నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కలికాలం .. భార్యను చంపి జైలుకెళ్లిన తండ్రి.. బయటకొచ్చిన వెంటనే మట్టుబెట్టిన కుమారుడు

|
Google Oneindia TeluguNews

నిజామాబాద్ : మానవత్వం, విలువలు మంట గలిసిపోతున్నాయి. ప్రేమ, అనురాగాలకు తావేలేదు. ఏం జరిగిందో తెలియదు కానీ .. కట్టుకున్న భార్యనే మట్టుబెట్టాడో కీచకుడు. దర్జాగా జైలుకెళ్లి తిరిగొచ్చాడు. అయినా అతని వైఖరిలో మార్పు రాలేదు. ఎప్పటిలాగే ప్రవర్తిస్తూ .. చుట్టుపక్కల వారిని వేధించడం మొదలుపెట్టాడు. దీంతో అప్పటివరకు ఓపిక ఉన్న కుమారుడు సహనం నశించిపోయింది. తీరు మార్చుకోవాలని చెప్పి .. చెప్పి ... చివరకు మట్టుబెట్టాడు. నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది.

తల్లి తర్వాత తండ్రి ..
ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లిలో ప్రశాంత్ ఫ్యామిలీ ఉంటుంది. ఇతనికి తల్లిదండ్రులు ఉన్నారు. అయితే తండ్రి వేధింపులతో తల్లి, కుమారుడు తల్లడిల్లిపోయారు. 4 నెలల క్రితం తన భార్యనే చంపేశాడు కీచకుడు. దీంతో జైలుకెళ్లాడు. అయితే ఇటీవలే బెయిల్ వచ్చాడు తండ్రి. అయినా అతని తీరు మారలేదు. ఎప్పటిలాగే ప్రవర్తించడం ప్రారంభించాడు. చుట్టుపక్కల వారిని కూడా వేధించడం మొదలెట్టాడు. తండ్రి ప్రవర్తనతో కుమారుడు ప్రశాంత్ విసిగివేసారి పోయాడు. తీరు మార్చుకోవాలని సూచించాడు. అయినా ఆ తండ్రి మారలేదు. ఇక విసిగి వేసారిన కుమారుడు తండ్రిని హతమార్చాడు. తర్వాత పోలీసుల ఎదుట లొంగిపోయాడు. తన తండ్రి వేధింపులు తాళలేక హతమార్చినట్టు అంగీకరించారు. జరిగిన విషయాన్ని పోలీసులకు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

son murdered father

గ్రామంలో ఆరు నెలల లోపు రెండు హత్యలు జరగడం కలకలం రేపుతోంది. తండ్రి చేతిలో ప్రశాంత్ తల్లి చనిపోగా .. తండ్రి వేధింపులు తాళలేక అతనిని కుమారుడు హతమార్చాడు. జరిగిన దారుణంలో ప్రశాంత్ మాత్రం ప్రశాంత్ మాత్రం ఇటు తల్లిని, అటు తండ్రిని కోల్పోయాడు. తల్లిదండ్రి లేని ఒంటరి వాడయ్యాడు. దీంతో స్థానికులు ప్రశాంత్ పరిస్థితిని చూసి అయ్యో అని సానుభూతి తెలుపుకున్నారు.

English summary
The Prashant family is comprised of the Indalwai Mandala Ellareddipally. He has parents. However, the mother and son have been hurt by the father's abuse.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X