నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిజామాబాద్ ఎన్నికలకు రూట్ క్లియరా?.. హైకోర్టు ఏమంది?

|
Google Oneindia TeluguNews

నిజామాబాద్ : ఎన్నడూలేనంతగా ఈసారి నిజామాబాద్ పార్లమెంటరీ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. 178 మంది రైతులు బరిలో నిలవడంతో ఈ సెగ్మెంట్ దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించింది. పసుపు, ఎర్ర జొన్నకు మద్దతు ధర ప్రకటించాలంటూ కొన్నాళ్లుగా రైతులు ఆందోళన చేస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ తమ డిమాండును ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ.. సీఎం కేసీఆర్ కూతురు కవితకు వ్యతిరేకంగా 178 మంది రైతులు నామినేషన్లు వేయడం గమనార్హం

అదలావుంటే నిజామాబాద్ ఎన్నికల్లో మొత్తం 185 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. దీంతో ఎలక్షన్లను బ్యాలెట్ పద్దతిలో నిర్వహించాలని డిమాండ్ చేశారు. కానీ ఎన్నికల సంఘం మాత్రం ఈవీఎంలతో ఎలక్షన్లు నిర్వహించడానికి సిద్ధమైంది. ఆ క్రమంలో కొందరు న్యాయపోరాటానికి సిద్ధమై.. నిజామాబాద్ ఎన్నికలపై స్టే విధించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు.

high court decision on nizamabad lok sabha elections 2019

<strong>ఓట్ల పండుగకు ఆహ్వాన పత్రిక.. వేదిక, ముహుర్తం తెలుసుగా.!</strong>ఓట్ల పండుగకు ఆహ్వాన పత్రిక.. వేదిక, ముహుర్తం తెలుసుగా.!

నిజామాబాద్ ఎన్నికలకు సంబంధించిన పిటిషన్ పై సోమవారం (08.04.2019) నాడు హైకోర్టు విచారణ జరిపింది. పోలింగ్ కు మరో 3 రోజల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో.. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని తెలిపింది. స్టే కూడా విధించలేమని స్పష్టం చేయడంతో.. నిజామాబాద్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ దొరికినట్లైంది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

English summary
Telangana Highcourt says that no stay for nizamabad lok sabha elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X