నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిజామాబాద్ లో జ‌న‌స‌మితి పోటీలో లేదు..! కాంగ్రెస్ అభ్య‌ర్థికే త‌మ మ‌ద్ద‌త్తు అన్న కోదండ‌రాం..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ జ‌న‌స‌మితి అదినేత ప్రొఫెస‌ర్ కోదండ‌రాం లోక్ స‌భ ఎన్నిక‌ల్లో పాల్గ‌న‌డం లేదు. మ‌హాకూట‌మిలో భాగ‌స్వామ్య‌మైన కాంగ్రెస్ అభ్య‌ర్ధికి ఆయ‌న మ‌ద్ద‌త్తు ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. తెలంగాణలో ముంద‌స్తుగా జ‌రిగిన శాస‌న స‌భ, జ‌ర‌గ‌బోయే లోక్ ఎన్నిక‌ల ద్వారా ఆయ‌న చ‌ట్ట‌స‌భ‌ల్లోకి వ‌చ్చే అవ‌కాశాన్ని చేజార్చుకున్న‌ట్టు తెలుస్తోంది. నిజామాబాద్ లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థి మధుగౌడ్ యాష్కీ గౌడ్ కి మద్దతుగా పోటీ నుంచి తప్పుకుంటున్నామని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ ప్రకటించారు. హైదరాబాద్ లోని జనసమితి ప్రధాన కార్యాలయంలో మధుయాష్కీ కోదండరామ్ ను కలిశారు.

ఈ సందర్భంగా యాష్కీ వినతి మేరకు నిజామాబాద్ లో పోటీ నుంచి విరమించుకుంటున్నట్లు కోదండరామ్ వెల్లడించారు. యాష్కి కు మద్దతుగా జనసమితి ప్రచార పాదయాత్ర చేపట్టనున్నట్లు చెప్పారు. తెలంగాణ సాధించడంలో రాజీలేని పోరు చేసిన మధు యాష్కి గెలుపు చారిత్రక అవసరమని కోదండరామ్ పేర్కొన్నారు. తెలంగాణతో పాటు జాతీయస్థాయి రాజకీయాలు, ఎన్నికల సమీకరణాలు ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థుల సిత్రాలు స్టార్ట్..! ప్ర‌చారానికి సిద్ద‌మ‌వుతున్న ర‌థాలు..!!ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థుల సిత్రాలు స్టార్ట్..! ప్ర‌చారానికి సిద్ద‌మ‌వుతున్న ర‌థాలు..!!

 Janasamithi not contesting in Nizamabad..! Kodanda ram says supporting congress candidate..!

ఎర్రజొన్న, పసుపు రైతుల ను నిలువు దోపిడీ చేస్తున్న వ్యాపారులపై ప్రభుత్వం మమకారం చూపుతోందని కోదండరామ్, మధుయాష్కీ విమర్శించారు. రైతులపై ఉక్కుపాదం మోపి భయానక పరిస్థితిని ప్రభుత్వమే సృష్టించడం దారుణమని వారు ఆవేద‌న వ్య‌క్తం చేసారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అదికారంలోకి వ‌స్తే ఎర్ర‌జొన్న‌, ప‌సుపు రైతుల స‌మ‌స్య‌ల‌కు స‌త్వ‌ర ప‌రిష్క‌రం చూపుతామ‌ని తెలిపారు.

English summary
Kodandaram said that he will withdraw from the competition in Nizamabad. Janasamithi campaign will be launched to support Madhu yashki. Kodandaram said that Madhu Ashki, who fought for Telangana need to achieve a historic victory.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X