నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిజామాబాద్ బరి.. గెలుపెవరిదో మరి? కవిత VS మధుయాష్కి VS అర్వింద్

|
Google Oneindia TeluguNews

నిజామాబాద్ : లోక్‌సభ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. పోటీ రసవత్తరంగా మారింది. టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కి, బీజేపీ యువ నాయకుడు అర్వింద్.. ఇలా ఈ ముగ్గురి మధ్య త్రిముఖ పోటీ అనివార్యమైంది. ఎవరికివారు విజయావకాశాలపై ధీమాతో ఉన్నారు. ప్రధాన పార్టీ అభ్యర్థుల పేర్లు ఖరారు కావడంతో ఈ సెగ్మెంట్ లో ఎన్నికల ఊపొచ్చింది. సీఎం కేసీఆర్ తనయురాలు కవితదే విజయమంటూ ఊహాగానాలు ఉన్నప్పటికీ.. దాదాపు వెయ్యి మంది రైతులు ఆమెకు వ్యతిరేకంగా బరిలోకి దిగుతుండటం ఆసక్తి రేపుతోంది.

గులాబీ బాస్ పెద్దపల్లి టికెట్ విషయంలో వివేక్ కు షాక్ ఇవ్వటానికి రీజన్ ఇదే గులాబీ బాస్ పెద్దపల్లి టికెట్ విషయంలో వివేక్ కు షాక్ ఇవ్వటానికి రీజన్ ఇదే

నిజామాబాద్ బరి.. కుదిరేనా గురి?

నిజామాబాద్ బరి.. కుదిరేనా గురి?


నిజామాబాద్‌ లోక్‌సభ పార్లమెంటరీ స్థానం ఈసారి చర్చానీయాంశంగా మారింది. మొన్నటి ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతటా టీఆర్ఎస్ హవా కనిపించడంతో.. లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఇక్కడ కారు జోరు కొనసాగుతుందనేది కొందరి భావన. అయితే కవిత పనితీరుపై కొంత అసంతృప్తి వ్యక్తం కావడం ఆమె విజయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మద్దతు ధర కోరుతూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగినా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం తమను పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు పసుపు, ఎర్రజొన్న రైతులు. ఆ క్రమంలో కవితకు వ్యతిరేకంగా దాదాపు వెయ్యిమంది రైతులు నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు.

నిజామాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. జగిత్యాల, కోరుట్ల, బాల్కొండ, బోధన్, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్. అన్నీ చోట్ల అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధించారు. 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉండటంతో కవిత గెలుపు సునాయసం అనేది గులాబీశ్రేణుల వాదన. కేసీఆర్ నేతృత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కూడా ప్లస్ పాయింట్ అవుతాయనేది మరో కోణం.

నో ఇంట్రెస్ట్..! చూద్దాం ఈసారి?

నో ఇంట్రెస్ట్..! చూద్దాం ఈసారి?

నిజామాబాద్ లోక్‌సభ బరిలో నాలుగోసారి పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ అభ్యర్థి మధు యాష్కి. అమెరికా నుంచి ఎన్నారైగా ఇండియాకు తిరిగొచ్చిన మధుయాష్కి తొలిసారిగా 2004లో పోటీ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పుడు కాంగ్రెస్ హవా నడుస్తోంది. నిజామాబాద్ స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం మహామహులు పోటిపడ్డా చివరకు మధుయాష్కిని వరించింది. టీడీపీ అభ్యర్థి సయ్యద్ యూసుఫ్ అలీపై లక్షకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అనంతరం 2009 లో మళ్లీ కాంగ్రెస్ తరపున పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి బిజాల గణేశ్ గుప్తాపై 60 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2014 లో టీఆర్ఎస్ నుంచి బరిలో నిలిచిన కల్వకుంట్ల కవిత చేతిలో ఓటమి పాలయ్యారు.

2004, 2009లో రెండుసార్లు నిజామాబాద్ ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు మధుయాష్కి. నిజామాబాద్ లోక్‌సభ సెగ్మెంట్ లో ఆయనపై కొంత వ్యతిరేకత లేకపోలేదు. ఎంపీగా ఉన్న సమయంలో స్థానికంగా అందుబాటులో లేరనే ఆరోపణలున్నాయి. అదలావుంటే టీఆర్ఎస్ హవాతో ఈసారి కూడా కవిత గెలుస్తుందనే కారణంతో.. మధుయాష్కి నిజామాబాద్ నుంచి పోటీచేయబోరనే ప్రచారం జరిగింది. ఒకానొక దశలో భువనగిరి టికెట్ ఆశించారనే వార్తలొచ్చాయి. కానీ చివరకు అధిష్టానం నిజామాబాద్ స్థానం నుంచి ఆయనకు టికెట్ కేటాయించింది. మధుయాష్కి విజయానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక ఓటు లాభిస్తుందనేది కాంగ్రెస్ శ్రేణుల ధీమా.

