కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీగా ఏకగ్రీవం..? ఎలానంటే
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. స్వతంత్ర అభ్యర్థి కోటిగిరి శ్రీనివాస్ నామినేషన్‌ను అధికారులు తిరస్కరించడంతో యునానీమస్ అయ్యింది. కోటిగిరి శ్రీనివాస్ నామినేషన్‌లోని ఫామ్ 26లో తప్పులు చేయడంతోనే అతని నామినేషన్ తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఇక ఫామ్‌లో బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇవ్వకపోవడంతో నామినేషన్ తిరస్కరించారు. దీంతో ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఫోర్జరీ వివాదం
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫోర్జరీ వివాదం నెలకొంది. స్వతంత్ర అభ్యర్థి కోటగిరి శ్రీనివాస్ నామినేషన్‌పై వివాదం ఏర్పడింది. కోటిగిరి నామినేషన్‌ను ప్రతిపాదిస్తూ సంతకాలు చేసిన ఇద్దరు వ్యక్తులు రివర్స్ అయ్యారు. తమ సంతకాలు ఫోర్జరీ చేశారని ఆరోపించారు. కోటగిరి శ్రీనివాస్ నామినేషన్‌తో తమకు సంబంధం లేదని చెబుతున్నారు.

ఆ సంతకాలు మావి కావు
కోటిగిరి శ్రీనివాస్ నామినేషన్ పత్రాలపై నందిపేట ఎంపీటీసీ నవనీత, నిజామాబాద్ 31వ వార్డు డివిజన్ ఎంఐఎం కార్పొరేటర్ గజియా సుల్తానా పేరుతో సంతకాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ సంతకాలతో తమకు సంబంధం లేదని చెప్పారు. కోటగిరి శ్రీనివాస్‌పై గజియా సుల్తానా రిటర్నింగ్ ఆఫీసర్‌కు కంప్లైంట్ చేశారు. కోటిగిరి శ్రీనివాస్ నామినేషన్‌లోని ఫామ్ 26లో తప్పులు చేయడంతో నామినేషన్ తిరస్కరించినట్లు తెలుస్తోంది.

తిరస్కరణ
ఫామ్‌లో బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇవ్వకపోవడంతో నామినేషన్ తిరస్కరణకు గురయ్యింది. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి కల్వకుంట్ల కవిత ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. ఒకవేళ ఎన్నిక ఉన్న ఆమె విజయం నల్లేరు మీద నడకే అయ్యేది. కానీ ఇండిపెండెంట్ అభ్యర్థి చేసిన తప్పులు కవితకు ప్లస్ పాయింట్‌గా మారింది.

ఆరు + ఒకరు
ఇంతకుముందు ఆరు ఎమ్మెల్సీ అభ్యర్థులు ఏకగ్రీవం అయిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, బండా ప్రకాష్, తక్కెళ్లపల్లి రవీందర్రావు, వెంకట్రామరెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరికి రిటర్నింగ్ అధికారి మంగళవారం విజయానికి సంబంధించి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. షెడ్యూల్ ప్రకారం ఈ స్థానాలకు నెల 26న పోలింగ్ నిర్వహించాల్సి ఉంది. శాసనసభలో టీఆర్ఎస్ మినహా ఏ పార్టీకీ ఈ కోటాలో ఎమ్మెల్సీని గెలిపించుకునే సంఖ్యా బలం లేకపోవడంతో ప్రతిపక్షాలేవీ అభ్యర్థులను నిలబెట్టలేదు. స్వతంత్ర అభ్యర్థులుగా ఓ ఇద్దరు నామినేషన్లు దాఖలు చేసినా.. ఆ పత్రాలు నిబంధనల ప్రకారం లేకపోవడంతో తిరస్కరణకు గురయ్యాయి. నామినేషన్ల ఉపసంహరణకు సోమవారం సాయంత్రం 3 గంటలకు గడువు ముగియడం, టీఆర్ఎస్ తరఫున దాఖలైన ఆరుగురి నామినేషన్లే ఉండడంతో వారి ఎన్నిక ఏకగ్రీవం అయింది. ఇక వీరితోపాటు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపికైన మధుసూదనాచారికి సంబంధించి ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయగానే.. ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. ఇప్పుడు కవిత కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.