• search
  • Live TV
నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఇదిగో అసలు లెక్క... కేసీఆర్ పాపులారిటీ ఇందుకే తగ్గింది..

|

తెలంగాణ వచ్చి ఆరేళ్లయినా ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేకపోయారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. లక్ష ఉద్యోగాలు,దళితులకు మూడెకరాలు,నిరుద్యోగ భృతి హామీలపై ప్రభుత్వాన్ని అరవింద్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ లక్ష ఉద్యోగాలు ఇచ్చారని.. కానీ ఉద్యోగం వచ్చినవాళ్లకు ఆఫీస్ ఎక్కడుందో తెలియట్లేదని ఎద్దేవా చేశారు. అలాగే దళితులకు మూడెకరాల భూ పంపిణీ కూడా చేశారని... కానీ వారే సాగు చేసుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. నిరుద్యోగ భృతి ప్రభుత్వం ఇస్తోందని.. కానీ నిరుద్యోగులకు ఖాతాలు లేనందునే.. ఆ డబ్బులు రావట్లేదని ఎద్దేవా చేశారు. మిషన్ భగీరథ,మిషన్ కాకతీయ పేరిట వేల కోట్లు మాయమయ్యాయి కానీ నల్లాలకు నీళ్లు రావట్లేదన్నారు. కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు స్వాహా చేశారని.. రైతుకు వ్యవసాయ ఆదాయం మాత్రం పెరగలేదని ఆరోపించారు.

ఇలా అన్నింట్లో విఫలమయ్యారు కాబట్టే కేసీఆర్ పాపులారిటీ తగ్గిపోయిందన్నారు.

అక్రమ మైనింగ్ కు అడ్డులేదా..? తెలంగాణ సర్కార్ పై బీజేపి ఎంపీ అర్వింద్ ఫైర్..!

అవినీతి సర్వే చేస్తే నంబర్.1 స్థానంలో కేసీఆర్..

అవినీతి సర్వే చేస్తే నంబర్.1 స్థానంలో కేసీఆర్..

తెలంగాణ ఉద్యమంలో 'జై తెలంగాణ' అన్నవారు కేసీఆర్‌కు ఇప్పుడు శత్రువులు అయ్యారని.. 'జై సమైక్యాంధ్ర' అన్నవారు మిత్రులు అయ్యారని అరవింద్ విమర్శించారు. తెలంగాణ కేబినెట్‌ను గొర్రెల మంద అని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా దేశంలోని ముఖ్యమంత్రుల పెర్ఫామెన్స్‌పై వచ్చిన ఓ సర్వేను ప్రస్తావించారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మొదటి స్థానంలో ఉన్నారని,పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాలుగో స్థానంలో ఉన్నారని... కానీ దేశంలో ఎక్కడా లేని పథకాలు అమలుచేస్తున్నామని చెప్పుకునే కేసీఆర్ మాత్రం 16వ స్థానంలో నిలిచారని అన్నారు. పింకీ సామ్రాజ్యానికి ఇది తీవ్ర నిరాశ అని విమర్శించారు. ఒకవేళ అదే సంస్థ గనుక అవినీతిలో సర్వే చేపట్టి ఉంటే.. కేసీఆరే మొదటి స్థానంలో నిలిచేవాడని చెప్పారు.

ఉద్యోగాల సంగతేంటి..

ఉద్యోగాల సంగతేంటి..

శ్రీకృష్ణ కమిటీ 10 ఏళ్ల క్రితం ఇచ్చిన రిపోర్టులో లక్షా 7 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని పేర్కొందని ఎంపీ అరవింద్ గుర్తుచేశారు. ఆ సంఖ్య ఇప్పటికీ 2లక్షలు దాటి ఉంటుందని నిపుణుల చర్చల్లో తేలిందన్నారు. ఇప్పటికీ ఏటా ఉద్యోగుల రిటైర్మెంట్స్ జరుగుతున్నాయి కానీ కొత్త ఉద్యోగాలు మాత్రం రావట్లేదన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే లక్ష ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిన కేసీఆర్.. ఇప్పటివరకూ కేవలం 29,015 ఉద్యోగాలు ఇచ్చారన్నారు. మరో 7వేల ఉద్యోగాలు కోర్టు వివాదంలో ఉన్నాయన్నారు. 2019 కేలండర్‌ ఇయర్‌లో మరీ దారుణంగా 42 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారన్నారు. అదే సమయంలో పోలీస్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు 10వేలకు పైగా ఉద్యోగాలిచ్చి పార్టీ కోసం వాడుకుంటున్నాడని ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వ పథకంతో ఒక్క నిజామాబాద్‌లోనే..