బరిలో అర్విందుడు.. కలిసొచ్చేనా?

బరిలో అర్విందుడు.. కలిసొచ్చేనా?

ధర్మపురి అర్వింద్. బీజేపీ యువనేత. నిజామాబాద్ లోక్‌సభ పరిధిలో పార్టీ యువతకు మార్గదర్శిలా నిలుస్తున్నారు. ఒకవైపు వ్యాపారవేత్తగా రాణిస్తూనే ఇటు రాజకీయాల్లో క్రీయాశీలక పాత్ర పోషిస్తున్నారు. అంతేకాదు తన ట్రస్టు ద్వారా చిన్నపిల్లల వైద్యానికి లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారనే పేరుంది. అన్న అని పిలిస్తే చాలు నేనున్నాననే అభయమివ్వడం.. ఆయనకు ప్లస్ పాయింట్ అనేది కార్యకర్తల అంతరంగం.

వివిధ సందర్భాల్లో సిట్టింగ్ ఎంపీ కవితపై సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. కొంతకాలం నుంచి నియోజకవర్గంపై దృష్టి సారించి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. వినూత్నంగా వీడియోలు రూపొందించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. యువత బాగా ఇష్టపడే అర్వింద్.. తన విజయం కోసం పక్కా ప్లాన్ తో ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది. మోడీ హవా, కేంద్ర ప్రభుత్వ పథకాలు అర్వింద్ విజయానికి అనుకూలంగా అభివర్ణిస్తున్నారు పార్టీశ్రేణులు.

కవిత మైనస్ పాయింట్స్.. అయినా?

కవిత మైనస్ పాయింట్స్.. అయినా?

నిజామాబాద్ జిల్లాలో పసుపు పండించే రైతులు ఎక్కువ. అందుకే కేంద్రాన్ని ఒప్పించి, పసుపు బోర్డును తీసుకొస్తానని హామీ ఇచ్చారు కవిత. అయితే ఆ హామీ ఇప్పటివరకు నెరవెరలేదు. అలాగే బోధన్, ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీలు ఇంతవరకు తెరుచుకోకపోవడం ఆమెకు పెద్ద మైనస్ గా చెప్పొచ్చు. ఇక మద్దతు ధర కోరుతూ పసుపు, ఎర్రజొన్న రైతులు కొంతకాలంగా ఆందోళన చేస్తున్నా వారిని పట్టించుకోలేదనే ఆరోపణలున్నాయి. ఇన్నీ బలహీనతల మధ్య కవిత ఏవిధంగా ముందుకెళతారోననేది ఆసక్తిగా మారింది. అయితే రాష్ట్రంలో కారు జోరు ఉండటంతో కవిత విజయం ఈజీయే అంటున్నారు కొందరు.

 దేఖింగే కౌన్ జితేగా?

దేఖింగే కౌన్ జితేగా?

నిజామాబాద్ లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలో గత ఎన్నికల్లో ఆయా పార్టీల అభ్యర్థులు సాధించిన మెజార్టీ చూసినట్లయితే ఇతర స్థానాల్లో కంటే చాలా తక్కువనే చెప్పాలి. 2014 లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన కల్వకుంట్ల కవిత.. కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కిపై లక్షా 67 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అప్పుడు మధుయాష్కికి 2 లక్షల 72 వేల 123 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మినారాయణకు 2 లక్షల 25 వేల 333 ఓట్లు వచ్చాయి.

ఇక 2009 లో కాంగ్రెస్ తరపున పోటీచేసిన మధుయాష్కి.. టీఆర్ఎస్ అభ్యర్థి బిజాల గణేశ్ గుప్తాపై 60 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2004 లో కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కి.. టీడీపీ క్యాండిడేట్ సయ్యద్ యూసుఫ్ అలీపై లక్షా 37 వేల 871 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ పార్లమెంటరీ స్థానంలో మెజార్టీ ఓట్లు అంత పెద్దగా లేకపోవడం.. త్రిముఖ పోటీ నెలకొనడం గెలుపోటములపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. ఈ సెగ్మెంటులో బీజేపీకి కొంత ఓటు బ్యాంకు ఉండటం ఆ పార్టీకి కలిసొచ్చే అంశం. మొత్తానికి కవిత Vs మధుయాష్కి Vs అర్వింద్ రీతిగా సాగుతున్న నిజామాబాద్ పోరు ఎలాంటి ఫలితాలిస్తుందో చూడాలి.

English summary
The Lok Sabha elections are thrilling. Competition has become stable. TRS sitting MP Kalwakuntla Kavitha, Congress candidate Madhuyashki, BJP young leader Arvind .. The three triumphs are inevitable. There are speculations that about a thousand farmers are keen to come out contest against kalwakuntla kavitha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X