నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పంటపొలాల్లో కోతుల బెడదకు చెక్.. మంకీ గన్ తయారు చేసిన యువరైతు

|
Google Oneindia TeluguNews

ఆరుగాలం శ్రమించి పంటలు పండించే రైతులకు ఎన్నో సమస్యలు.. ఇక అందులో ఒకటి పక్షులు, కోతులు పంటపొలాల లోని పంటను నాశనం చేయడం. చాలా జిల్లాల్లో కోతుల బెడద తీవ్రంగా రైతులను వేధిస్తోంది. పంట పొలాల నుండి కోతులను తరిమికొట్టడానికి డప్పులను ఉపయోగిస్తూ తెలంగాణ గ్రామాలలో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

ఇక ఈ నేపథ్యంలోనే కోతులు పక్షులు బెడద నుండి పంటలను రక్షించడం కోసం నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ యువ రైతు సరికొత్త ఆలోచన చేశారు. ఆ యువ రైతు ఆలోచన సత్ఫలితాలను ఇచ్చింది .

అతి తక్కువ ధరకే మంకీ గన్ .. పంటలను కాపాడుకునే ప్రయత్నం చేసిన యువ రైతు

అతి తక్కువ ధరకే మంకీ గన్ .. పంటలను కాపాడుకునే ప్రయత్నం చేసిన యువ రైతు

అతి తక్కువ ధరకే మంకీ గన్ అందుబాటులోకి వచ్చేలా అతను చేసిన ప్రయోగం ఫలితాన్నిచ్చింది. పంటలను దెబ్బతీస్తున్న కోతులు ,పందులు, పక్షులను తరిమికొట్టేందుకు ఈ మంకీ గన్ తయారు చేసి ఆదర్శంగా నిలిచాడు నిజామాబాద్ యువరైతు మహేష్.
నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రానికి చెందిన యువరైతు పొత్తూరి మహేష్ ప్రత్యేకంగా మంకీ గన్ అనే పరికరాన్నితయారు చేశాడు. ఈ గన్ లో క్యాలిషియం కార్బోనేట్ అనే రసాయనాన్ని వేసి అందులో కొద్దిగా నీరు పోసి ఒక నిమిషం తర్వాత లైటర్ సహయంతో స్పార్క్ ఇస్తే భారీ శబ్దంతో ఈ గన్ పేలుతుంది . ఆ శబ్దానికి కోతులు, పందులు, పక్షులు అక్కడి నుండి పారిపోతాయి. మహేష్ మంకీ గన్ ను కేవలం రూ: 420తోనే తయారు చేశారు .

గులాబీ గూటిలో అసమ్మతి గళాలు .. ఆదిలాబాద్ జిల్లా టీఆర్ఎస్ లో అంతర్యుద్ధంగులాబీ గూటిలో అసమ్మతి గళాలు .. ఆదిలాబాద్ జిల్లా టీఆర్ఎస్ లో అంతర్యుద్ధం

జయశంకర్ వర్శిటీలో శాస్త్రవేత్తలు తయారు చేసిన పరికరం రూ:3540.. యువరైతు తయారు చేసిన గన్ రూ. 420

జయశంకర్ వర్శిటీలో శాస్త్రవేత్తలు తయారు చేసిన పరికరం రూ:3540.. యువరైతు తయారు చేసిన గన్ రూ. 420

పంటను కాపాడుకోవడం కోసం ఎన్నో పరికరాలు ఉపయోగించానని , ప్రొపెసర్ జయశంకర్ వర్శిటీలో శాస్త్రవేత్తలు సరి కొత్త పరికరాన్ని ఇటువంటిదే తయారు చేసి విడుదల చేశారని చెప్పిన మహేష్ అయితే అది రూ:3540 కావడంతో తమకు భారంగా అనిపించింది అని అన్నారు.

తన సొంత ఆలోచనతో సరికొత్త గన్ ను అతి తక్కువ ధరకు తయారు చేయాలన్న సంకల్పంతో ప్రయోగాలు చేశానని మహేష్ తెలిపారు. పలు విధాలుగా మార్పులు చేసిన తర్వాత కేవలం రూ. 420 కే ఈ పరికరాన్ని తయారు చేశానని తెలిపారు. ఈ గన్ ను ఉపయోగించి తాను వేసిన మొక్కజొన్న పంటకు కోతులు, పందులు, పక్షులు రాకుండా కాపాడుకుంటున్నాని తెలిపారు.

 సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో వినిపించనున్న గన్ శబ్దం.. అందరికీ తయారీ నేర్పుతా అంటున్న రైతు మహేష్

సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో వినిపించనున్న గన్ శబ్దం.. అందరికీ తయారీ నేర్పుతా అంటున్న రైతు మహేష్

మహేష్ తయారుచేసిన ఈ గన్ శబ్దం సుమారు 5 ఎకరాల విస్తీర్ణం వరకు వినబడుతుండడంతో పంట వైపు కోతులు పక్షులు రావడం లేదని యువరైతు మహేష్ అంటున్నాడు. ఈ పరికరాన్ని రైతులకు స్వయంగా ఎలా తయారు చేసుకోవాలో ఎలా ఉపయోగించుకోవాలో వివరిస్తున్న మహేష్ నిజామాబాద్ జిల్లా లో రైతులకు ఈ పరికరం పై అవగాహన కల్పిస్తున్నారు . ఆసక్తిగల రైతులు తన దగ్గరకు వస్తే దీన్ని తయారు చేయడం కూడా నేర్పుతానని మహేష్ అంటున్నాడు. ఈ యువ రైతును నిజామాబాద్ జిల్లా రైతులు అభినందిస్తున్నారు. వ్యవసాయ రంగంలో కూడా రైతులకు ఎదురయ్యే ఇబ్బందులు పరిష్కరించడం కోసం వ్యవసాయ పరిశోధన క్షేత్రాలను అతి తక్కువ ధరలకు ఈ తరహా పరికరాలను అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.

English summary
Young farmer experiment resulted in the availability of the cheapest monkey gun. Nizamabad farmer Mahesh made this monkey gun ideal for chasing monkeys, pigs and birds that are damaging crops. Potthuri Mahesh of the Nizamabad district specially manufactured a device called Monkey Gun for the safety of crops.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X