నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సోషల్ మీడియా తెచ్చిన తంటా.. గల్ఫ్ జైల్లో నిజామాబాద్ యువకుడు

|
Google Oneindia TeluguNews

నిజామాబాద్ : సోషల్ మీడియా తెచ్చిపెట్టిన చిక్కులతో తెలంగాణకు చెందిన యువకుడు విదేశీ జైల్లో మగ్గుతున్నాడు. తెలిసి తెలియక చేసిన తప్పుకు కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు. ఉపాధి నిమిత్తం విదేశాల బాట పట్టిన సదరు యువకుడు సౌదీలో బందీగా మారాడు. అరచేతిలో ప్రపంచం చూసిన అతడు.. చెరసాలలో చిక్కుకున్నాడు.

 సోషల్ మీడియా ఎఫెక్ట్

సోషల్ మీడియా ఎఫెక్ట్

నిజామాబాద్ జిల్లాకు చెందిన యువకుడు.. సోషల్ మీడియా కారణంగా దేశం కాని దేశంలో జైలు జీవితం గడుపుతున్నాడు. పెర్కిట్ గ్రామానికి చెందిన చెన్న రాకేశ్
2017లో ట్విట్టర్ వేదికగా పెట్టిన ఓ పోస్టు అతడికి శిక్ష పడేలా చేసింది. మయన్మార్ లో రోహింగ్యాలపై దమనకాండను సమర్థిస్తూ ట్విట్టర్ లో పోస్టు పెట్టాడు. అయితే అతడు ట్వీట్ చేసిన కొద్దిసేపటికే చాలా ప్రాంతాల నుంచి అతన్ని సమర్థిస్తూ కొందరు రీట్వీట్ చేశారు. ఇదంతా కూడా వివాదస్పదంగా మారింది. ఓ వర్గం వారు ఆ ట్వీట్లకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోస్టు తొలగించినప్పటికీ..!

పోస్టు తొలగించినప్పటికీ..!

కొందరి ఫిర్యాదు మేరకు అక్కడి పోలీసులు రాకేశ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును విచారించిన అక్కడి కోర్టు రాకేశ్‌కు ఐదేళ్ల జైలుశిక్ష విధించింది. ప్రస్తుతం అతడు రియాద్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. 2017లో రాకేశ్ ఆ పోస్టు పెట్టినప్పటికీ.. కొద్దిసేపటి తర్వాత ఆయన రియలైజ్ అయి ట్విట్టర్ నుంచి దాన్ని తొలగించారు. కానీ అది అప్పటికే వైరల్ గా మారిందనే కారణంతో పోలీసులు కేసు బుక్ చేశారు.

సాయం కోసం ఎదురుచూపు

సాయం కోసం ఎదురుచూపు

గల్ఫ్ చట్టాల ప్రకారం సోషల్ మీడియాలో షేర్ చేసినవాళ్లు.. తెలియకుండా చేశామని తప్పు ఒప్పుకుంటే స్వల్ప శిక్షతో బయటపడే ఛాన్సుంది. అదే వివాదస్పద పోస్టులు పెట్టినవారు మాత్రం మూల్యం చెల్లించుకోక తప్పదు. రాకేశ్ విషయంలో సరిగ్గా అదే జరిగింది. ట్విట్టర్ లో వివాదస్పద పోస్ట్ పెట్టారనే కారణంగా అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఉన్నత న్యాయస్థానంలో అప్పీలు చేసుకునేందుకు గడువు సమీపిస్తుండటంతో రాకేశ్ విషయం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో రాకేశ్ కు సహకరించాలంటూ అతడి కుటుంబ సభ్యులు అభ్యర్థిస్తున్నారు.

English summary
A young man from Telangana is in a foreign jail with social media post. He made a post in twitter on myanmar rohingya attacks. Saudi police booked a case against him with some people complaint.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X