నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పెట్రోల్‌ బంక్‌లో ఒక్కసారిగా మంటలు.. బైకర్ సహా సిబ్బంది పరార్.. వెంటనే.. (వీడియో)

|
Google Oneindia TeluguNews

అప్పడప్పుడు జరిగే ప్రమాదాలు హడలెత్తిస్తుంటాయి. ఇక మంటలు వేగంగా వ్యాపించే పెట్రోల్ బంక్‌లలో ప్రమాదం గురించి అయితే చెప్పక్కర్లేదు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సిందే. అలాంటి ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో జరిగింది.

Lockdown: ఆఫ్ట్రాల్ బిర్యానీ తీసివ్వలేవా ? నువ్వు మొగుడేనా ? భార్య ఆత్మహత్య, భర్త బైక్ లోని పెట్రోల్Lockdown: ఆఫ్ట్రాల్ బిర్యానీ తీసివ్వలేవా ? నువ్వు మొగుడేనా ? భార్య ఆత్మహత్య, భర్త బైక్ లోని పెట్రోల్

ఒక్కసారిగా మంటలు..

ఒక్కసారిగా మంటలు..

ఆర్మూర్ పట్టణంలో ఒక పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ కొట్టించేందుకు కొందరు వాహనదారుడు వచ్చాడు. అయితే అటు దిక్కున మరో టూ వీలర్ వీడియోలో కనిపిస్తున్నాడు. దీనిని బట్టి అక్కడ క్యూ లైన్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే వచ్చిన వాహనానికి పెట్రోల్ పోస్తున్నాడు పెట్రోల్ బంక్ సిబ్బంది. ఇంతలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బతుకు జీవుడా అంటూ బైకర్ అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు.

మంటలు అదుపులోకి..

మంటలు అదుపులోకి..

మిగతా బైకర్ సిబ్బంది కూడా వేగంగా పరుగెత్తారు. మిగతా సిబ్బంది వెంటనే మంటలను ఆర్పివేశారు. సమయానికి ఫోమ్ తీసుకొచ్చి టూ వీలర్‌పై వస్తోన్న మంటలను ఆర్పేశారు. దీంతో అక్కడున్న వారు ఊపిరి పీల్చుకున్నారు. అయితే బైక్‌లో పెట్రోల్ పోసే సమయంలో మంట రావడంతో.. బైక్‌కు మంటలంటుకున్నాయి. ఇటు పెట్రోల్ పోసే మిషన్‌లోకి కూడా మంటలు రావడం ఆందోళన కలిగించింది. కానీ సిబ్బంది పెట్రోల్ ఆఫ్ చేయడంతో మంటలు తగ్గిపోయాయి.

Recommended Video

Jagga Reddy Fires On Telangana Government

హమ్మయ్యా..

మంట వస్తోన్న సిబ్బంది మాత్రం అక్కడే ఉండి ఆర్పి వేసే ప్రయత్నం చేశాడు. చివరికీ ఫోమ్ తీసుకురావడంతో అందులోని మంట అదుపులోకి వచ్చింది. మొత్తానికి పెట్రోల్ బంక్‌లో ప్రమాదం జరిగిన.. ఎలాంటి నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

English summary
fire at fuel station in armoor town. timely extinguished by fuel station workers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X