నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వినాయక మండపంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే విగ్రహం .. మరో వివాదంలో గులాబీ పార్టీ

|
Google Oneindia TeluguNews

ఆధ్యాత్మికత వెల్లివిరియాల్సిన చోట టిఆర్ఎస్ పార్టీ తమ పార్టీ ప్రచారాన్ని చేసుకోవడం రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. యాదాద్రిలో శిల్పాలపై గులాబీ ప్రచారం పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తిన సమయంలో, నిజామాబాద్ జిల్లాలో గణేష్ ఉత్సవాల కోసం ఏర్పాటు చేసిన వినాయకమండపంలో ఓ టీఆర్ఎస్ ఎమ్మెల్యే విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వివాదాస్పదంగా మారింది.

 వినాయక మండపంలో ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విగ్రహం ఏర్పాటు

వినాయక మండపంలో ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విగ్రహం ఏర్పాటు

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి విగ్రహాన్ని వినాయక మండపంలో ఏర్పాటు చేశారు. ఓ పక్కన గణేష్ విగ్రహం, ఆ పక్కనే జీవన్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పలు విమర్శలకు తావిస్తోంది. గతంలో వరంగల్ జిల్లాలో అమ్రపాలి ఐఏఎస్ కలెక్టర్ గా ఉన్న సమయంలో అమ్రపాలి పై అభిమానంతో కాజిపేట్ లో యువకులు అమ్రపాలి విగ్రహాన్ని గణేశ మండపంలో పెట్టడం పెద్ద ఎత్తున విమర్శలకి కారణమైంది. దీనిపై ధ్వజమెత్తిన హిందూ సంఘాలు ఆమె విగ్రహాన్ని వినాయక మండపం నుండి తొలగించాయి. తాజాగా నిజామాబాద్ జిల్లాలో ఆర్మూరు లో వినాయక విగ్రహం తో పాటుగా జీవన్ రెడ్డి విగ్రహం ఏర్పాటు చెయ్యటం పై కూడా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వినాయకుడి సన్నిధిలో రాజకీయాలు అవసరమా అని మండిపడుతున్న హిందూ సంఘాలు

వినాయకుడి సన్నిధిలో రాజకీయాలు అవసరమా అని మండిపడుతున్న హిందూ సంఘాలు

జీవన్ రెడ్డి వినాయకవిగ్రహంతో ఉన్న తన విగ్రహాన్ని సందర్శించి తన విగ్రహం తో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితకు అత్యంత సన్నిహితుడిగా పేరుపొందిన జీవన్ రెడ్డి విగ్రహం వినాయకుడి మండపంలో పెట్టడం వివాదాస్పదంగా మారింది. హిందూ సంఘాల నేతలు దీనిపై పెద్ద ఎత్తున మండి పడుతున్నారు. వినాయకుడు సన్నిధిలో రాజకీయాలు అవసరమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వినాయక మండపంలో ఉన్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించాలని పెద్ద ఎత్తున డిమాండ్ సైతం వినిపిస్తుంది.

యాదాద్రిలో శిల్పాలపై గులాబీ ప్రచార వివాదంతో ఇరకాటంలో పడిన గులాబీ పార్టీకి కొత్త తలనొప్పి

యాదాద్రిలో శిల్పాలపై గులాబీ ప్రచార వివాదంతో ఇరకాటంలో పడిన గులాబీ పార్టీకి కొత్త తలనొప్పి

ఇప్పటికే తెలంగాణలో శిల్పాల వివాదం చిలికి చిలికి గాలివాన అయింది. యాదాద్రి ఆలయంలోని అష్టభుజి ప్రాకారంలోని స్తంభాలపై కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ గుర్తు కారు, హరితహారం, కేసీఆర్ కిట్ వంటి పథకాలను చెక్కారు. ఇది పెను దుమారానికి దారి తీసింది. దీంతో టీఆర్ఎస్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. యాదాద్రి ఆలయంలోని స్తంభాలపై కేవలం దైవ సంబంధిత చిత్రాలు మాత్రమే చెక్కించాలని, సీఎం కేసీఆర్ కానీ, ఇతరత్రా రాజకీయ చిహ్నాలు వద్దని ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి భాస్కర్ రెడ్డి యాదాద్రి ఆలయ అభివృద్ధి అధారిటీని ఆదేశించారు. దీంతో యాదాద్రి ఆలయంలో రాజకీయ చిత్రాలు తొలగించి ఆ స్థానంలో ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా పలు చిత్రాలను చెక్కించే పనిలో ఉన్నారు యాదాద్రి అభివృద్ధి కమిటీ.


ఇక ఇదిలా ఉంటె ఇప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యే విగ్రహం వినాయకమండపంలో ఏర్పాటు చెయ్యటంతో టీఆర్ఎస్ కు మరో తలనొప్పి పట్టుకుంది .

English summary
The statue of Jeevan Reddy has been installed at the Vinayaka Mandapam. The Ganesh idol and the Jeevan Reddy statue next to it have been criticized. MLA Jeevan Reddy's statue in the Vinayaka Mandapam is demanding the removal by the hindu organizations .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X