నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎంపీ అర్వింద్ రాజీనామా చేయాలి... పసుపు రైతుల డిమాండ్

|
Google Oneindia TeluguNews

నిజామాద్ ఎంపీ అర్వింద్ రాజీనామా చేయాలని నిజామాబాద్ పసుపు బోర్డు సాధన సమితి డిమాండ్ చేసింది. ఆయన రాజీనామా చేస్తే...పసుపు బోర్డు అదే వస్తుందని రైతులు చెప్పారు. అధికార పార్టీ అభ్యర్థి రాజీనామా చేయడం ద్వార దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుందని అప్పుడే కేంద్రం దిగివస్తుందని రైతులు డిమాండ్ చేశారు. అయితే ఎంపీ అర్వింద్ మాత్రం బోర్డుకు బదులుగా ప్రత్యేక ధరలను తీసుకువస్తున్నామని వివరించారు.

తెరపైకి వచ్చిన పసుపు బోర్డు

తెరపైకి వచ్చిన పసుపు బోర్డు

నిజామాబాద్‌లో మరోసారి పసుపు బోర్డు చర్చనీయంశంగా మారింది. గత ఎన్నికల్లో ప్రధాన నినాదంగా మారిన పసుపు బోర్డుతో మాజీ ఎంపీ కవితను సైతం ఓడించి... తన గెలుపుకు కారణమైన ఎంపీ అర్వింద్ వ్యవహరశైలిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బోర్డును సాధించేందుకు రైతులు నడుం బిగించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, బోర్డును ఏర్పాటు చేయాలంటే ఎంపీగా ఉన్న అర్వింద్ రాజీనామా చేయాలని రైతులు డిమాండ్ లేవనెత్తారు. బోర్డు సాధన సమితీ ఈమేరకు నిజామాబాద్‌లో సమావేశమై న రైతులు బోర్డు సాధనపై చర్చించారు. రాజీనామా చేసిన ఎంపీ వెంట తామంతా ఉంటామని హామీ ఇచ్చారు.

రాజీనామా ద్వారనే బోర్డు సాధ్యం పసుపు రైతులు

రాజీనామా ద్వారనే బోర్డు సాధ్యం పసుపు రైతులు

ఈనేపథ్యంలోనే పలువురు రైతులు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. పసుపు బోర్డుపై దేశవ్యాప్తంగా చర్చ వచ్చినప్పుడే బోర్డు సాధన సాధ్యమవుతుందని రైతులు సమావేశంలో అభిప్రాయపడ్డారు. బోర్డు లేకుండా ఏ ఇతర ప్రత్నామ్నాయాలు రైతులకు మేలు చేకూర్చవని ఖరాఖండిగా చెప్పారు. ఇక పసుపు సమస్యలపై చర్చించేందుకు ఏర్పాటైన కమీటి సభ్యుల్లో ఎవ్వరికి సరైన అవగాహన లేదని, ఎంపీ అర్వింద్‌తో పాటు సభ్యులకు కూడ పసుపు పంటలు కూడ లేవని అన్నారు. అలాంటప్పుడు రైతుల కోసం పాదయాత్ర చేస్తామని చెప్పడం కరెక్టుకాదని రైతులు చెప్పారు. రైతుల కష్టాలు గట్టేక్కాలంటే... బోర్డు ఏర్పాటు మాత్రమే శాశ్వత పరిష్కారం లభిస్తుందని, రైతుల ఇచ్చిన హామీ మేరు అర్వింద్ కట్టుబడి ఉండాలని వారు సూచించారు.

బోర్డు అవసరం లేదు.. అంతకంటే మెరుగైన ప్యాకేజీ కేంద్రం ప్రకటిస్తుంది.

బోర్డు అవసరం లేదు.. అంతకంటే మెరుగైన ప్యాకేజీ కేంద్రం ప్రకటిస్తుంది.

అయితే బోర్డు పసుపు బోర్డు ఏర్పాటు పై ఎంపీ అర్వింద్ వివరణ ఇచ్చారు. ఓ వైపు రైతుల సమావేశం అవుతుండగా మరోవైపు ఆయన ప్రెస్ మీట్ ద్వార పలు అంశాలు తెలిపారు. ఈ సందర్భంగా పపుసు బోర్డు అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. పసుపు పంట అనేది కేవలం రాష్ట్రాల పంట మాత్రమేనని, దేశవ్యాప్తంగా మొత్తం లక్ష పదివేల ఎకరాల్లో మాత్రమే పసుపు పంటను సాగుచేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. అయితే మన రాష్ట్రంలో పసుపును అధికంగా పండిస్తారని వివరించారు. బోర్డు కాకుండా మరో ప్రత్నామ్నాయాన్ని కేంద్రం సూచించిందని త్వరలోనే అది ప్రారంభమవుతుందని చెప్పారు. దీని ద్వార రైతులకు బోర్డు కంటే ఎక్కువ లాభాలు కల్గుతాయని ఆయన చెప్పారు.

రైతుల మధ్య విభేదాలు

రైతుల మధ్య విభేదాలు

మరోవైపు పసుపు బోర్డు కాకుండా మొత్తం రైతుల సమస్యలపై పాదయాత్ర చేసేందుకు మరో రైతుల బృందం ప్రణాళికలు సిద్దం చేసింది. గత ఎన్నికల్లో అర్వింద్ తరుఫున పసుపుబోర్డుకు హమీ ఇచ్చి, బాండ్స్ ఇచ్చిన రైతులు ఇప్పుడు మొత్తం రైతుల ప్రయోజనాలంటూ పాదయాత్రకు సిద్దమయ్యారు. దీంతో నిజామాబాద్‌లో రైతుల మధ్యే విభేదాలు తలెత్తే విధంగా రాజకీయా పరిణానామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటు పసుపు బోర్డంటూ కొంతమంది, మొత్తం రైతుల ప్రయోజనం అంటూ మరికొంత మంది రైతులు సన్నద్దమవుతున్నారు. దీంతో నిజామాబాద్‌లో పసుపు బోర్డు రాజకీయం ఏవైపు దారికి తీస్తుందో వేచి చూడాలి.

English summary
Nizamabad turmeric farmers demanded that MP Arvind should resign for meber of parlament,then turmeric Board will be come to the state, they said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X