నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్: హోంక్వారంటైన్‌లో జీవన్ రెడ్డి

|
Google Oneindia TeluguNews

నిజామాబాద్: జిల్లాలో మరో అధికార పార్టీ ఎమ్మెల్యే కరోనా బారినపడ్డారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి కరోనా పాజిటివ్ అని తేలింది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఒక రోజు చికిత్స తీసుకున్నారు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ప్రస్తుతం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఉన్నారు.

ముంబైలో కరోనా తగ్గింది: మూడు నెలల కనిష్టానికి కరోనా కేసులుముంబైలో కరోనా తగ్గింది: మూడు నెలల కనిష్టానికి కరోనా కేసులు

ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే గోవర్ధన్, అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా కరోనా బారినపడి కోలుకున్నారు.

 TRS MLA A Jeevan Reddy tests positive for COVID-19, now in home quarantine

తాజాగా, ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి కరోనా సోకింది. దీంతో ఇటీవల ఈ ఎమ్మెల్యేను కలిసిన అనుచరులు, కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. మున్సిపల్ కో-ఆప్షన్ పదవికోసం ఇటీవల జీవన్ రెడ్డి హైదరాబాద్ వెళ్లి కొందరు ఆశావాహులను కలిసినట్లు తెలిసింది. కాగా, ఇప్పటికే తెలంగాణలో పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారినపడిన విషయం తెలిసిందే. కొందరు ప్రజాప్రతినిధులు కరోనాబారినపడి ప్రాణాలు వదిలారు.

Recommended Video

రాజభవన్ వద్ద నిరసనకు పిలుపునిచ్చిన AICC

కాగా, తెలంగాణలో ఇప్పటి వరకు 58,906 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 14,663 యాక్టివ్ కేసులున్నాయి. 43,751 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాబారినపడి
492 మృతి చెందారు.

English summary
TRS MLA A Jeevan Reddy tested positive for coronavirus on Tuesday. He is the third MLA from Nizamabad district to get infected with coronavirus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X