నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెస్ అభ్యర్థిని బలి తీసుకున్న ఎంపీటీసీ ఎన్నికలు.. ఫలితాలు రాకముందే..!

|
Google Oneindia TeluguNews

నిజామాబాద్ : రాజకీయాలైనా, ఇంకే రంగమైనా విజయాలు, అపజయాలు సహజమే. గెలుపైనా, ఓటమైనా సాధారణంగా తీసుకున్నోళ్లు ముందుకెళతారు. లేదంటే వెనుకపడిపోతారు. అదే కోవలో నిజామాబాద్ జిల్లాలో వెలుగుచూసిన ఘటన చర్చానీయాంశంగా మారింది. ఎన్నికల బరిలో నిలిచిన ఓ కాంగ్రెస్ నాయకుడు.. ఓటమి భయంతో ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా విషాదం నింపింది.

నిజామాబాద్‌లోని రోటరీ నగర్‌లో కాంగ్రెస్ నేత ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా సిరికొండ మండలం తాళ్ల రామడుగు గ్రామానికి చెందిన దాసరి గణేష్.. కాంగ్రెస్ టికెట్ తెచ్చుకుని ఎంపీటీసీగా పోటీ చేశారు. అయితే ఎన్నికల ఫలితాల కోసం వేచి చూస్తున్న సమయంలో ఆయన సూసైడ్ చేసుకోవడం స్థానికంగా విషాదం నింపింది. గణేశ్ ఓడిపోతాడని ఆ నోట ఈ నోట ప్రచారం జరుగుతుండటంతో ఆయన మనస్థాపానికి లోనయ్యారు. దాంతో బలవన్మరణానికి పాల్పడటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. గ్రామస్తులు కూడా విషాదంలో మునిగిపోయారు.

 congress party mptc candidate suicides in nizamabad with defeat tension

సొంత పార్టీ నేతలే చంపారా?.. స్మృతి ఇరానీ అనుచరుడి హత్యకేసులో కొత్త కోణంసొంత పార్టీ నేతలే చంపారా?.. స్మృతి ఇరానీ అనుచరుడి హత్యకేసులో కొత్త కోణం

అయితే ఎన్నికల ఖర్చుల కోసం అందినకాడికి అప్పులు చేశారు. అదలావుంటే ఫలితాలు రాకముందే అతడిని ఓటమి భయం పట్టుకుంది. ఒకవేళ ఓడిపోతే అప్పులు ఇచ్చినవారి నుంచి వత్తిడి పెరుగుతుందని భావించి సూసైడ్‌ చేసుకున్నారు. దానికి తోడు ఇతరుల సూటిపోటి మాటలు కూడా ఆయనను మనస్థాపానికి గురిచేసినట్లు ప్రచారం జరిగింది.

English summary
Congress Leader Suicides in Nizamabad District. He contested in MPTC Elections as Congress Candidate. Some People trolls that he may defeat from mptc elections. He afraid about his defeat then he commits suicide.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X