలని కోరారు.ఎన్ఆర్సీపై ఇటాలియన్ మాఫియా రాజకీయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు ఎంత వ్యతిరేకించినా.. సీఏఏ, ఎన్ఆర్సీల విషయంలో కేంద్రం వెనక్కి తగ్గదని అరవింద్ తేల్చి చెప్పారు.

English summary
MP Aravind responded to the holding of the MIM public meeting in Nizamabad. Asaduddin Owaisi had no objection when a comprehensive family survey was conducted in Telangana state, but now it is said that there is no concern to NRC.Whoever objected to the implementation of the NRC it will be implemented. Aravind made it clear that it was not unconstitutional.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X