నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

coronavirus: వామ్మో.. ఇదేంది, కల్లు దొరకక పిచ్చి ప్రవర్తన, ఇందూరులో ఒకరికి పిట్స్, ఇద్దరి మృతి..

|
Google Oneindia TeluguNews

విశ్వ మానవళి కరోనా పేరు చెబితే చాలు గజ గజ వణికిపోతోంది. అయితే ఇందూరులో మాత్రం మందుబాబులు బెంగపెట్టుకున్నారు. అవును.. కల్లు కంపౌండ్ మూసివేయడంతో వారి మనసు మనసులా ఉండటం లేదు. అలవాటుపడిన ప్రాణం ఊరుకుంటోందా..? వైరస్ ప్రబలడంతో అన్ని రకాల షాపులు, సంస్థలు మూసివేసిన సంగతి తెలిసిందే. దీనికి కల్లు కంపౌండ్, వైన్స్, బార్లు, పబ్బులు మినహాయింపు ఏం కాదు.

కల్లు లేక.. ప్రాణం విల విల...

కల్లు లేక.. ప్రాణం విల విల...


వైరస్ వ్యాప్తి చెందడంతో గత పది రోజుల నుంచి రాష్ట్రంలో అన్నిరకాల షాపులు మూసివేశారు. ఆస్పత్రులు, మెడికల్ షాపులకు మాత్రమే తెరిచేందుకు అనుమతి ఉంది. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు కిరాణా షాపుల్లో సరుకులు కొనుక్కొనేందుకు అనుమతిస్తున్నారు. అయితే అక్కడ గుంపులు ఉంటే మాత్రం చెదరగొడుతున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు మళ్లీ కిరాణా షాపులు తెరిచేందుకు పర్మిషన్ ఇస్తున్నారు. రాత్రి 7 అయితే చాలు రోడ్డు, వీధి, గల్లీలో ఒక్కరు కూడా కనిపించొద్దు. ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించారు. ఏప్రిల్ 15వ తేదీ వరకు కర్ప్యూ ఉంటుంది.

కల్లు ప్రేమికుల..

కల్లు ప్రేమికుల..


వైరస్ గురించి వాలంటీర్లు, యువకులు అవగాహన కల్పిస్తున్నారు. కానీ నిజామాబాద్‌లో కల్లు కంపౌండ్ సహా వైన్స్, బార్లు, పబ్బులు మూసివేశారు. దీంతో కల్లు ప్రేమికులు మనోవేదనకు గురయ్యారు. కల్లు తాగనిది రోజు గడిచేది కాదు.. కానీ గత వారం పది రోజుల నుంచి నోటిలో కల్లు చుక్క పడలేదు. దీంతో ఇప్పటికే ఇద్దరు మనోవేదనతో చనిపోయారు. మరికొందరు చిత్ర, విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు.

పిచ్చిగా ప్రవర్తన

పిచ్చిగా ప్రవర్తన


నిజామాబాద్‌లో కల్లు ప్రియుల వింత ప్రవర్తన చర్చకు దారితీసింది. కల్లు తాగక పిచ్చిగా ప్రవర్తించడం చర్చకు దారితీసింది. ఇటీవల ఒకరికి ఫిట్స్ వచ్చింది. మరొవైపు ఇతరులు ఆస్పత్రికి క్యూ కడుతున్నారు. దీనిపై వైద్యులను మీడియా ప్రతినిధులు వివరణ కోరగా.. కల్లు కంపౌండ్‌లో మందుల కల్లుకు అలవాటైన వారు ఇలా ప్రవర్తిస్తున్నారని చెప్పారు. వీలైనంత త్వరగా ఆస్పత్రికి వస్తే చికిత్స ద్వారా నయం చేయొచ్చు అని సూచిస్తున్నారు.

English summary
coronavirus effect: two people dead in nizamabad due to no liquor.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X