• search
  • Live TV
నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కాళ్ళ పారాణి ఆరక ముందే వరుడి ప్రాణాలు తీసిన డీజే .. బోధన్ లో పెళ్లింట విషాదం

|

మేళ తాళాలతో వేదం మంత్రాలతో ఘనంగా పెళ్లి జరిగింది . నాతి చరామి అని కోటి ఆశలతో తన జీవితంలోకి అడుగుపెడుతున్న వధువుకు ప్రమాణం చేశాడు ఆ వరుడు . శతమానం భవతి అని బంధు మిత్రులు, వధూవరులను ఆశీర్వదించారు. కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న సంతోషంలో పెళ్లి జరిగాక బరాత్ లో పెళ్లి కొడుకు స్నేహితులతో కలిసి డాన్స్ చేసాడు . అదే అతని పాలిట యమపాశం అయ్యింది. అంతా సంతోషంలో ఉండగానే ఊహించని విషాదం వధూ, వరుల కుటుంబాలను శోక సంద్రంలో ముంచింది.

పెళ్లి బరాత్ లో డ్యాన్స్ చేస్తూ కుప్ప కూలిన వరుడు

పెళ్లి బరాత్ లో డ్యాన్స్ చేస్తూ కుప్ప కూలిన వరుడు

పెళ్లి ... నూరేళ్ళ పంట .. ఇద్దరి జీవితాలను ముడి వేసి , దాంపత్య బంధాన్ని కొనసాగించాలని పెద్దలంతా నిండు మనసుతో ఆశీర్వదించి చేసే శుభ కార్యం . ఎన్నో ఆశలతో పెళ్లి కూతురు, తన అర్దాంగితో కలిసి ఎంతో భవిష్యత్ ను ఊహించుకుంటూ పెళ్లి కొడుకు కొత్త జంటగా నిండు నూరేళ్ళు పిల్లాజెల్లలతో జీవనం సాగించాలని బంధు మిత్రులు ఆశీర్వదించగా పెళ్లి మండపం నుండి ఇంటికి బయలు దేరారు .ఇక ఈ క్రమంలో ఘనంగా బరాత్ నిర్వహించారు. బరాత్‌లో పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. బరాత్‌లో నృత్యం చేస్తూ వరుడు అస్వస్థతకు గురయ్యి మృతి చెందిన ఘటన వధువుకు షాక్ కాగా ఇరు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది .

 పెళ్లి చేసుకున్న సంతోషం వరుడి మృతితో విషాదంగా మారిన వేళ

పెళ్లి చేసుకున్న సంతోషం వరుడి మృతితో విషాదంగా మారిన వేళ

నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మంగలి గణేష్ అనే యువకుడి వివాహం శుక్రవారం మధ్యాహ్నం జరిగింది . పెళ్లి వేడుకలో భాగంగా రాత్రి బరాత్‌ నిర్వహించారు. ఈ సమయంలో డీజే సౌండ్‌కు అస్వస్థతకు గురైన గణేశ్‌ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో అతడిని బంధువులు ఆసుపత్రికి తరలించినా లాభం లేకపోయింది. గణేశ్ గుండెపోటుతోనే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.డీజే సౌండ్ కు అతనికి గుండెపోటు వచ్చినట్టు తెలుస్తుంది.

కాళ్ళ పారాణి ఆరక ముందే వరుడు మృతి ... కన్నీరు మున్నీరు అవుతున్న వధువు

కాళ్ళ పారాణి ఆరక ముందే వరుడు మృతి ... కన్నీరు మున్నీరు అవుతున్న వధువు

దీంతో కాళ్ళ పారాణి ఆరక ముందే వరుడు మృతి చెందటంతో వధువు కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. ఆశల సౌధం కూలిపోగా కంటికి కడివెడు శోకిస్తుంది. పెళ్లి మందిరం అయినా తియ్యక ముందే కడతేరిపోయిన వరుడ్ని , అతని కోసం ఆ కుటుంబాలు పడుతున్న వేదన చూసి స్థానికులు సైతం కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో చాలా చోట్ల చోటు చేసుకుంటున్నాయి. డీజే శబ్దాలతో ప్రాణాలు కోల్పోతున్న వధూవరుల సంఖ్య పెరుగుతుంది. సంతోషంలో మోగుతున్న డీజే లు చావు డప్పు కొట్టిస్తున్న తీరు అందరినీ ఆవేదనకు గురి చేస్తుంది.

English summary
The event took place in Bodhan, Nizamabad district. The wedding of a young man named Mangali Ganesh took place on Friday afternoon. A night barat was held as part of the wedding ceremony. During this time, Ganesh, who was sick of DJ Sound, collapsed when he is dancing with his friends . His relatives rushed him to the hospital, but there was no use. Doctors said Ganesh had died of a heart attack
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more