నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మాజీ ఎంపీ కవిత పై అనుచిత వ్యాఖ్యలు ... ఫిర్యాదు .. ఓ లెక్చరర్ అరెస్ట్

|
Google Oneindia TeluguNews

నిజామాబాద్‌ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితపై ఇటీవల దిశ ఘటన నేపధ్యంలో అనుచిత వ్యాఖ్యలు చేశారు . సామాజిక మాధ్యమంలో ఎంపీ కల్వకుంట్ల కవిత పై తీవ్రపదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని గుర్తించిన పోలీసులు , తాజాగా ఒక లెక్చరర్‌ను అరెస్టు చేశారు.

కవిత విషయంలో కేసీఆర్ నిర్ణయం అదేనా? ఢిల్లీలో మళ్ళీ చక్రం తిప్పేలా గులాబీ బాస్ వ్యూహమా? కవిత విషయంలో కేసీఆర్ నిర్ణయం అదేనా? ఢిల్లీలో మళ్ళీ చక్రం తిప్పేలా గులాబీ బాస్ వ్యూహమా?

దిశ ఘటన నేపధ్యంలో సోషల్ మీడియాలో కవితపై అనుచిత వ్యాఖ్యలు

దిశ ఘటన నేపధ్యంలో సోషల్ మీడియాలో కవితపై అనుచిత వ్యాఖ్యలు

దిశ అత్యాచారం,హత్యపై రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించడంలేదని సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. బాధితురాలి కుటుంబానికి జరిగిన అన్యాయంపై సీఎం కేసీఆర్ స్పందించలేదని ఫేస్ బుక్,ట్విట్టర్ లో నెటిజన్లు తీవ్రంగా ఆరోపణలు గుప్పిస్తోంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం కూతురు మాజీ ఎంపీ కవితపై సోషల్ మీడియాలో కొందరు యువకులు అభ్యంతరకరంగా పోస్టింగ్స్ చేశారు.

కవితపై సోషల్ మీడియాలో చేస్తున్న వ్యాఖ్యలపై ఫిర్యాదు

కవితపై సోషల్ మీడియాలో చేస్తున్న వ్యాఖ్యలపై ఫిర్యాదు


కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ డాక్టర్ విజయ కేసరి సోమవారం సైబరాబాద్ పోలీసులకు కంప్లయింట్ చేశారు.ఆమె ట్విట్టర్ పోస్టింగ్స్, స్క్రీన్ షాట్స్ ఆధారాలను సైబర్ క్రైమ్ పోలీసులకు అందించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కేసులో పోస్టింగ్స్ చేసిన వ్యక్తుల వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. అనుమానాస్పదంగా జరిగిన పోస్టింగ్స్ పై ఆరా తీస్తున్నారు. ట్విట్టర్ అకౌంట్స్ ఆధారంగా ఇద్దరు బీటెక్ స్టూడెంట్స్ ను, ఒక లెక్చరర్ ను గుర్తించినట్టు తెలిసింది. సాక్ష్యాధారాలను పరిశీలించి నిందితులను అరెస్ట్ చేస్తామని సైబరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శ్రీనివాస్ కుమార్ తెలిపారు.

నల్గొండ జిల్లాలో ఓ లెక్చరర్ అరెస్ట్ ..

నల్గొండ జిల్లాలో ఓ లెక్చరర్ అరెస్ట్ ..

అయితే నల్లగొండ జిల్లా గుండ్రాంపల్లికి చెందిన లెక్చరర్‌ అనిల్‌కుమార్‌, ఫేస్‌బుక్‌లో మాజీ ఎంపీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తుంది. ఇక ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన మాజీ ఎంపీ కవిత అభిమానులు సైబరాబాద్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో సైబర్ క్రైమ్ కింద కేసు నమోదు చేసిన సైబరాబాద్‌ పోలీసులు అనిల్‌కుమార్‌ను అరెస్టు చేసి హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. నిందితుడు హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తారని తెలుస్తుంది. రాజకీయాలకు అతీతంగా అనిల్ కుమార్ ఉంటారని స్థానికులు తెలిపారు.

English summary
A group of people has made inappropriate comments on Former Nizamabad MP Kavitha in the wake of the recent disha murder attack . A lecturer has been arrested by police after he was found guilty of making inappropriate remarks about MP Kalvakuntla kavitha on social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X