నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అక్రమ మైనింగ్ కు అడ్డులేదా..? తెలంగాణ సర్కార్ పై బీజేపి ఎంపీ అర్వింద్ ఫైర్..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్రంలో అక్రమ మైనింగ్ జోరుగా కొనసాగుతున్నా తెలంగాణ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు స్వప్రయోజనాలకోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని ఘాటు విమర్శలు చేసారు. సంపూర్ణ ఆదిపత్యం ఉన్న దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతూ బీజేపి నాయకుల జోలికి వస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతుందని ఆరోపిస్తూ, జాతీయ సంపదైన ఖనిజ వనరులను కార్పొరేట్ పరిశ్రమలు దుర్వినియోగం చేస్తున్నాయని, అందుకు తెర వెనక ప్రభుత్వ సహకారం అందింస్తోందని ధ్వజమెత్తారు.

Recommended Video

BJP MP Dharmapuri Arvind Slams KCR And Kavitha Over Nizamabad MLC Elections

వాహ్.. క్యా సీన్ హై.. పార్లమెంటుకు తండ్రీ కొడుకులు..! కేసీఆర్ పై మండిపడ్డ ఎంపీ అర్వింద్..!!వాహ్.. క్యా సీన్ హై.. పార్లమెంటుకు తండ్రీ కొడుకులు..! కేసీఆర్ పై మండిపడ్డ ఎంపీ అర్వింద్..!!

అక్రమ మైనింగ్ ను తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.. టీఆర్ఎస్ సర్కార్ పై మండిపడ్డ బీజేపి ఎంపీ అర్వింద్..

అక్రమ మైనింగ్ ను తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.. టీఆర్ఎస్ సర్కార్ పై మండిపడ్డ బీజేపి ఎంపీ అర్వింద్..

శనివారం ఉదయం బంజారాహిల్స్‌లోని తన నివాసంలో ఎంపీ అరవింద్ సుధీర్గంగా మాట్లాడారు. మై హోమ్‌కి నిర్మాణాల సంస్థకు చెందిన సీఆర్‌హెచ్ మైనింగ్ సంస్థలో 50శాతం వాటా ఉందన్నారు. మైనింగ్ చట్టం ప్రకారం అన్ని రకాల బదిలీలు వేలం ద్వారా జరగాలని, కానీ నిబంధనలకు విరుద్దంగా జరుగుతున్నా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని అర్వింద్ ఆరోపించారు. శ్రీ జయ జ్యోతి సిమెంట్ 2013లో మైహోమ్ సంస్థ కొనుగోలు చేసిందని చెప్పుకొచ్చారు. మైహోమ్ వాళ్ళు తమకు జయ జ్యోతితో సంబంధం లేదని చెప్పడం పచ్చి అబద్దమని, తక్షణమే మైహోమ్ మైనింగ్ కంపనీలను సీజ్ చేయాలని ఎంపీ అర్వింద్ డిమాండ్ చేశారు.

మైహోమ్ సంస్థ రాష్ట్రాన్ని దోచుకుంటోంది.. ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్న ఎంపి..

మైహోమ్ సంస్థ రాష్ట్రాన్ని దోచుకుంటోంది.. ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్న ఎంపి..

అంతే కాకుండా దాదాపు పదకొండేళ్లుగా, 2008 నుంచి 2019 వరకు విదేశీ పెట్టుబడుల నిబంధనలు ఉల్లంఘనలు జరరుగుతున్నాయని, మైనింగ్ సవరణ చట్టం ఉల్లంఘన, బెదిరింపులు, ట్రాన్స్ఫర్లు, జాతీయ సంపదను ఇతర దేశాలకు తరలించడం వంటి అక్రమాలకు మైహోమ్ పాల్పడిందని అర్వింద్ ఘాటు విమర్శలు చేసారు. మైహోమ్ సంస్థ వేల కోట్ల జాతీయ సంపదను అడ్డంగా దోచుకుందన్నారు. నల్గొండ సమీపంలోని మేళ్ల చెరువు దగ్గర సుమారు 300 ఎకరాలు కేటాయింపులు జరిగిందన్నారు. ఇందులో 79 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ కాగా, ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో 2011 ఫిబ్రవరిలో 113 ఎకరాలకు పైగా భూదాన్ భూమిలో అక్రమాలు జరుగుతున్నాయని అర్వింద్ ఆరోపించారు.

ఖనిజ సంసద దోపిడీకి గురౌతోంది.. చర్యలు తీసుకోవడంలో సీఎం విఫలమయ్యారన్న నిజామాబాద్ ఎంపీ..

ఖనిజ సంసద దోపిడీకి గురౌతోంది.. చర్యలు తీసుకోవడంలో సీఎం విఫలమయ్యారన్న నిజామాబాద్ ఎంపీ..

ఇదిలా ఉండగా ఖమ్మంలో గాయత్రి గ్రానైట్ అధినేత రవిచంద్రను వేధింపులకు గురి చేయగా ఆయన చివరకు గులాబీ పార్టీలో చేరాల్సిన పరిస్థితులు తలెత్తాయని చెప్పారు. 2017లో పది కోట్ల రూపాయల జరిమాణా విధించడంతో ఆయన భయబ్రాంతులకు గురయ్యారని తెలిపారు. గులాబీ పార్టీలో చేరిన వెంటనే ఆయనకు విధించిన జరిమాణను మాఫీ చేసారని అర్వింద్ చెప్పుకొచ్చారు. దీంతో తెలంగాణలో గులాబీ చట్టం నడుస్తోందని, ఈ అక్రమాలు మీద సీబీఐ విచారణ జరపాలని అర్వింద్ డిమాండ్ చేశారు. తెలంగాణలో అక్రమ మైనింగ్ వల్ల దేశానికి 4లక్షల కోట్ల రూపాయలు నష్టం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి అన్ని అంశాలు వివరిస్తామని తెలిపిరు.

ఎమ్మెల్సీ ఎన్నికలకోసం దిగసారుడు రాజకీయాలు.. బీజేపిని ప్రలోభాలకు గురిచేస్తుందన్న అర్వింద్..

ఎమ్మెల్సీ ఎన్నికలకోసం దిగసారుడు రాజకీయాలు.. బీజేపిని ప్రలోభాలకు గురిచేస్తుందన్న అర్వింద్..

ఇక నిజామాబాద్ లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. సంపూర్ణ మెజారిటీ ఉన్నప్పటికి తమ బీజేపి కార్పోరేటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాలన్న తర్వాత హుందాతనం ఉండాలని, కానీ గులాబీ పార్టీ నేతలు దిగజారుడు రాజకీయలకు పాల్పడుతున్నారని, అలాంటి రాజకీయాలను ముఖ్యమంత్రి స్ధానంలో కూర్చున్న చంద్రశేఖర్ రావు సమర్ధిస్తున్నారని అర్వింద్ మండిపడ్డారు. కరోనా ఆంక్షల నేపథ్యంలో ఢిల్లీ వెళ్లలేకపోయామని, ఇక ఆంక్షలు ముగిసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి అన్ని అంశాలను నివేదిస్తానని ఎంపీ అర్వింద్ చెప్పుకొచ్చారు.

English summary
Nizamabad MP Dharmapuri Arvind said that the Telangana government is not taking any action on illegal mining.Chief Minister Chandrashekhar Rao has been critical of the state's interests for self-interest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X