నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కవిత గెలుపు ...అన్ని ఎన్నికల్లోనూ ఇదే రిపీట్ .. మంత్రులు హరీష్ ,ఎర్రబెల్లి మొదలెట్టేశారుగా!!

|
Google Oneindia TeluguNews

టిఆర్ఎస్ పార్టీకి నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితాలు కొత్త ఉత్సాహాన్ని తీసుకు వచ్చాయి. ఒకపక్క దుబ్బాక లోనూ అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరగాల్సి ఉండగా, మరోపక్క పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు తెలంగాణ రాష్ట్రం సిద్ధమవుతోంది. ఈ సమయంలో ఈరోజు నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితం ప్రతిపక్ష పార్టీలకు కాస్త ఇబ్బందికర పరిస్థితి తీసుకురాగా టిఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో మాత్రం జోష్ నింపింది.

బంపర్ మెజార్టీతో ఎమ్మెల్సీగా కవిత విజయం .. కాంగ్రెస్, బీజేపీల డిపాజిట్లు గల్లంతు బంపర్ మెజార్టీతో ఎమ్మెల్సీగా కవిత విజయం .. కాంగ్రెస్, బీజేపీల డిపాజిట్లు గల్లంతు

దుబ్బాక ఎన్నికల్లోనూ విజయం మాదే... వారి డిపాజిట్లు గల్లంతే : మంత్రి హరీష్

దుబ్బాక ఎన్నికల్లోనూ విజయం మాదే... వారి డిపాజిట్లు గల్లంతే : మంత్రి హరీష్

నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితం గురించి ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టిఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని సాధించిందని, కాంగ్రెస్ బీజేపీల డిపాజిట్లు కూడా గల్లంతయ్యాయని ఆయన పేర్కొన్నారు. అంతే కాదు భవిష్యత్తు ఎన్నికల్లో కూడా టిఆర్ఎస్ పార్టీనే అఖండ విజయాన్ని సాధిస్తుందని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాక లో జరిగే ఉప ఎన్నికల్లోనూ, ఆ తర్వాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ బంపర్ మెజారిటీతో విజయం సాధించేది టీఆర్ఎస్ పార్టీనే అంటూ పేర్కొన్నారు మంత్రి హరీష్ రావు.

టీఆర్ఎస్ పార్టీపై విశ్వాసానికి ఇదే నిదర్శనం అన్న హరీష్ రావు

టీఆర్ఎస్ పార్టీపై విశ్వాసానికి ఇదే నిదర్శనం అన్న హరీష్ రావు

కాంగ్రెస్, బి.జె.పి లు డిపాజిట్లు కూడా కోల్పోతాయని గట్టిగా చెప్పారు. టిఆర్ఎస్ పార్టీపై ప్రజలకు ఉన్న విశ్వాసానికి నిజామాబాద్ ఎన్నికల ఫలితాలే నిదర్శనం అని పేర్కొన్నారు. తమ ప్రభుత్వంపై కాంగ్రెస్ బిజెపి చేస్తున్న ఆరోపణలు అబద్ధమని తేలిందని ఆయన స్పష్టం చేశారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీ గా భారీ మెజారిటీతో కల్వకుంట్ల కవిత గెలిచి న ఈ రోజు శుభదినం అని పేర్కొన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు .

పట్టభద్రుల ఎమ్మెల్సీ, దుబ్బాక , గ్రేటర్ ఎన్నికల్లో మాదే విజయం : ఎర్రబెల్లి

పట్టభద్రుల ఎమ్మెల్సీ, దుబ్బాక , గ్రేటర్ ఎన్నికల్లో మాదే విజయం : ఎర్రబెల్లి

కల్వకుంట్ల కవిత నేడు నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఘన విజయం సాధించడం పట్ల రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హర్షం వ్యక్తం చేశారు .రాష్ట్రంలో ఎన్నిక ఏదైనా గెలుపు టి.ఆర్.ఎస్ దేనని మరోసారి కల్వకుంట్ల కవిత విజయం నిరూపించిందన్నారు. త్వరలో జరిగే దుబ్బాక ఉప ఎన్నికల్లోనూ, వరంగల్, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్ ,రంగారెడ్డి ,మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఇదే విజయం పునరావృతం అవుతుందన్నారు.

నిజామాబాద్ ఎన్నికల ఫలితమే భవిష్యత్ ఎన్నికల్లో రిపీట్ అన్న మంత్రి

నిజామాబాద్ ఎన్నికల ఫలితమే భవిష్యత్ ఎన్నికల్లో రిపీట్ అన్న మంత్రి


ప్రజలు సీఎం కేసిఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు మద్దతు గా నిలిచారని చెప్పారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. అన్ని ఎన్నికల్లోనూ ఇది రుజువు అవుతుంది అన్నారు. అందుకు నిదర్శనమే కవిత గెలుపు అన్నారు. పార్లమెంటు లో గతంలో పార్టీ నుండి కీలకంగా వ్యవహరించిన కవిత ఎమ్మెల్సీ విజయం, మండలిలో కూడా స్థానిక సంస్థలకు, మహిళలకు బలం చేకూరుస్తుంది అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఇక నిజామాబాద్ ఎన్నికల ఫలితం అన్ని ఎన్నికల్లో రిపీట్ అవుతుందని మంత్రులు ప్రచారం మొదలెట్టారు .

English summary
Finance Minister Harish Rao and Rural Development Minister Errabelli Dayakar Rao made sensational remarks about the Nizamabad MLC by-election result. They said the TRS party had won a landslide victory in the Nizamabad MLC elections and the Congress and BJP lost their deposits . TRS party will win a landslide victory in future elections as well. Ministers said that the TRS party would win the by-elections in Dubbakka, the graduate MLC elections and also the Greater Hyderabad Municipal Corporation elections with a bumper majority.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X