నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ సస్పెండ్.. ఎందుకంటే..

|
Google Oneindia TeluguNews

ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్‌ను సస్పెండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ శరత్ ఉత్తర్వులు జారీ చేశారు. 39 మంది పెన్షన్లను తొలగించిన విషయంలో ఈయనదే ప్రధానపాత్ర అని తేలడంతో సస్పెన్షన్ వేటు వేశారు. ఎల్లారెడ్డి మున్సిపల్ ఎన్నికలలో తమ పార్టీకి ఓటు వేయలేదని 8వ వార్డు కౌన్సిలర్ భర్త 33 మంది పెన్షన్లను తొలగించాడని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.

ఆరోపణలపై స్పందించిన కలెక్టర్ విచారణకు ఆదేశించారు. ఈ మధ్యనే కంప్యూటర్ ఆపరేటర్‌ను తొలగిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. తాజాగా కమిషనర్‌పై వేటు వేశారు. 39 మంది పెన్షన్లను తొలగించిన ఘటనలో కలెక్టర్ వేగంగా స్పందించి చర్యలు తీసుకున్నారు. ఇవీ మిగతా అధికారులకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. కానీ మున్సిపల్ కమిషనర్‌పై ఇతర ఆరోపణలు కూడా ఉన్నాయి. చివరికీ చర్యలు తీసుకోవాల్సి వచ్చింది.

kamareddy collector suspended yellareddy municipal commissioner

ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్‌ సస్పెన్షన్ చర్చకు దారితీసింది. దీని గురించి పలువురు చర్చిస్తున్నారు. అవినీతి ఆరోపణలతోనే చర్యలు తీసుకోగా.. తప్పుచేసే మిగతావారి వెన్నులో వణుకు పుడుతోంది. చాలా రోజుల తర్వాత ఓ అధికారి సస్పెన్షన్ అంశం తెరపైకి వచ్చింది. తప్పుచేసే అధికారుల్లో ఈ ఘటన భయం పుట్టిస్తోంది.

Recommended Video

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మీడియా సంస్థలకు వార్నింగ్

English summary
kamareddy collector suspended yellareddy municipal commissioner for pensions remove issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X