నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇందల్వాయి పోలీస్ స్టేషన్ లో కాల్పుల కలకలం .. ఎస్సై రివాల్వర్ తో కాల్చుకుని హెడ్ కానిస్టేబుల్ మృతి

|
Google Oneindia TeluguNews

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి పోలీస్ స్టేషన్లో విధుల్లో ఉన్న ఒక హెడ్ కానిస్టేబుల్ ఎస్సై సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకోవడం తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఎస్సై రివాల్వర్ తో ప్రకాష్ రెడ్డి అనే కానిస్టేబుల్ కణితి పై కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హుటాహుటిన నిజామాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రకాష్ రెడ్డి ప్రాణాలు దక్కలేదు. అప్పటికే వైద్యులు మృతి చెందినట్లుగా ధృవీకరించారు.

ఎస్సైకి, కానిస్టేబుల్‌కు మధ్య వాగ్వాదం

ఎస్సైకి, కానిస్టేబుల్‌కు మధ్య వాగ్వాదం

మీడియా, పోలీసుల కథనం ప్రకారం... నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి పోలీస్ స్టేషన్లో ఉదయం ఏడు గంటలకు విధులకు వచ్చిన హెడ్ కానిస్టేబుల్ ప్రకాష్ రెడ్డి 8 గంటల 30 నిమిషాల ప్రాంతంలో ఎస్సై సర్వీస్ రివాల్వర్ తీసుకుని కాల్చుకుని ఆత్మహత్య పాల్పడ్డారు. ఓ కేసు విషయంలో ఎస్సై కి, కానిస్టేబుల్ కు మధ్య వాగ్వాదం జరిగినట్టు మొదట ప్రచారం జరిగింది.

 ఆయుధాల సంరక్షుడిగా ప్రకాశ్ రెడ్డి

ఆయుధాల సంరక్షుడిగా ప్రకాశ్ రెడ్డి

గత కొద్దికాలంగా ఇందల్వాయి పోలీస్ స్టేషన్‌లో ఆయుధాలను సురక్షితంగా ఉంచే బాధ్యతను ప్రకాశ్ రెడ్డి నిర్వర్తిస్తున్నారు. అతను త్వరలో పదవీ విరమణ చేయబోతున్నారు. ఇక అతనికి వ్యక్తిగత సమస్యల గురించి కూడా అతని సహచరులకు అంతగా తెలియదు. కానిస్టేబుల్ ప్రకాష్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఎస్సై తన రివాల్వర్ ని స్టేషన్ లో నుంచి ఇంటికి వెళ్లినట్లు సమాచారం. ఇక దీంతో పోలీస్ స్టేషన్లో ఎవరు లేని సమయంలో ప్రకాష్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఆత్మహత్యకు కారణం తెలియదన్న భార్య

ఆత్మహత్యకు కారణం తెలియదన్న భార్య

ఇక హెడ్ కానిస్టేబుల్ ప్రకాష్ రెడ్డి భార్య ఉమ తన భర్త ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తనకు తెలియడం లేదని, ఎస్సై తో తన భర్తకు ఎలాంటి గొడవా లేదని, స్టేషన్ సిబ్బంది పూర్తి సహకారం అందించారని ఆమె చెబుతున్నారు. ఎస్.ఐ తో గొడవ కారణంగా ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపణలు వస్తున్న క్రమంలో అలాంటిదేమీ లేదని మృతుని భార్య ఉమ చెప్పారు. తన గత కొంతకాలంగా కీళ్ల నొప్పులతో బాధ పడుతున్నాడని, కానీ ఆత్మహత్యకు అది కారణం కాదని ఆమె అంటున్నారు.

భగవంతుడే అన్యాయం చేశాడని..

భగవంతుడే అన్యాయం చేశాడని..

ఆత్మహత్యకు గల కారణమేంటి? పోలీస్ స్టేషన్లో ప్రకాష్ రెడ్డి ఆత్మహత్యాయత్నం ఎందుకు చేసుకున్నారు ? ఎస్ ఐ రివాల్వర్ తో ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డారు అన్న అంశాలు తేలాల్సి ఉంది. అయితే ప్రకాష్ రెడ్డి అనారోగ్య సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు చెప్తుంటే ఆ భగవంతుడే తమకు అన్యాయం చేశారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా పోలీస్ స్టేషన్లో అందునా ఎస్ఐ సర్వీస్ రివాల్వర్ తో ప్రకాష్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం వెనుక అసలు కారణం ఏంటి అన్న కోణంలో దర్యాప్తు చేయాల్సి ఉంది.

English summary
A head constable in Nizamabad allegedly shot himself using a sub-inspector's pistol on Wednesday morning. Though he was rushed to a district government hospital, doctors declared him brought dead.The deceased HC, D Prakash Reddy, was in charge of the safe custody of weapons at the Indalwai police station at the time of the incident. He was set to retire from service soon and his colleagues were not quite aware if he had any personal problems.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X