కేంద్ర ప్రభుత్వ పథకంతో ఒక్క నిజామాబాద్‌లోనే..

తెలంగాణలో 28లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారని.. కానీ ఇప్పటికీ ఎలాంటి రిక్రూట్‌మెంట్స్ లేవని అన్నారు. అదే సమయంలో కేసీఆర్ కుటుంబానికి మాత్రం ఉద్యోగాలు పెరుగుతూనే ఉన్నాయన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ పథకం దీన్ దయాళ్ గ్రామీణ్ కౌశల్ యోజన కింద ఒక్క నిజామాబాద్‌లోనే 4600 మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. కేంద్రం ఇచ్చే ముద్ర రుణాల కింద నిజామాబాద్ జిల్లాలో 39వేల మంది రూ.630కోట్లు రుణాలుగా పొందారని చెప్పారు. తద్వారా ఒక్క నిజామాబాద్‌లోనే 45వేల మందికి ఉద్యోగ,ఉపాధి అవకాశాలు లభించాయన్నారు.

విద్యా శాఖను గాలికి వదిలేశారు...

విద్యా శాఖను గాలికి వదిలేశారు...

10 జిల్లాలను 33 జిల్లాలుగా చేసిన కేసీఆర్.. ఇప్పటికీ జిల్లా విద్యా శాఖ అధికారులను మాత్రం నియమించలేదని ఆరోపించారు. 60 మంది డీడీఈవోలకు ఇప్పటికీ ఐదుగురిని మాత్రమే నియమించారన్నారు. ఇక 565 ఎంఈవోలకు ఇప్పటికీ 500 పోస్టులు ఖాళీ ఉన్నాయన్నారు. తెలంగాణ యూనవర్సిటీలో 142 మంది ఫ్యాకల్టీకి కేవలం 80 మంది మాత్రమే ఉన్నారన్నారు. రాష్ట్రంలోని 9 యూనివర్సిటీలకు ఇప్పటికీ వీసీలను నియమించలేదన్నారు. కేసీఆర్ సర్కార్ విద్యా శాఖను నిర్లక్ష్యం చేస్తుండటంతో విద్యార్థుల భవిష్యత్ అంధకారంలో పడే ప్రమాదం ఏర్పడిందన్నారు.

కేంద్రం డబ్బులతో కేసీఆర్ గొప్పలు పోతున్నారని..

కేంద్రం డబ్బులతో కేసీఆర్ గొప్పలు పోతున్నారని..

కేంద్ర ప్రభుత్వ ఆవాస్ యోజన పథకాన్ని కూడా తెలంగాణలో కేసీఆర్ సర్కార్ అమలు చేయడం లేదని అరవింద్ ఆరోపించారు. కేసీఆర్ ఎలాగూ మూడెకరాల భూమి ఇవ్వరని.. కనీసం 300 గజాలు స్థలం ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఇల్లు కట్టిస్తుందన్నారు. రైతు బంధు కూడా ఇప్పటివరకూ 30 శాతం నుంచి 40శాతం మందికి మాత్రమే అందిందన్నారు. ఆఖరికి సీఎం రిలీఫ్ ఫండ్‌లోనూ కమిషన్లు తింటున్నారని ఆరోరపించారు. కేంద్ర ప్రభుత్వం స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కింద ఇచ్చిన రూ.599 కోట్ల నిధుల్లో నుంచే కేసీఆర్ పేదలకు రూ.1500 ఇచ్చారని అన్నారు. అలాగే కోవిడ్ 19 ఆసుపత్రుల నిర్మాణం కోసం ప్రభుత్వం ఇచ్చిన రూ.450 కోట్లు కూడా అటువైపే మళ్లించారని ఆరోపించారు. గల్ఫ్,ముంబై,సూరత్‌లలో చిక్కుకుపోయిన వలస కూలీలను స్వరాష్ట్రానికి రప్పించేందుకు కూడా ప్రభుత్వం ప్రయత్నించట్లేదన్నారు. అసలు ప్రభుత్వం వద్ద వలస కూలీల డేటానే లేదన్నారు. కరోనా టెస్టులు కూడా సరిగా చేయట్లేదని.. పక్క రాష్ట్రంలో 4లక్షల టెస్టులు చేస్తే.. తెలంగాణలో ఇప్పటివరకూ 30వేలు దాటలేదని అన్నారు.

English summary
Nizamabad MP Dharmapuri Arvind alleged that KCR has cheated Telangana people with fake promises in elections. Even after six years of his governance still single promise also not implemented by him,added Arvind.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X