• search
  • Live TV
నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Nizamabad MLC election : కేసీఆర్ తనయకు ఎన్ని కష్టాలు.. ఎమ్మెల్సీ ఎన్నిక కోసం కవిత ఎదురుచూపులు

|

కేసీఆర్ తనయ,కల్వకుంట్ల కవితకు కష్టాలు తప్పడం లేదు. ఎమ్మెల్సీ ఎన్నిక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కవితకు ఎమ్మెల్సీ పదవి కరోనా కారణంగా అందని ద్రాక్షగా మారుతోంది. ఇక ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్ తో బీజేపీ కార్పొరేటర్లను, జడ్పిటిసి లను కారెక్కించే పనిలో ఉన్న గులాబీ పార్టీ నేతలు నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక వాయిదా పడటంతో ఉసూరుమంటున్నారు.

కవిత కోసం అన్నాతమ్ముల పోరాటం.. నిజామాబాద్ లో కాక పుట్టిస్తున్న రాజకీయం

ఎమ్మెల్సీ ఎన్నిక కోసం కవిత ఎదురుచూపులు

ఎమ్మెల్సీ ఎన్నిక కోసం కవిత ఎదురుచూపులు

కరోనాసెగ నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికను తాకింది. ఇందూరు స్ధానిక సంస్ధల ఎమ్మెల్సీని తమ ఖాతాలో వేసుకునేందుకు ఉవ్విళ్లూరిన అధికార పార్టీకి కరోనా రూపంలో సెగ తగిలింది. ఇక అది నేటికీ కొనసాగుతూ వస్తోంది. ఊహించని రూపంలో వాయిదాపడిన ఎన్నికకు సంబంధించి వాయిదాపర్వం అలాగే కొనసాగుతోంది. నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక వాయిదా ఈ నెల 22న మరో 45 రోజుల పాటు పొడిగిస్తూ ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశాలు జారీ చేశారు .దీంతో ఎమ్మెల్సీ పదవిపై ఆశ పెట్టుకున్న నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితకు ఎదురు చూపులు తప్పడం లేదు.

ఎన్నిక జరగక తీవ్ర అసహనానికి గురవుతున్న కవిత

ఎన్నిక జరగక తీవ్ర అసహనానికి గురవుతున్న కవిత

కెసిఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత టైమ్ అస్సలు బాలేదు. గత ఎన్నికల్లో పసుపు రైతుల ఆగ్రహానికి బలై బీజేపీ చేతిలో ఓటమిపాలైన కవిత అప్పటినుండి ఇప్పటివరకు రాజకీయంగా తన సామర్థ్యాన్ని చూపించలేకపోతున్నారు. ఇక కరోనా వ్యాప్తి చెందడానికి ముందు నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా నుండి ఎమ్మెల్సీగా బరిలోకి దిగిన కవిత ఎమ్మెల్సీ గా బాధ్యతలు చేపట్టడానికి కావలసిన పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ ఎన్నిక నిర్వహించకపోవడంతో తీవ్ర అసహనానికి గురవుతున్నారు.

కేవలం 20 నెలల పదవీ కాలం మాత్రమే ఉండటమే అసహనానికి కారణం

కేవలం 20 నెలల పదవీ కాలం మాత్రమే ఉండటమే అసహనానికి కారణం

ఈనెల 29 వరకు లాక్ డౌన్ పొడగించడం, 4వ విడత లాక్ డౌన్ మరోమారు పొడగించే అవకాశం ఉండటంతో ఎన్నికను మరో 45 రోజుల పాటు వాయిదా వేస్తూ ఎన్నికల కమిషన్ ఈ నెల 22న ప్రకటన విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం ఎన్నిక జరిగితే ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించి పదవిలో ఉండాల్సిన కవిత ఇంకా ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు.కేవలం 20 నెలల పదవీ కాలం మాత్రమే ఉండటంతో ఎన్నికను సాధ్యమైనంత తొందరగా నిర్వహించాలని అధికార పార్టీ భావిస్తే అందుకు భిన్నంగా ఎన్నికల కమిషన్ ఎన్నికలు వాయిదా వేస్తూ పోతుంది.

 టీఆర్ఎస్ శ్రేణులకు రుచించని ఎన్నిక వాయిదా

టీఆర్ఎస్ శ్రేణులకు రుచించని ఎన్నిక వాయిదా

ఇక ఈ పరిణామం టీఆర్ఎస్ శ్రేణులకు ఏమాత్రం రుచించడం లేదు. ఎన్నిక వాయిదా పడడం ఆపరేషన్ ఆకర్ష్ నిర్వహిస్తున్న టిఆర్ఎస్ శ్రేణులకు షాకింగ్ న్యూస్ కాగా ప్రతిపక్షాలకు కాస్త ఇది ఊరటనిచ్చే వార్త . నిజామాబాద్ స్దానిక సంస్ధల ఎమ్మెల్సీగా పనిచేసిన భూపతిరెడ్డిని పార్టీ ఫిరాయింపుల కింద తొలగించిన నేపథ్యంలో ఖాళీ అయిన ఆ స్ధానంలో ఎన్నిక నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. స్ధానిక సంస్ధల టీఆర్ఎస్ అభ్యర్ధిగా సీఎం తనయ మాజీ ఎంపీ కవిత బరిలో దిగడంతో టీఆర్ఎస్ కు బలం కూడా కావలసినంత ఉండటంతో కవిత ఎమ్మెల్సీ అవుతుందని భావించారు.

 ఎన్నిక వాయిదా పడటంతో పదవీ కాలం తగ్గిపోతుందని దిగులు

ఎన్నిక వాయిదా పడటంతో పదవీ కాలం తగ్గిపోతుందని దిగులు

కవిత రంగంలోకి దిగటంతో ఈ ఎన్నికలపైనే రాష్ట్రం అంతా ఒక్కసారిగా దృష్టి పెట్టింది . కాంగ్రెస్ , బీజేపీ నుంచి అభ్యర్ధులు బరిలో నిలిచారు. త్రిముఖ పోరు ఉన్నప్పటికీ స్ధానిక బలంతో కవిత ఎన్నిక లాంఛనంగా మారింది. ఐతే కరోనా ఎఫెక్ట్ తో ఎన్నికలను వాయిదా వేశారు అధికారులు. కరోనా కవిత చేపట్టే పదవిని ప్రస్తుతానికి ఆపింది . 2022 జనవరి 4వరకు ఎమ్మెల్సీ పదవి కాలం ఉండగా ఎన్నిక వాయిదా పడటంతో పదవీ కాలం తగ్గిపోతుందని గులాబీ శ్రేణులు ఆవేదన చెందుతున్నారు.

English summary
Telangana cm kcr's daughter Kavitha, who is expected to hold the post of MLC if the election is held as scheduled, is still waiting for the election. With only a 20-month tenure, but the Election Commission postpones the election .The ruling party feels that the election should be conducted as quickly as possible.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more