• search
 • Live TV
నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

గెలుపోటములు సహజం:ఓడినా నిజామాబాద్‌ను వీడనన్న మాజీ ఎంపీ కవిత

|
  గెలుపోటములు సహజం నిజామాబాద్‌ను వీడనన్న కవిత || Oneindia Telugu

  నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత ఓటమి పాలయ్యారు. ఊహించని ఈ పరిణామం టీఆర్ఎస్ శ్రేణుల్లో నిరుత్సాహం కలిగించింది. ఇక తాను నిజామాబాద్ లోక్ సభ ఎన్నికల్లో ఓటమి పాలవ్వడంపై టీఆర్ఎస్ నేత, కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత స్పందించారు. ఎన్నికల్లో ఓడినా, గెలిచినా తన జీవితం ప్రజలకే అంకితమన్నారు. తన కోసం పని చేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు అని పేర్కొన్నారు . ఇక తాజాగా నిజామాబాద్ జిల్లాలో కవిత ఓటమితో కృంగిపోయి అన్నపానీయాలు, నిద్రాహారాలు మానేసిగుండెపోటుకు గురై మృతి చెందిన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించారు కవిత .

  కవిత ఓటమితో మనస్తాపంతో మృతి చెందిన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన కవిత

  కవిత ఓటమితో మనస్తాపంతో మృతి చెందిన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన కవిత

  నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మంచిప్ప గ్రామానికి చెందిన టిఆర్ఎస్ కార్యకర్త కిషోర్ కుమార్ శుక్రవారం గుండె పోటుతో మృతి చెందడం పట్ల కల్వకుంట్ల కవిత చలించిపోయారు. సోమవారం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేశ్ గుప్తా, షకీల్ ఆమిర్, కె. విద్యాసాగర్ రావు, డాక్టర్ సంజయ్ కుమార్, ఎమ్మెల్సీలు వి.జి గౌడ్, ఆకుల లలిత, మేయర్ ఆకుల సుజాత తో పాటు ఈగ గంగారెడ్డి, సిహెచ్ ప్రభాకర్ రెడ్డి, పలువురు టిఆర్ఎస్ నేతలతో కలిసి కిషోర్ కుటుంబ సభ్యులను కవిత పరామర్శించారు. తన ఓటమిని తట్టుకోలేక మనస్తాపంతో కార్యకర్త కిషోర్ గుండె పోటు కు గురయిన విషయం తెలిసి కల్వకుంట్ల కవిత భావోద్వేగానికి గురయ్యారు. కన్నీటి పర్యంతం అయ్యారు. కిషోర్ మృతి తనను తీవ్రంగా కలచి వేసిందన్నారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటన్నారు. కిషోర్ కుటుంబానికి అండగా ఉంటామన్నారు. పార్టీ కార్యకర్తలు, తన అభిమానులు ధైర్యం కోల్పోవద్దు అని కోరారు. తనది నిజామాబాద్ అని, తాను నిజామాబాద్ ను వదిలిపోనన్నారు. నిజామాబాద్ జిల్లా , రాష్ట్ర అభివృద్ధికి తన కృషి కొనసాగుతుందన్నారు.

   రాజకీయాల్లో గెలుపోటములు సహజం .. పదవుల్లో లేకున్నా ప్రజల్లో ఉంటాం అన్న కవిత

  రాజకీయాల్లో గెలుపోటములు సహజం .. పదవుల్లో లేకున్నా ప్రజల్లో ఉంటాం అన్న కవిత

  రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో గెలుపోటములు ఉంటాయన్నారు కవిత . ఒడిదుడుకులు సహజం అని కవిత అన్నారు.టిఆర్ఎస్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే పార్టీ అన్నారు.
  పదవుల్లో ఉన్నా లేక పోయినా ప్రజల్లోనే ఉంటామని స్పష్టం చేశారు. మొన్న జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ ను కాదని దేశంలో అధికారంలోకి వస్తుందేమో అన్న ఆశతోనే ప్రజలు బిజెపి వైపు మొగ్గు చూపినట్లు కనిపిస్తోందని కవిత చెప్పారు. మొన్నటి ఎన్నికల్లో బిజెపి పై అనేక ఆశలు ప్రజలు పెట్టుకున్నారు . అందుకే బీజేపీని ఆడరిమ్చారన్నారు. నిజామాబాద్ కు సంబంధించిన ప్రత్యేక ఆకాంక్షలను కొత్తగా ఎన్నికైన అభ్యర్థి, వారి పార్టీ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుందని ఆశిస్తున్నట్లు కవిత చెప్పారు.

  ఓడినా నిజామాబాద్ ను వీడి పోయేది లేదన్న కవిత

  ఓడినా నిజామాబాద్ ను వీడి పోయేది లేదన్న కవిత

  ఓటమిలోనూ హుందాగా ఉండటం తెలంగాణ ఉద్యమం నేర్పించింది అన్నారు. ఓటమిలోనూ హుందాగా ఉందాం.. బంగారు తెలంగాణ నిర్మాణం లో కలిసి పనిచేద్దాం అని కవిత కార్యకర్తలను కోరారు. ఎవరూ అధైర్య పడవద్దని తెలిపారు. ఓడినా నిజామాబాద్ ని వీడిపోయేది లేదని ఆమె స్పష్టం చేశారు .

  English summary
  Stating that victory and defeat were part of Democratic process, former MP and TRS leader Kalvakuntla Kavitha on Monday said that the she will not leave Nizamabad and would strive for people of her constituency even after defeat. Kavitha made a visit to the residence of one of the TRS activists Kishore in Manchippa village in Mopal mandal in Nizamabad district on Monday. kishore died of heart stroke unable to bear Kavitha's defeat in Nizamabad the recent elections. Disheartened by the loss of Kavitha in Lok Sabha elections 2019, TRS' die hard fan, Kishore succumbed to heart attack. Kishore was not keeping well as he had neither eaten anything nor slept after the announcement of results.She asked the TRS party cadre not to lose hope stating that victory and defeat were part of Democracy. She said that posts were never important for the TRS leaders since the Telangana agitation time and the Telangana movement has shown us how to behave even during a defeat. She asked party workers not to lose confidence and work for Bangaru Telangana.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X