పదో తరగతి బాలికపై రేప్, లాడ్జీకి తీసుకెళ్లి లైంగికదాడి.. అధికార పార్టీ నేత
కామాంధులు రెచ్చిపోతున్నారు. చిన్నారులను లైంగికంగా వేధిస్తున్నారు. భయపెట్టి, బెదిరించి.. భయభ్రాంతులకు గురిచేసి మరీ రేప్ చేస్తున్నారు. నిత్యం ఎక్కడో చోట ఇలాంటి లైంగికదాడులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. అయితే చాలా సందర్భాల్లో బంధువులే నేరాలకు పాల్పడినట్టు బయటపడ్డాయి. తాజాగా కామారెడ్డిలో కూడా అలాంటి ఘటన బహిర్గతం అయ్యింది. అయితే సదరు వ్యక్తి అధికార పార్టీకి చెందిన నేత కావడం విశేషం. దీంతో వివాదం చెలరేగింది.
కామారెడ్డి జిల్లా మాచారెడ్డిలో దారుణం జరిగింది. పదో తరగతి బాలికపై సయ్యద్ ఆసిఫ్ అత్యాచారం చేశాడు. పదో తరగతి చదువుతున్న బాధితురాలికి సయ్యద్ ఆసిఫ్ మేనమామ అవుతాడు. ఇతను టీఆర్ఎస్ నేత కూడా.. ఇటీవల బాధితురాలి తల్లి చనిపోవడంతో తరచూ ఇంటికి వచ్చి వెళుతున్నాడు. సమయం, సందర్భం చూసుకున్నాడు. బాలికపై కన్నేసి.. లోబరచుకున్నాడు.

బాలికను బెదిరించి లాడ్జికి తీసుకెళ్లాడు. అక్కడ పలుమార్లు లైంగిక దాడి చేశాడు. తర్వాత ఎవరికైనా చెప్తే చంపేస్తానంటూ బెదిరించాడు. బంధువుల ఇంట్లో వదిలివెళ్లాడు. కానీ తర్వాత బాలిక అస్వస్థతకు గురయ్యింది. దీంతో అసలు విషయం వెలుగుచూసింది. సయ్యద్ ఆసిఫ్‌పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోక్సో తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
అధికార పార్టీకి చెందిన నేతపై లైంగిక ఆరోపణలు కలకలం రేపాయి. దీనిపై విపక్షాలు తప్పుపడుతున్నాయి. నేతలే ఇలా వ్యవహరిస్తే.. మిగతా వారి పరిస్థితి ఏంటీ అని అడుగుతున్నారు. ఇలా బీహెవ్ చేస్తే బాలికల సంగతి ఏంటీ అని ప్రశ్నిస్తున్నారు. వారికి రక్షణ కల్పించలేరా అని నిలదీస్తున్నారు.