నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఢిల్లీలో సీఈసీని కలిసిన నిజామాబాద్ పసుపు రైతులు .. వారణాసి ఎన్నికల అధికారులపై ఫిర్యాదు

|
Google Oneindia TeluguNews

Recommended Video

ఢిల్లీలో CECని కలిసిన నిజామాబాద్ రైతులు !! || Oneindia Telugu

నిజామాబాద్‌ పసుపు రైతులు సీఈసీని కలిశారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో ప్రధాని నరేంద్ర మోడీపై పోటీ చేసేందుకు నామినేషన్లు వేసిన నిజామాబాద్‌ పసుపు రైతులు ఢిల్లీ చేరుకున్నారు. వారణాసిలో మొత్తం 25 మంది రైతులు నామినేషన్లు దాఖలు చేయగా వారిలో 24 మంది నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. ఒక్క రైతు మాత్రమే బరిలో ఉన్నారు. ఈ విషయంపై వారణాసి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘానికి రైతులు ఫిర్యాదు చేశారు.

నిజామాబాద్ రైతులకు షాక్ .. మోడీపై పోటీలో ఒకే ఒక్క పసుపు రైతు .. 24 మంది నామినేషన్లు తిరస్కరణనిజామాబాద్ రైతులకు షాక్ .. మోడీపై పోటీలో ఒకే ఒక్క పసుపు రైతు .. 24 మంది నామినేషన్లు తిరస్కరణ

వారణాసి ఎన్నికల అధికారులపై సిఈసికి ఫిర్యాదు చేసిన నిజామాబాద్ రైతులు

వారణాసి ఎన్నికల అధికారులపై సిఈసికి ఫిర్యాదు చేసిన నిజామాబాద్ రైతులు

తెలంగాణా రాష్ట్రంలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో అత్యధికంగా రైతులు పోటీ చేసి దేశం దృష్టిని ఆకర్షించారు అదే విధంగా మోడీపై పోటీ చేసి రైతులు పసుపు బోర్డు , మద్దతు ధర సాధించేందుకు పోరాటం చెయ్యాలని భావించారు .అయితే వారణాసిలో నామినేషన్లు వేసిన రైతులకు ఈసీ షాక్ ఇచ్చింది. 24 మంది రైతుల నామినేషన్లను తిరస్కరించింది. కేవలం ఒకేఒక్క రైతు నామినేషన్ ను అంగీకరించింది . దీంతో వారణాసి ఎన్నికల అధికారులపై సిఈసీకి ఫిర్యాదు చేశారు రైతులు .

అందరు రైతుల నామినేషన్లను అంగీకరించాలని సిఈసిని కోరిన రైతులు

అందరు రైతుల నామినేషన్లను అంగీకరించాలని సిఈసిని కోరిన రైతులు

ప్రస్తుతం మోడీపై పోటీలో ఉన్న ఒకేఒక్క పసుపు రైతు ఇస్తారి తరహాలోనే తాము నామినేషన్లు వేశామని ఆయన నామినేషన్ అంగీకరించిన ఎన్నికల అధికారులు తమ నామినేషన్లు ఎందుకు నిరాకరించారో చెప్పాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. తమ నామినేషన్లను సైతం అంగీకరించాలని వారు సిఈసిని కోరారు.

వారణాశి నుండి బరిలో ఉన్న మోడీకి బహిరంగ లేఖ రాయనున్న రైతులు .. పసుపు బోర్డు , గిట్టు బాటు ధరల సాధనే లక్ష్యంగా పోరాటం

వారణాశి నుండి బరిలో ఉన్న మోడీకి బహిరంగ లేఖ రాయనున్న రైతులు .. పసుపు బోర్డు , గిట్టు బాటు ధరల సాధనే లక్ష్యంగా పోరాటం

పసుపు బోర్డు ఏర్పాటు, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలనే డిమాండ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఎన్నికలను ఆయుధంగా ఎంచుకున్న నిజామాబాద్ పసుపు రైతులు ఎన్నికల బరిలోకి దిగారు. అయితే మోడీపై పోటీ చెయ్యటంలో మాత్రం విఫలం అయ్యారు. వారణాశి ఎన్నికల అధికారుల మీద సిఈసికి ఫిర్యాదు చేసిన పసుపు రైతులు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్తున్నారు. వారణాసి ఎన్నికల బరిలో ఉన్న మోడీకి బహిరంగ లేఖ రాయనున్నారు. పసుపు బోర్డు , గిట్టు బాటు ధరల సాధనే తమ లక్ష్యం అని చెప్తున్నారు.

English summary
The Nizamabad Turmeric Farmers who fought against Prime Minister Modi in Varanasi faced a stiff resistance. The Returning Officer has dismissed the 24-member Armoor farmers nominations in the nomination screwtinee. The farmers who belong to the Ergatla mandal farmar Isthari's nomination approved only. Farmers are angry about this. They allegedly rejected nominations farmers said .farmers went to Delhi to complaint on Varanasi election officers at CEC . They met CEC and complained on the election officers. they alleged that the election officers of Varanasi created problemsto the farmers intentionally and rejected the nominations . please take action on the officials and approve the nominations filed by them they asked the CEC.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X